పాట 162
మాకు అన్నీ నువ్వే యెహోవా
1. జీవితం ఓ ప్రయాణం
కావాలిగా సార్థకం
ఉందా అర్థం? ఏంటా నిజం?
అంటూ మేం వెతికాం.
ఈ వేట ఏనాటిదో
నా లోటు తీరదేమో
ఉందో లేదో? అందుతుందో?
సంతృప్తి, సంతోషం.
(పల్లవి)
చూసాం, యెహోవా నీలో
సమాధానం, ఆశాదీపం.
ఉంటాం, యెహోవా నీతో
చంటిబిడ్డై నిత్యం.
మాకు ఎంతైనా,
నువ్వేగా మిన్న.
2. నీ మాటలే నింపాయి
నాలో శాంతి, సంతోషం.
ఈ జీవితం, నీకంకితం
కావాలి నీ స్నేహం.
నీ సత్యం పై నమ్మకం
అవ్వాలి నాలో స్థిరం
ఇదే మార్గం, మన గమ్యం.
అంటూ చెప్తా నిత్యం.
(పల్లవి)
చూసాం, యెహోవా నీలో
సమాధానం, ఆశాదీపం.
ఉంటాం, యెహోవా నీతో
చంటిబిడ్డై నిత్యం.
మాకు ఎంతైనా,
నువ్వేగా మిన్న.
చూసాం, యెహోవా నీలో
సమాధానం, ఆశాదీపం.
ఉంటాం, యెహోవా నీతో
చంటిబిడ్డై నిత్యం.
మాకు ఎంతైనా,
నువ్వేగా మిన్న.
చూసాం, యెహోవా నీలో
సమాధానం, ఆశాదీపం.
ఉంటాం, యెహోవా నీతో
చంటిబిడ్డై నిత్యం.
మాకు ఎంతైనా,
నువ్వేగా మిన్న.
(మత్త. 5:6; 16:24; యెష. 40:8; కీర్త. 1:1, 2; 112:1; 119:97; 2 తిమో. 4:4 కూడా చూడండి.)