కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ypq ప్రశ్న 5 పేజీలు 15-17
  • స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
  • యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • ఏడిపిస్తే ఏమిటి హాని?
    తేజరిల్లు!—1997
  • నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?
    కుటుంబం కోసం
  • ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
ypq ప్రశ్న 5 పేజీలు 15-17
ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని పిల్లలందరి ముందు ఏడిపిస్తున్నాడు

5

స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

అది ఎందుకు ప్రాముఖ్యం?

ఆ సమయంలో మీరేం చేస్తారనేదాన్ని బట్టి, పరిస్థితి మెరుగవ్వవచ్చు లేక ఇంకా ఘోరంగా తయారవ్వవచ్చు.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: థామస్‌కి ఇవాళ స్కూల్‌కి వెళ్లాలని లేదు. రేపు కూడా వెళ్లాలని లేదు. అసలు ఎప్పటికీ వెళ్లాలనుకోవట్లేదు. ఎందుకంటే, స్కూల్‌లో పిల్లలు మూడు నెలల నుండి అతనిమీద లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. అతణ్ణి నిక్‌నేమ్స్‌తో పిలుస్తున్నారు. కొన్నిసార్లయితే, కావాలనే తగిలి, అతని చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడేసేవాళ్లు. కానీ అనుకోకుండా తగిలినట్లు నటించేవాళ్లు. కొన్నిసార్లు వెనక నుండి వచ్చి నెట్టేవాళ్లు. వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద గుంపు ఉండేది. వాళ్లలో ఎవరు తనను నెట్టారో థామస్‌కి అర్థమయ్యేది కాదు. నిన్న అయితే, మరీ దారుణంగా, మేసేజ్‌ల ద్వారా కూడా బెదిరించారు ...

థామస్‌ స్థానంలో మీరుంటే, ఏం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

పరిస్థితులు పూర్తిగా మీ చేయిదాటిపోలేదు! నిజానికి, ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే మీరు బుద్ధి చెప్పవచ్చు. ఎలా?

  • వాళ్లను ఏమీ అనకండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘బుద్ధిహీనుడు తన కోపాన్నంతా చూపిస్తాడు జ్ఞానముగలవాడు కోపాన్ని అణచుకొని దాన్ని చూపించకుండా ఉంటాడు.’ (సామెతలు 29:11) వీలైనంతవరకు, మిమ్మల్ని ఏడిపిస్తున్నవాళ్లను మీరు (కనీసం పైకి మాత్రమైనా) ఏమీ అనకుండా ఉంటే, వాళ్లు వెనక్కి తగ్గుతారు.

  • ఎదురుతిరగకండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘కీడుకు ప్రతి కీడు చేయవద్దు.’ (రోమీయులు 12:17) మీరు ఎదురుతిరిగితే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారౌతుంది.

  • సమస్యకు దూరంగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” (సామెతలు 22:3) వీలైనంతవరకు, ఏడిపించేవాళ్ల దగ్గరికి వెళ్లకండి. అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండండి.

  • సరదాగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును.” (సామెతలు 15:1) మీరు సరదాగా ఉండడానికి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, మీరు లావుగా ఉన్నారని వాళ్లు అంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా “అవును, నాకూ అదే అనిపిస్తుంది. కాస్త బరువు తగ్గాలనుకుంటా!” అని అనవచ్చు.

  • మౌనంగా అక్కడనుండి వెళ్లిపోండి. నోరా అనే 19 ఏళ్ల అమ్మాయి ఇలా చెప్తుంది, “మీరు మౌనంగా ఉంటే, మీరు తెలివైనవాళ్లని, ఏడిపిస్తున్నవాళ్ల కంటే మీరే బలవంతులని చూపిస్తారు. అంతేకాదు మౌనంగా ఉండడం ద్వారా, ఏడిపించేవాళ్లకు లేని నిగ్రహం మీకుందని చూపిస్తారు.”—2 తిమోతి 2:24-26.

  • ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఏడిపించేవాళ్లు తరచూ, ఆత్మవిశ్వాసం లేనివాళ్లనే ఏడిపిస్తుంటారు. ఎందుకంటే, ఎన్ని మాటలన్నా అలాంటివాళ్లు తిరిగి ఏమీ అనలేరని వాళ్ల ఉద్దేశం. కానీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే, మిమ్మల్ని ఏడిపించేవాళ్లు వెనక్కి తగ్గుతారు.

  • పెద్దవాళ్లకు చెప్పండి. ఒకప్పుడు స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఒకరు ఇలా చెప్తున్నారు, “ఎవరైనా ఏడిపిస్తుంటే, దయచేసి పెద్దవాళ్లకు చెప్పండి. అలా చేయడమే సరైన పని. దానివల్ల, మిగతా పిల్లలు కూడా ఏడిపించేవాళ్ల బారిన పడకుండా తప్పించుకుంటారు.”

ఒక అబ్బాయి, తనను ఏడిపిస్తున్న వ్యక్తిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటున్నాడు

మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏడిపించేవాళ్ల కన్నా మీరే బలవంతులని చూపిస్తారు

మీకు తెలుసా?

ఏడిపించడం అంటే శారీరకంగా హింసించడమే కాదు, ఇవి కూడా ఉన్నాయి:

  • ఏడిపిస్తున్నవాళ్లు అనే మాటలు అగ్నిలా ఉంటాయి

    మాటలతో హింసించడం. “వాళ్లు అన్న మాటలు, నాకు పెట్టిన పేర్లు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాటల వల్ల, నేను ఎందుకూ పనికిరానిదాన్ననీ, నేను ఎవరికీ అక్కర్లేదనీ అనుకునేదాన్ని. ఆ మాటలకంటే దెబ్బలే నయం అనిపించేది.”—సెలె, 20.

  • తోటివాళ్లు తనను దూరంపెట్టడం వల్ల ఒంటరిగా కూర్చున్న ఒక అబ్బాయి

    నలుగురితో కలవనివ్వకపోవడం. “నా తోటివాళ్లు నన్ను దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. భోజనం చేసేటప్పుడు, నేను వాళ్లతోపాటు కూర్చోకూడదని, కావాలనే టేబుల్‌ దగ్గర ఖాళీ లేనట్లు నటించేవాళ్లు. సంవత్సరమంతా నేను ఏడుస్తూ ఒక్కదాన్నే భోజనం చేశాను.”—హ్యాలీ, 18.

  • వేరేవాళ్లు తనను ఆన్‌లైన్‌ మెసేజ్‌ల ద్వారా ఏడిపిస్తుంటే, భయపడుతున్న ఓ అమ్మాయి

    కంప్యూటర్‌ లేదా ఫోన్‌ ద్వారా చెడ్డ మెసేజ్‌లు పంపించడం (సైబర్‌ బుల్లీయింగ్‌). “కంప్యూటర్‌ ద్వారా పంపే ఒక్క చిన్న మెసేజ్‌ కూడా, ఇతరుల పేరును, వాళ్ల జీవితాన్ని పాడుచేయగలదు. వింతగా అనిపించినా అది నిజం!”—డానియల్‌, 14.

క్విజ్‌

అవును/కాదు

జవాబులు

1 ఏడిపించడం దాదాపు వేల సంవత్సరాల నుండి ఉంది.

1 అవును. ఉదాహరణకు, బైబిలు నెఫీలుల గురించి చెప్తుంది. నెఫీలులు అంటే “ఇతరుల్ని పడేసేవాళ్లు” లేదా ఇతరుల్ని ఏడిపించేవాళ్లు అని అర్థం.—ఆదికాండము 6:4.

2 ఏడిపించడం కేవలం సరదా కోసం చేసేదే. అదంత పెద్ద విషయమేమీ కాదు.

2 కాదు. ఏడిపించడం వల్ల, చాలామంది యౌవనులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

3 ఏడిపించేవాళ్లకు ఎదురుతిరిగితేనే వాళ్లు దాన్ని మానుకుంటారు.

3 కాదు. సాధారణంగా ఏడిపించేవాళ్లు బలంగా ఉంటారు, కాబట్టి వాళ్లకు ఎదురుతిరగడం వల్ల ఉపయోగం ఉండదు.

4 ఎవర్నైనా ఏడిపించడం మీరు చూస్తే, దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడమే మంచిది.

4 కాదు. ఎవర్నైనా ఏడిపిస్తున్నప్పుడు, ఊరికే చేతులు కట్టుకుని నిలబడడం కూడా తప్పే. మీరు దాన్ని చూసి కూడా, పెద్దవాళ్లకు చెప్పకపోతే, ఆ తప్పులో మీకూ వంతు ఉన్నట్లే.

5 ఏడిపించేవాళ్లు, పైకి గొప్పగా మాటలు చెప్పినా, లోపల మాత్రం భయపడుతుంటారు.

5 అవును. ఏడిపించేవాళ్లు పైకి గంభీరంగా కనిపించినా, లోపల మాత్రం చాలావరకు భయపడుతుంటారు. వేరేవాళ్ల కన్నా మేం తక్కువ కాదని చూపించుకోవడానికే వాళ్లు ఇతరుల్ని ఏడిపిస్తుంటారు.

6 ఏడిపించేవాళ్లు మారగలరు.

6 అవును. ఏడిపించేవాళ్లకు సహాయం అందిస్తే, వాళ్లు కూడా తమ ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకోగలరు.

  • నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే, నేను ఇలా చెప్తాను లేదా ఇలా చేస్తాను:

ఇంకా తెలుసుకోండి!

ఏడిపించేవాళ్లకు బుద్ధి చెప్పండి, కొట్టకుండానే

www.jw.org/te వెబ్‌సైట్‌లో, ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో చూడండి. (బైబిలు బోధలు > టీనేజర్లు అనే ట్యాబ్‌ కింద చూడండి)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి