పాట 127
నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి
1. జీవితమిచ్చావు, కృతజ్ఞతగా
ఏమివ్వను నీకు యెహోవా, నా దేవా?
నీ వాక్యమనే అద్దంలో నన్ను నేను
చూసుకునేలా తేటగా సాయం చేయి.
(బ్రిడ్జ్)
చేశాను అంకితం, నా జీవితము;
సంతోషముగానే చేస్తాను నీ సేవ.
పూర్ణమనస్సుతో సేవిస్తూ నిన్ను,
తెస్తా సంతోషం నీకెల్లప్పుడూ.
నీవు కోరినట్టు జీవించాలంటే,
ఏంచేయాలో నేను తెలుపు నా దేవా.
నమ్మకముగా సేవిస్తూ ఎల్లప్పుడూ,
సంతోషింపజేస్తాను నీ హృదయాన్ని.
(కీర్త. 18:25; 116:12; సామె. 11:20 కూడా చూడండి.)