పాట 58
శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం
1. ‘రాజ్య సత్యాన్ని చాటిచెప్పండి’
అని యేసు ఆజ్ఞాపించి,
బోధించాడు దైవ వాక్యం.
తండ్రితో స్నేహం సాధ్యమేనని
చాటించాడు ప్రతీచోట
ఎంతో ప్రేమతో.
ఇంటింటికి వెళ్తాం మేము
వీధుల్లోనూ ప్రకటిస్తాం
పోతాయనీ కష్టాలన్నీ త్వరలో.
(పల్లవి)
వెదుకుదాం
ఏ దేశం, జాతి, భాష ఐనా
వెదుకుదాం
వినే మనసున్నోళ్ల కోసం
వెదుకుదాం
ప్రతీచోట!
2. ఆగదు కాలం ఏమి చేసినా;
వినాలింకా ఎంతోమంది,
జీవాన్నిచ్చే సువార్తను.
ప్రేరేపిస్తుంది ప్రేమే మమ్మల్ని,
తిరిగెళ్లి దీనులకు
బోధించేందుకు.
వెదుకుతూ ఉన్నప్పుడు
మంచివాళ్లు కలుస్తారు;
సంతోషాన్ని నింపుతారు మనలో.
(పల్లవి)
వెదుకుదాం
ఏ దేశం, జాతి, భాష ఐనా
వెదుకుదాం
వినే మనసున్నోళ్ల కోసం
వెదుకుదాం
ప్రతీచోట!
(యెష. 52:7; మత్త. 28:19, 20; లూకా 8:1; రోమా. 10:10 కూడా చూడండి.)