పాట 1
యెహోవా గుణాలు
1. యెహోవా దేవా, సర్వశక్తుడా!
జీవాన్ని పోసి, జీవితాన్నిచ్చావు.
నింగి, నేల, సృష్టంతా ఐక్యంగా
స్తుతినిస్తాయి, అనుక్షణం.
2. ఓ న్యాయపీఠం నీ సింహాసనం.
ఎంతో అమోఘం నీ నీతి, తెలివి.
నీ ప్రతీమాట ఓ ఆణిముత్యం.
వింటే ఉంటుంది ప్రయోజనం.
3. ప్రేమకు నీవే ఓ ప్రతిబింబం.
ప్రతీ పనిలో అదెంతో సుస్పష్టం.
నీ గుణాల్ని, నామాన్ని చాటిస్తాం.
అదే మాకున్న గొప్ప వరం.