కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bhs పేజీలు 3-7
  • దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?
  • బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • బైబిలు బోధిస్తోందిలో చదవండి
  • ఉపశీర్షికలు
  • దేవుడు భూమి మీద అద్భుతమైన మార్పులు చేస్తాడని బైబిలు చెప్తుంది.
  • బైబిలు బోధిస్తున్న వాటి నుండి ప్రయోజనం పొందండి
బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
bhs పేజీలు 3-7

దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?

మీరు న్యూస్‌ పేపర్‌ చదివినప్పుడు, టీవీ చూసినప్పుడు, లేదా రేడియో విన్నప్పుడు నేరాలు గురించి, యుద్ధాలు, ఉగ్రవాదం గురించి చూస్తారు, వింటారు. బహుశా మీరు ఏదైనా అనారోగ్యంతో లేదా ప్రియమైనవాళ్లు ఎవరైనా చనిపోయి బాధపడుతూ ఉండవచ్చు.

ఒక కుటుంబం రేడియోలో వార్తలు వింటున్నారు

ఇలా ఆలోచించండి:

  • నేను, నా కుటుంబం ఇలా ఉండాలనే దేవుడు కోరుకున్నాడా?

  • సమస్యలను పరిష్కరించుకోవడానికి నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?

  • నిజమైన శాంతి ఎప్పుడైనా వస్తుందా?

బైబిలు ఈ ప్రశ్నలకు నమ్మదగిన జవాబులు ఇస్తుంది.

దేవుడు భూమి మీద అద్భుతమైన మార్పులు చేస్తాడని బైబిలు చెప్తుంది.

  • మనుషులకు ఇంక ఏ బాధ ఉండదు, ఎవ్వరూ ముసలివాళ్లు అవ్వరు లేదా చనిపోరు.—ప్రకటన 21:4

  • “కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు.”—యెషయా 35:6

  • “గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి.”—యెషయా 35:5

  • చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు.—యోహాను 5:28, 29

  • ఎవరికీ అనారోగ్యం ఉండదు.—యెషయా 33:24

  • భూమి మీద ఉన్నవాళ్లందరికీ సమృద్ధిగా ఆహారం ఉంటుంది.—కీర్తన 72:16

    ముసలివాళ్లు కుర్రవాళ్లు అయిపోతారు, కుంటివాళ్లు గంతులు వేస్తారు, చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు, అనారోగ్యంతో, గుడ్డితనంతో ఉన్న వాళ్లు బాగు అవుతారు

బైబిలు బోధిస్తున్న వాటి నుండి ప్రయోజనం పొందండి

ఒక యెహోవాసాక్షి ఒకతనికి బైబిలు స్టడీ చేస్తున్నాడు

మీరు ముందు పేజీల్లో చదివిన విషయాలు కలల్లో మాత్రమే జరుగుతాయని మీకు అనిపించవచ్చు. కానీ దేవుడు అతి త్వరలో భూమి మీద ఆ మార్పులు చేస్తానని మాట ఇచ్చాడు. ఆయన వాటిని ఎలా చేస్తాడో బైబిలు వివరిస్తుంది.

బైబిలు అంతకన్నా ఎక్కువే చేస్తుంది. మనం నిజమైన సంతోషాన్ని అనుభవించడానికి, జీవితాన్ని ఆనందించడానికి ఇప్పుడు ఏమి అవసరమో కూడా బైబిలు చెప్తుంది. మీకు బాధ కలిగించే విషయాల గురించి ఒకసారి ఆలోచించండి. వాటిలో డబ్బు లేదా కుటుంబ విషయాలు, ఆరోగ్యం బాగోకపోవడం, మీకు ఇష్టమైన వాళ్లు ఎవరైనా చనిపోవడం లాంటి విషయాలు ఉండవచ్చు. ఈ సమస్యల్ని ఎలా తట్టుకోవాలో బైబిలు మీకు చెప్తుంది. అంతేకాదు క్రింద ఉన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా ఓదార్పును ఇస్తుంది:

  • మనకు బాధలు ఎందుకు వస్తాయి?

  • మన సమస్యల్ని ఎలా తట్టుకోవాలి?

  • మన కుటుంబం సంతోషంగా ఉండడం ఎలా?

  • చనిపోయాక మనకు ఏమౌతుంది?

  • చనిపోయిన మనవాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?

  • దేవుడు వాగ్దానం చేసినవన్నీ నెరవేరుస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు అంటే, మీకు బైబిలు ఏమి నేర్పిస్తుందో తెలుసుకోవాలనే కోరిక ఉందని తెలుస్తుంది. ఈ పుస్తకం మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. ఇందులో ఉన్న పేరాలకు ప్రశ్నలు ఉన్నాయి. అవి మీరు బైబిల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. యెహోవాసాక్షులతో బైబిలు చర్చలను లక్షలమంది ఆనందించారు. మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాం. బైబిలు నేర్పించే విషయాల్ని మీరు తెలుసుకుంటుండగా దేవుని ఆశీర్వాదం మీకు ఉండాలని ఆశిస్తున్నాం.

మీ బైబిలు గురించి తెలుసుకోండి

బైబిల్లో 66 పుస్తకాలు, ఉత్తరాలు ఉన్నాయి. ప్రతి పుస్తకాన్ని అధ్యాయాలుగా, వచనాలుగా వేరు చేశారు. దీనివల్ల వచనాన్ని వెదకడం సులువు అవుతుంది. ఈ పుస్తకంలో ఏదైనా వచనాన్ని చెప్పినప్పుడు, బైబిలు పుస్తకం పేరు తర్వాత వచ్చే నంబరు అధ్యాయాన్ని చూపిస్తుంది, తర్వాత నంబరు వచనాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు మీరు “2 తిమోతి 3:16” అని చూస్తే అది తిమోతికి రాసిన రెండవ ఉత్తరం 3వ అధ్యాయంలో 16వ వచనం అని అర్థం.

మీరు వచనాలు తెరిచి చూడడం ద్వారా బైబిల్లో ఏది ఎక్కడ ఉందో మీకు బాగా తెలుస్తుంది. మీరు బైబిలును రోజూ చదవడం మొదలుపెట్టవచ్చు. రోజుకు మూడు నుండి ఐదు అధ్యాయాలు చదివితే మీరు ఒక్క సంవత్సరంలోనే బైబిలు అంతా చదవవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి