కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lff పాఠం 4
  • దేవుడు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు ఎవరు?
  • ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎక్కువ తెలుసుకోండి
  • ఒక్కమాటలో
  • ఇవి కూడా చూడండి
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
  • దేవుని పేరేంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • దేవుని పేరు—దానిని ఉపయోగించడం, దాని అర్థం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీకు దేవుని పేరు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
lff పాఠం 4
4వ పాఠం. రాత్రిపూట టెలిస్కోప్‌లో నుండి కనిపిస్తున్న ప్రకాశవంతమైన నక్షత్రాలు, నక్షత్రవీధులు.

4వ పాఠం

దేవుడు ఎవరు?

ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి
ముద్రిత ప్రతి

వేల సంవత్సరాలుగా ప్రజలు ఎంతోమంది దేవుళ్లను, దేవతల్ని పూజిస్తున్నారు. కానీ, ఒక దేవుడు “ఇతర దేవుళ్లందరి కన్నా గొప్పవాడు” అని బైబిలు చెప్తుంది. (2 దినవృత్తాంతాలు 2:5) ఆయన ఎవరు? ప్రజలు పూజించే మిగతా దేవుళ్లందరి కన్నా ఆయనే ఎందుకు గొప్పవాడు? ఆయన తనను తాను మీకెలా పరిచయం చేసుకుంటున్నాడో ఈ పాఠంలో తెలుసుకుందాం.

1. దేవుని పేరు ఏంటి? మనం ఆ పేరు తెలుసుకోవాలన్నది ఆయన కోరికని ఎలా చెప్పవచ్చు?

దేవుడు బైబిలు ద్వారా తనను తాను మనకు పరిచయం చేసుకుంటున్నాడు: “నేను యెహోవాను. ఇదే నా పేరు.” (యెషయా 42:5, 8 చదవండి.) “యెహోవా” అనే పేరు హీబ్రూ భాష నుండి వచ్చింది. ఆ పేరుకు “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అనే అర్థముందని చాలామంది భాషా పండితులు చెప్తున్నారు. మనం తన పేరు తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (నిర్గమకాండం 3:15) అలాగని ఎలా చెప్పవచ్చు? బైబిల్లో ఆయన తన పేరును 7,000 కన్నా ఎక్కువసార్లు రాయించాడు!a అవును, “పైన ఆకాశంలో, కింద భూమ్మీద” ఒక్కడే సత్యదేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా.—ద్వితీయోపదేశకాండం 4:39.

2. బైబిలు యెహోవా గురించి ఏం చెప్తుంది?

మనుషులు పూజించే దేవుళ్లందరిలో యెహోవాయే నిజమైన దేవుడని బైబిలు చెప్తుంది. ఎందుకు? కొన్ని కారణాలు చూడండి. యెహోవా మాత్రమే “భూమంతటి పైన మహోన్నతుడు,” అంటే ఆయనకు అందరి మీద అధికారం ఉంది. (కీర్తన 83:18 చదవండి.) ఆయన “సర్వశక్తిమంతుడు,” ఏది చేయాలనుకుంటే అది చేసే శక్తి ఆయనకు ఉంది. ఆయన ఈ విశ్వాన్ని, భూమ్మీదున్న ప్రాణుల్ని, ‘అన్నిటినీ సృష్టించాడు.’ (ప్రకటన 4:8, 11) అంతేకాదు, యెహోవా మాత్రమే ఎప్పటినుండో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు.—కీర్తన 90:2.

ఎక్కువ తెలుసుకోండి

దేవుని పేరుకు, ఆయన బిరుదులకు ఉన్న తేడాను గమనించండి. దేవుడు మనకు తన పేరును ఎలా తెలియజేస్తున్నాడో, ఎందుకు తెలియజేస్తున్నాడో చూడండి.

ఒకతను రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆకాశంలో యెహోవా పేరు కనిపిస్తోంది.

3. దేవునికి చాలా బిరుదులు ఉన్నా, పేరు మాత్రం ఒక్కటే ఉంది

పేరుకు, బిరుదులకు ఉన్న తేడా తెలుసుకోవడానికి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

వీడియో: బిరుదులు ఎన్నో, కానీ పేరు ఒక్కటే (0:41)

  • దేవుని బిరుదులకు, ఆయన పేరుకు ఉన్న తేడా ఏంటి?

ప్రజలు చాలామంది దేవుళ్లను, ప్రభువులను పూజిస్తారని బైబిలు అంటోంది. కీర్తన 136:1-3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • “దేవాది దేవుడు,” “ప్రభువుల ప్రభువు” ఎవరు?

4. మీరు తన పేరు తెలుసుకుని, ఆ పేరుతో పిలవాలని యెహోవా కోరుకుంటున్నాడు

మీరు తన పేరు తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

వీడియో: దేవునికి పేరు ఉందా?—చిన్నభాగం (3:11)

‘దేవునికి పేరు ఉందా?—చిన్నభాగం’ వీడియోలోని ఒక చిత్రం. 1611 నాటి ‘కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌’ బైబిల్లో, కీర్తన 83:18లో ఉన్న యెహోవా పేరును ఒకతను పరిశీలిస్తున్నాడు.
  • తన పేరు అందరూ తెలుసుకోవాలన్నది యెహోవా కోరిక అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

ప్రజలు తన పేరు ఉపయోగించి ప్రార్థించాలని యెహోవా కోరుకుంటున్నాడు. రోమీయులు 10:13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా దేవుని పేరు ఉపయోగించడం ఎంత ప్రాముఖ్యం?

  • ఎవరైనా మీ పేరు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పేరుతో పలకరిస్తే మీకెలా అనిపిస్తుంది?

  • మీరు యెహోవాను ఆయన పేరుతో పిలిస్తే ఆయనకు ఎలా అనిపిస్తుంది?

5. మీరు తనకు దగ్గరవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు

దేవుని పేరు తెలుసుకోవడం కన్నా గొప్ప సంతోషం ఇంకొకటి ఉండదు అని సొటెన్‌ అనే ఆమె చెప్తుంది. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

వీడియో: నేను సత్యదేవుని గురించి తెలుసుకోవాలనుకున్నాను (8:18)

చిత్రాలు: ‘నేను సత్యదేవుని గురించి తెలుసుకోవాలనుకున్నాను’ వీడియోలోని చిత్రాలు. 1. సొటెన్‌ అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని, ఆకాశం వైపు చూస్తూ, సత్యదేవునికి ప్రార్థిస్తోంది. 2. దేవుని పేరు యెహోవా అని హెరాల్డ్‌ అనే అతను సొటెన్‌కు చెప్తున్నాడు.
  • దేవుని పేరు తెలుసుకోవడం వల్ల సొటెన్‌ జీవితం ఎలా మారిపోయింది?

మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే, ముందుగా వాళ్ల పేరు తెలుసుకుంటారు కదా. యాకోబు 4:8 ఎ చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా మిమ్మల్ని ఏమని ఆహ్వానిస్తున్నాడు?

  • దేవుని పేరు తెలుసుకుని, ఆయన్ని ఆ పేరుతో పిలవడం వల్ల మీరు ఆయనకు దగ్గరవ్వవచ్చని అనిపిస్తుందా? ఎందుకు?

కొంతమంది ఇలా అంటారు: “దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా ఫర్వాలేదు.”

  • దేవుని పేరు యెహోవా అని మీరు నమ్ముతున్నారా?

  • ప్రజలు తనను తన పేరుతో పిలవాలన్నది దేవుని కోరికని మీరు వాళ్లకు ఎలా వివరిస్తారు?

ఒక్కమాటలో

నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. మనం ఆ పేరు తెలుసుకుని, తనను ఆ పేరుతో పిలవాలని, అలా తనకు దగ్గరవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • ప్రజలు పూజించే మిగతా దేవుళ్లందరి కన్నా యెహోవా ఎందుకు గొప్పవాడు?

  • మనం దేవుణ్ణి ఆయన పేరుతో ఎందుకు పిలవాలి?

  • మీరు తనకు దగ్గరవ్వాలన్నది యెహోవా కోరికని ఎలా చెప్పవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఐదు బలమైన రుజువులు పరిశీలించండి.

“దేవుడు నిజంగా ఉన్నాడా?” (jw.org ఆర్టికల్‌)

దేవుడు ఎప్పటినుండో ఉన్నాడని, ఎప్పటికీ ఉంటాడని నమ్మడం ఎందుకు సరైనదో తెలుసుకోండి.

“దేవుణ్ణి ఎవరు సృష్టించారు?” (కావలికోట, అక్టోబరు-డిసెంబరు 2014)

దేవుని పేరును పూర్వ కాలంలో ఎలా పలికేవాళ్లో తెలియకపోయినా మనం దాన్ని ఎందుకు ఉపయోగించాలో చూడండి.

“యెహోవా ఎవరు?” (jw.org ఆర్టికల్‌)

దేవుణ్ణి ఎలా పిలిచినా ఫర్వాలేదా? ఆయనకు ఒకేఒక్క పేరు ఉందని మనం ఎందుకు చెప్పవచ్చో తెలుసుకోండి.

“దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి?” (jw.org ఆర్టికల్‌)

a దేవుని పేరుకు ఉన్న అర్థం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, అలాగే కొన్ని బైబిలు అనువాదాల్లో ఆ పేరు ఎందుకు తీసేశారో తెలుసుకోవడానికి పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో అనుబంధం A4 చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి