పాట 7
యెహోవా, మన బలం
1. దేవా యెహోవా మా శక్తి, శైలం.
నీ వల్లేగా ఉన్నాం సంతోషంగా!
“మీరే నా సాక్షులు” అన్నావ్ దేవా
నీ వార్తే చాటిస్తాం మేం ధైర్యంగా!
(పల్లవి)
మా బండ రాయి, రక్షించే చేయి
రోజూ నీ పేరే మేం చాటిస్తాం.
ఊహించ సాధ్యమా నీ సామర్థ్యం!
నీ పేరే చాలు ఎత్తైన కోట!
2. నీ కాంతే చూస్తూ ఆనందిస్తున్నాం,
స్పష్టం చేస్తున్నావు సత్య మార్గం.
నీ రాజ్యం కోసం మేం జీవించేలా,
వాక్యంలో ఆజ్ఞలే దాచుంచావు.
(పల్లవి)
మా బండ రాయి, రక్షించే చేయి
రోజూ నీ పేరే మేం చాటిస్తాం.
ఊహించ సాధ్యమా నీ సామర్థ్యం!
నీ పేరే చాలు ఎత్తైన కోట!
3. ఆహ్లాదంగా చేస్తూ నీ ఇష్టాన్నే,
సాతాన్నే ఓడిస్తాం నీ సాయంతో.
సర్వాధిపత్యాన్నే స్థాపిస్తుంటే,
గర్వంగా చూస్తాం మేమంతా నిన్నే.
(పల్లవి)
మా బండ రాయి, రక్షించే చేయి
రోజూ నీ పేరే మేం చాటిస్తాం.
ఊహించ సాధ్యమా నీ సామర్థ్యం!
నీ పేరే చాలు ఎత్తైన కోట!
(2 సమూ. 22:3; కీర్త. 18:2; యెష. 43:12 కూడా చూడండి.)