కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 76 పేజీ 180-పేజీ 181 పేరా 2
  • యేసు ఆలయాన్ని శుభ్రం చేస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు ఆలయాన్ని శుభ్రం చేస్తాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు దేవాలయాన్ని శుభ్రపరచడం
    నా బైబిలు కథల పుస్తకము
  • సత్యారాధన విషయంలో యేసుకున్న ఆసక్తి
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యెహోవా ఆరాధన కొరకైన ఆసక్తి
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ఆలయాన్ని మళ్లీ శుభ్రం చేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 76 పేజీ 180-పేజీ 181 పేరా 2
యేసు కొరడాతో జంతువుల్ని ఆలయం నుండి బయటికి తరిమేస్తూ, డబ్బు మార్చేవాళ్ల టేబుళ్లను పడేస్తున్నాడు

లెసన్‌ 76

యేసు ఆలయాన్ని శుభ్రం చేస్తాడు

క్రీ.శ. (క్రీస్తు శకం) 30వ సంవత్సరం వసంత కాలంలో అంటే బహుశా ఏప్రిల్‌ నెలలో యేసు యెరూషలేముకు వెళ్లాడు. పస్కా పండుగ చేసుకోవడానికి చాలామంది పట్టణానికి వచ్చారు. పండుగ చేసేటప్పుడు వాళ్లు జంతువుల్ని ఆలయంలో అర్పించేవాళ్లు. కొంతమంది జంతువుల్ని వాళ్లతోపాటు తెచ్చుకునేవాళ్లు, ఇంకొంతమంది యెరూషలేములో వాటిని కొనేవాళ్లు.

యేసు ఆలయానికి వెళ్లినప్పుడు కొంతమంది అక్కడ జంతువుల్ని అమ్మడం చూశాడు. వాళ్లు యెహోవాను ఆరాధించే స్థలంలో వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. యేసు ఏం చేశాడు? ఆయన తాళ్లతో ఒక కొరడాని చేసి గొర్రెల్ని, పశువుల్ని ఆలయం నుండి బయటికి తరిమేశాడు. డబ్బు మార్చే వాళ్ల టేబుళ్లను తోసేసి, ఆ రూకల్ని నేల మీద పడేశాడు. పావురాల్ని అమ్మేవాళ్లతో యేసు, ‘వీటిని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చకండి’ అని అన్నాడు.

యేసు చేసింది చూసి ఆలయంలో ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఆయన శిష్యులు మెస్సీయ గురించిన ఈ ప్రవచనాన్ని గుర్తుచేసుకున్నారు: ‘యెహోవా ఇంటి కోసం నేను చాలా ఆసక్తి చూపిస్తాను.’

తర్వాత క్రీ.శ. 33వ సంవత్సరంలో కూడా యేసు ఆలయాన్ని రెండవసారి శుభ్రం చేశాడు. ఎవరైనా తన తండ్రి ఇంటిని అగౌరవంగా చూస్తే యేసు ఊరుకోలేదు.

“మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.”—లూకా 16:13

ప్రశ్నలు: ఆలయంలో జంతువుల్ని అమ్మడం చూసి యేసు ఏం చేశాడు? యేసు ఎందుకలా చేశాడు?

మత్తయి 21:12, 13; మార్కు 11:15-17; లూకా 19:45, 46; యోహాను 2:13-17; కీర్తన 69:9

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి