కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 12
  • నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏడిపించడం అంటే ఏమిటి?​
  • ఎవరైనా వేరేవాళ్లను ఎందుకు ఏడిపిస్తుంటారు?​
  • ఎక్కువగా ఎవరిని ఏడిపిస్తారు?
  • మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే మీరేమి చేయవచ్చు?
  • స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • ఏడిపిస్తే ఏమిటి హాని?
    తేజరిల్లు!—1997
  • నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?
    కుటుంబం కోసం
  • ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 12

యువత అడిగే ప్రశ్నలు

నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

  • ఏడిపించడం అంటే ఏంటి?​

  • ఎవరైనా వేరేవాళ్లను ఎందుకు ఏడిపిస్తుంటారు?​

  • ఎక్కువగా ఎవరిని ఏడిపిస్తారు?​

  • మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే మీరేం చేయవచ్చు?​

మీ వయసువాళ్లు ఇచ్చే సలహాలు, ఏడిపించడం గురించి ఒక టీచర్‌ చెప్పిన మాటలు చదివి, ఏడిపించడం గురించి ఉన్న క్విజ్‌ కూడా చేయండి.

ఏడిపించడం చిన్న విషయం అనుకోవడానికి లేదు. ఒక బ్రిటీష్‌ స్టడీ ప్రకారం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన యౌవనుల్లో 40 శాతం మంది చావుకు ఏడిపించడం ఒక కారణమని నేషనల్‌ మీడియా చెప్తుంది.

ఏడిపించడం అంటే ఏమిటి?​

ఏడిపించడం అంటే శారీరకంగా హింసించడం మాత్రమే కాదు. ఈ కింది చెప్పినవన్నీ ఉండవచ్చు.

  •  మాటలతో హింసించడం. 20 ఏళ్ల సెలె ఇలా అంటుంది, “అమ్మాయిలు కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడతారు. వాళ్లు నాకు పెట్టిన పేర్లు, అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లు నాకు విలువే లేదని, నేను ఎవరికీ అక్కర్లేదని, ఎందుకూ పనికిరానని అనిపించేలా చేశారు. నా కన్ను కమిలిపోయేలా కూడా నన్ను కొట్టారు.”

  •  అందరిలో కలవనివ్వకపోవడం. “నా స్కూల్లో వాళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు. భోజనం చేసే దగ్గర నేను కూర్చోవడానికి, ఆ టేబుల్లో అస్సలు ఖాళీ లేదన్నట్లు చూపించేవాళ్లు. సంవత్సరమంతా ఏడుస్తూ ఒక్కదాన్నే భోజనం చేశాను” అని 18 ఏళ్ల హ్యాలీ చెప్తుంది.

  •  సైబర్‌బుల్లీయింగ్‌. ఇంటర్నెట్‌ ద్వారా ఎవరినైనా ఏడిపించడాన్ని సైబర్‌బుల్లీయింగ్‌ అంటారు. 14 ఏళ్ల డానియల్‌ ఇలా అంటున్నాడు “కంప్యూటర్‌లో రాసే కొద్ది మాటలతో మీరు ఒకరి పేరుని లేదా వాళ్ల జీవితాన్నే పాడుచేయవచ్చు. వినడానికి అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం.” ఫోన్‌ ద్వారా అసభ్యకరమైన ఫోటోలు లేదా మెసేజ్‌లు పంపించడం కూడా సైబర్‌బుల్లీయింగ్‌ కిందకే వస్తుంది.

ఎవరైనా వేరేవాళ్లను ఎందుకు ఏడిపిస్తుంటారు?​

సహజంగా కనిపించే కొన్ని కారణాలు.

  •  వాళ్లు కూడా అలాంటి వాటినే అనుభవించడం వల్ల. “నా తోటివాళ్లు నన్ను ఎంతగా ఏడిపించారంటే నేను విసిగిపోయి వాళ్లలో ఒకడిగా ఉండడం కోసం నేను కూడా ఇతరులను ఏడిపించడం మొదులుపెట్టాను. కానీ తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది” అని ఆంటోనియో అనే యౌవనుడు అంటున్నాడు.

  •  వాళ్లకు మంచి వాళ్ల ఆదర్శం లేకపోవడం వల్ల. “చాలాసార్లు ఇతరులను ఏడిపించే యౌవనులు, వాళ్ల అమ్మానాన్నలు, అన్నయ్య, అక్క, లేదా మిగిలిన కుటుంబ సభ్యులు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తారు. ఇంకా వాళ్లు కూడా ఇతరులతో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు” అని లైఫ్‌ స్ట్రాటజీస్‌ ఫర్‌ డీలింగ్‌ విత్‌ బుల్లీస్‌ అనే తన పుస్తకంలో జె. మెక్‌ గ్రా రాశారు.

  •  పైకి చాలా గొప్పవాళ్లలా ప్రవర్తిస్తారు కానీ లోపల మాత్రం తక్కువవాళ్లమని భావిస్తారు. “ఇతరులను ఏడిపించే పిల్లలు పైకి గొప్పవాళ్లలా కనిపిస్తూ, అలా వాళ్ల లోపలున్న తీవ్ర బాధను, అసంతృప్తిని దాచుకుంటారు” అని ది బుల్లీ, ది బుల్లీడ్‌ అండ్‌ ది స్టాండర్‌ అనే పుస్తకంలో బార్బారా కొలొరొసో అనే అమ్మాయి రాసుకుంది.

ఎక్కువగా ఎవరిని ఏడిపిస్తారు?

  •  ఒంటరిగా ఉండేవాళ్లను. ఇతరులతో చక్కగా మాట్లాడలేని వాళ్లు అందరిలో కలవలేరు. అలాంటి వాళ్లని ఇతరులు ఏడిపించే అవకాశం ఉంది.

  •  ఇతరులకు వేరుగా కనిపించే యౌవనులను. కొంతమంది యౌవనులు కనబడే తీరునుబట్టి, వాళ్ల జాతి లేదా మతాన్నిబట్టి లేదా వాళ్లలో ఉన్న ఏదైనా లోపాన్నిబట్టి ఏడిపిస్తుంటారు. ఏడిపించడానికి వీటిలో ఏదైనా కారణం కావొచ్చు.

  •  ఆత్మవిశ్వాసం లేని యౌవనులను. కొంతమంది యౌవనులు వాళ్ల గురించి వాళ్లు తక్కువగా భావిస్తారు. ఇతరులను ఏడిపించే అలవాటు ఉన్నవాళ్లు ఇలాంటి వాళ్లను తేలిగ్గా కనిపెట్టేస్తారు. వీళ్లు ఎవరేమన్నా ఏమి చేయలేరు కాబట్టి వీళ్లను ఏడిపించడం చాలా సులభం.

మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే మీరేమి చేయవచ్చు?

  •  దానికి ప్రతిస్పందిచకండి. కేలీ అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “ఏడిపించేవాళ్లు మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశంతోనే అలా చేస్తారు. కానీ దానికి మీరు ప్రతిస్పందిచకపోతే మెల్లమెల్లగా వాళ్లకు మిమ్మల్ని ఏడిపించాలనే ఆసక్తి తగ్గిపోతుంది.” బైబిలు ఇలా చెప్తుంది, “జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.”—సామెతలు 29:11.

  •  ఎదురు తిరగకండి. ప్రతీకారం తీర్చుకోవడం సమస్యను పరిష్కరించకపోగా దాన్ని ఇంకా పెద్దది చేస్తుంది. బైబిలు ఇలా చెప్తుంది, “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.”—రోమీయులు 12:17; సామెతలు 24:19.

  •  సమస్యకి వీలైనంత దూరంగా ఉండండి. ఏడిపించే ప్రజలకు, అలాంటి అవకాశమున్న పరిస్థితులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.—సామెతలు 22:3.

  •  ఊహించని విధంగా ప్రతిస్పందించండి. బైబిలు ఇలా చెప్తుంది, “మృదువైన మాట క్రోధమును చల్లార్చును.”—సామెతలు 15:1.

  •  సమయస్ఫూర్తిని చూపించండి. ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని “చాలా లావుగా ఉన్నావు” అని ఏడిపిస్తున్నారనుకోండి మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ, “అవును కాస్త తగ్గితే బాగుంటుందని నేనూ అనుకుంటున్నాను!” అనేయండి.

  •  అక్కడి నుండి వెళ్లిపోండి. 19 ఏళ్ల నోరా ఇలా అంటుంది, “మౌనంగా ఉండడం, మీరు మానసికంగా చక్కగా ఎదిగిన వ్యక్తని, మిమ్మల్ని ఏడిపించేవాళ్లకన్నా మీరే బలమైనవాళ్లని రుజువు చేస్తుంది. అంతేకాదు మిమ్మల్ని ఏడిపించేవాళ్లకు లేని నిగ్రహశక్తి మీకు ఉందని అది చూపిస్తుంది.”

  •  మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. రీటా అనే అమ్మాయి ఇలా అంటుంది, “మీరు భయపడుతున్నారు లేదా కంగారు పడుతున్నారు అని ఏడిపించేవాళ్లు గమనిస్తే, దాన్ని ఉపయోగించుకొని వాళ్లు మీకున్న ఆ కాస్త ధైర్యాన్ని కూడా పూర్తిగా పోగొట్టేస్తారు.”

  •  ఎవరికైనా చెప్పండి. ఒక సర్వే ప్రకారం ఇంటర్నెట్లో వేధింపులకు గురైన వాళ్లలో సగం కంటే ఎక్కువమంది సిగ్గువల్లనో (ప్రత్యేకించి అబ్బాయిలు) లేదా ఎదురుతిరిగితే ఏమైనా చేస్తారనే భయంతోనో జరిగే విషయాలను ఎవరికీ చెప్పరు. కానీ మీరు రహస్యంగా ఉంచేకొద్దీ వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. ఈ పీడ కల నుండి బయటపడాలంటే మీరు మొదటి అడుగుగా ఎవరికైనా చెప్పాలి.

మీ వయసువాళ్లు ఇచ్చే సలహాలు

“మిమ్మల్ని ఎవరైనా సులభంగా ఏడిపించే అవకాశమున్న ప్రదేశాలకు వెళ్లకండి. అటువంటి పరిస్థితులకు వీలైనంత దూరంగా ఉండండి. మిమ్మల్ని ఏడిపించేవాళ్లకు కూడా సమస్యలు ఉన్నాయని గుర్తుంచుకోండి. అలా గుర్తు చేసుకున్నప్పుడు వాళ్లన్న మాటలకు ఎక్కువ బాధపడకుండా ఉండగలుగుతారు.”—ఆంటోనియో.

“ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీరు నమ్ముతున్న వాటిని భయంతో విడిచిపెట్టకండి. మిమ్మల్ని ఏడిపించేవాళ్లకు మీమీద పెత్తనం చేసే అవకాశం ఇవ్వట్లేదని, వాళ్లను చూసి భయపడట్లేదని గమనించినప్పుడు చాలామంది ఏడిపించడం మానుకుంటారు.”​—జెస్సిక.

ఒక టీచర్‌ చెప్తున్న మాటలు

“ఏడిపించడం చాలా పెద్ద సమస్య. నేను స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు, క్లాసు రూమ్‌లోనే గొడవలు జరిగేవి. మూడో క్లాసు పిల్లల మధ్య కూడా గొడవలు జరిగేవి. కొంతమంది పిల్లలు అందరిలో గొప్ప అనిపించుకోవడానికి, అందరి మీద పెత్తనం చేయడానికి వేరే పిల్లలను ఏడిపించేవాళ్లు.

ఏడిపించేవాళ్ల గురించి ఎవరికైనా చెప్తే వాళ్లు పగ తీర్చుకుంటారని, లేదా క్లాసులో మిగతా పిల్లలు వాళ్లని నమ్మకద్రోహులుగా చూస్తారని, వేధింపులకు గురయ్యే చాలామంది ఆ విషయాన్ని ఎవరికీ చెప్పరు. దాని గురించి ఇంకేమీ చేయలేము అని కూడా అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తుంటే దయచేసి దాని గురించి ఎవరైనా పెద్దవాళ్లకు లేదా అధికారులకు చెప్పండి. అదే మీరు చేయాల్సిన సరైనపని. మీరలా చేస్తే మరొకరు వీటన్నిటినీ తప్పించుకోగలుగుతారు.”—జెనిలీ, అమెరికాలో ఒకప్పుడు స్కూల్‌ టీచర్‌.

క్విజ్‌

అవును/కాదు

  1. ఏడిపించడం కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది.

  2. ఏడిపించడం అంటే హాని కలుగకుండా సరదాగా చేసే పని. అది పెద్ద విషయమేమీ కాదు.

  3. ఎవరైనా ఏడిపిస్తుంటే వాళ్లకు ఎదురుతిరగడమే సరైన పద్ధతి.

  4. మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తున్నారంటే అందుకు మీరే కారణం.

  5. ఇదివరకు వేధింపులకు గురైన కొంతమంది ఇప్పుడు ఇతరులను వేధిస్తుంటారు.

  6. ఎవరినైనా ఏడిపించడం చూస్తే మీరు దాన్ని చూసీచూడనట్టు వదిలేయాలి.

  7. గొప్పలు చెప్పుకున్నా ఏడిపించేవాళ్లలో ఎక్కువగా అభద్రతా భావాలు ఉంటాయి.

  8. ఏడిపించేవాళ్లు మారవచ్చు.

జవాబులు

  1. అవును. ఉదాహరణకు బైబిలు నెఫీలీలు అనే గుంపు గురించి చెప్తుంది. ఆ పేరుకు “ఇతరులను పడేసేవాళ్లు” అని అర్థం.—ఆదికాండము 6:4.

  2. కాదు. ఏడిపించడం ఒక్కోసారి చావు-బతుకుల సమస్యగా మారవచ్చు. విషాదకరమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ వేధింపులకు గురైనవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు.

  3. కాదు. చాలావరకు ఏడిపించేవాళ్లు వాళ్లు ఏడిపిస్తున్న వాళ్లకంటే బలంగా ఉంటారు. మనం ఎదురుతిరిగినా వాళ్లను ఏమీ చేయలేము.

  4. కాదు. ఏడిపించడానికి తగినవాళ్లంటూ ఎవరూ ఉండరు. దేనికైనా ఏడిపించే వాళ్లే కారణం.

  5. అవును. విచారకరంగా కొంతమంది ఎవరైనా వాళ్లను బాధపెట్టినప్పుడు, వాళ్లు కూడా అలాగే ఇతరులను బాధపెట్టడం ద్వారా ఆ బాధను, కోపాన్ని తీర్చుకుంటారు.

  6. కాదు. అమాయకంగా చూస్తూ ఉండిపోవడం లాంటివి చేయకూడదు. ఎవరైనా వేరేవాళ్లను ఏడిపించడం మీరు చూసి కూడా ఏమీ చేయకపోతే మీరు కూడా ఆ సమస్య పెద్దది అవడానికి కారకులు అవుతారేగానీ, ఆ సమస్యను పరిష్కరించలేరు.

  7. అవును. ఏడిపించేవాళ్లలో కొంతమందికి బాగా అహం ఉంటుంది కానీ వాళ్లలో ఎక్కువమంది తమలో ఏదో లోపం ఉన్నట్లే భావిస్తారు. వాళ్లని వాళ్లు గొప్ప చేసుకోవడం కోసం ఇతరులను తక్కువ చేస్తుంటారు.

  8. అవును. ఇతరులు కలుగజేసుకొని సహాయం చేస్తే ఏడిపించేవాళ్లు కూడా వాళ్ల ఆలోచనా తీరును, ప్రవర్తనను మార్చుకుంటారు.—ఎఫెసీయులు 4:23 , 24.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి