పాట 78
‘దేవుని వాక్యాన్ని బోధించడం’
1. దేవుని వాక్యం బోధిస్తే,
వస్తుంది సంతోషం.
దానివల్ల మనం పొందే
ప్రయోజనాలెన్నో.
అనుకరిస్తాం క్రీస్తును,
బోధిస్తే ప్రేమతో.
వినేవాళ్లు దగ్గరౌతారు
యెహోవా తండ్రికి.
2. వాక్య ప్రకారం జీవిస్తూ,
సరైనది చేస్తాం;
దేవుడిచ్చే వెలుగును
ప్రసరింపజేస్తాం.
నింపుకుంటే హృదయాన్ని
దేవుని వాక్యంతో,
ఆసక్తితో దాన్ని బోధిస్తాం,
పాటిస్తూనే మనం.
3. యెహోవా సాయం చేస్తాడు
బోధించడానికి.
అమూల్యమైన వాక్యాన్ని,
ఎంతో ప్రేమిస్తాము.
వినేవాళ్లను ప్రేమిస్తూ
బోధిస్తే సత్యాన్ని
త్వరలోనే వాళ్లూ ఔతారు
మంచి బోధకులు!
(కీర్త. 119:97; 2 తిమో. 4:2; తీతు 2:7; 1 యోహా. 5:14 కూడా చూడండి.)