కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 123 పేజీ 282-పేజీ 283 పేరా 1
  • యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • తోటలో కలిగిన మానసిక వ్యధ
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసు మానవ జీవితపు చివరి దినం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఆయన వెళ్లిపోవుట కొరకు అపొస్తలులను సిద్ధముచేయుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • “గడియ వచ్చియున్నది!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 123 పేజీ 282-పేజీ 283 పేరా 1
యేసు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను నిద్రపోతున్నారు

123వ అధ్యాయం

యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన

మత్తయి 26:30, 36-46 మార్కు 14:26, 32-42 లూకా 22:39-46 యోహాను 18:1

  • యేసు గెత్సేమనే తోటకు వెళ్లాడు

  • ఆయన చెమట రక్తపు చుక్కల్లా కారింది

యేసు తన నమ్మకమైన అపొస్తలులతో కలిసి ప్రార్థన చేశాడు. తర్వాత వాళ్లంతా “స్తుతిగీతాలు పాడి, ఒలీవల కొండకు” బయల్దేరారు. (మార్కు 14:26) వాళ్లు తూర్పు వైపుగా గెత్సేమనే తోటకు వెళ్లారు. యేసు తరచూ ఆ తోటకు వెళ్లేవాడు.

ఒలీవ చెట్లు ఉన్న ఆ ప్రశాంతమైన ప్రదేశానికి రాగానే, ఎనిమిదిమంది అపొస్తలుల్ని విడిచి యేసు కాస్త ముందుకు వెళ్లాడు. బహుశా వాళ్లు ఆ తోట ద్వారం దగ్గరే ఉండివుండవచ్చు. ఎందుకంటే ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకుంటాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి.” తర్వాత ముగ్గురు అపొస్తలుల్ని అంటే పేతురును, యాకోబును, యోహానును తనతోపాటు తోట లోపలికి తీసుకెళ్లాడు. ఆయన తీవ్రంగా ఆందోళనపడుతూ ఆ ముగ్గురికి ఇలా చెప్పాడు: “నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతోంది. మీరు ఇక్కడే ఉండి, నాతో పాటు మెలకువగా ఉండండి.”—మత్తయి 26:36-38.

ఆయన కాస్త ముందుకు వెళ్లి ‘మోకాళ్లూని, ప్రార్థించడం మొదలుపెట్టాడు.’ అంత తీవ్రమైన వేదనలో యేసు దేని గురించి ప్రార్థించాడు? “తండ్రీ, నీకు అన్నీ సాధ్యమే; ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి” అని ప్రార్థించాడు. (మార్కు 14:35, 36) విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు వెనకాడుతున్నాడని ఆ మాటలు సూచిస్తున్నాయా? ఎంతమాత్రం కాదు!

రోమన్లు మరణశిక్ష విధించేటప్పుడు ఎంత చిత్రవధ చేస్తారో యేసు పరలోకం నుండి చూశాడు. అయితే, ఇప్పుడు ఆయన ఒక మనిషిగా భూమ్మీద ఉన్నాడు కాబట్టి ఆయనకు నొప్పి, బాధ, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు ఉన్నాయి. అయినప్పటికీ, తనను ఎలా చంపుతారోనని ఆయన భయపడట్లేదు గానీ, తాను ఒక నేరస్తునిలా చనిపోవడం వల్ల తన తండ్రి పేరుకు ఎక్కడ అపకీర్తి వస్తుందోనని భయపడుతున్నాడు. దైవదూషణ చేసినవాళ్లను కొయ్య మీద వేలాడదీసి చంపినట్లు, ఇంకొన్ని గంటల్లో ఈయన్ని కూడా చంపేస్తారు.

యేసు చాలాసేపు ప్రార్థించి తిరిగొచ్చేసరికి ముగ్గురు అపొస్తలులు నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “మీరు నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయారా? మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి.” అయితే అపొస్తలులు కూడా బాగా అలసిపోయారని, అప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తించి యేసు ఇలా అన్నాడు: “మనసు సిద్ధమే కానీ శరీరమే బలహీనం.”—మత్తయి 26:40, 41.

యేసు మళ్లీ వెళ్లి, తన దగ్గర నుండి ‘ఈ గిన్నెను’ తీసేయమని దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన తిరిగొచ్చి చూసేసరికి, ఆ ముగ్గురు అపొస్తలులు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా ప్రార్థన చేయాల్సిందిపోయి, మళ్లీ నిద్రపోతున్నారు. యేసు అడిగినప్పుడు, “ఏం చెప్పాలో వాళ్లకు తోచలేదు.” (మార్కు 14:40) యేసు మూడోసారి వెళ్లి, మళ్లీ మోకాళ్లూని ప్రార్థించాడు.

తాను ఒక నేరస్తునిలా చనిపోతే, తండ్రి పేరుకు అపకీర్తి వస్తుందేమో అని ఆయన తీవ్రంగా ఆందోళన పడుతున్నాడు. యెహోవా తన కుమారుడు చేసిన ప్రార్థనలు వింటున్నాడు, అందుకే ఆ సమయంలో ఆయన్ని బలపర్చడానికి ఒక దేవదూతను పంపించాడు. అయినప్పటికీ, యేసు తండ్రిని వేడుకుంటూనే ఉన్నాడు, ‘తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాడు.’ ఆయన భావోద్వేగపరంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యాడు. యేసు భుజాలపై ఎంత బరువైన బాధ్యత ఉందో కదా! ఆయన, అలాగే విశ్వాసంగల మనుషులు శాశ్వత జీవితం పొందుతారా లేదా అనేది ఆయన మీదే ఆధారపడి ఉంది. ఆ సమయంలో, “ఆయన చెమట రక్తపు చుక్కల్లా నేల మీద పడుతోంది.”—లూకా 22:44.

యేసు మూడోసారి అపొస్తలుల దగ్గరికి వచ్చేసరికి, వాళ్లు మళ్లీ నిద్రపోతున్నారు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇలాంటి సమయంలో మీరు నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా! ఇదిగో! మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. లేవండి, వెళ్దాం. ఇదిగో! నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేశాడు.”—మత్తయి 26:45, 46.

ఆయన చెమట రక్తపు చుక్కల్లా కారింది

యేసు “చెమట రక్తపు చుక్కల్లా” ఎలా కారిందో వైద్యుడైన లూకా వివరించలేదు. (లూకా 22:44) అయితే, గాయం నుండి రక్తం చుక్కల్లా కారినట్టు యేసు చెమట కారిందని లూకా వర్ణిస్తుండవచ్చు. లేదా మరో కారణం ఏమైవుండొచ్చంటే, ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA) అనే పత్రికలో డాక్టర్‌ విలియమ్‌ డి. ఎడ్వర్డ్స్‌ ఇలా చెప్పాడు: ‘చెమటలో రక్తం మిళితమై రావడం (హెమటిడ్రోసిస్‌) చాలా అరుదు. అయితే, భావోద్వేగపరంగా విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు అలా జరగవచ్చు. ఆ సమయంలో రక్తనాళాల నుండి రక్తం చెమట గ్రంథుల్లోకి ప్రవేశించడం వల్ల చర్మం పెళుసుగా, సున్నితంగా అవుతుంది.’

  • మేడగదిలో ప్రార్థించిన తర్వాత యేసు తన అపొస్తలుల్ని తీసుకుని ఎక్కడికి వెళ్లాడు?

  • యేసు ప్రార్థిస్తున్న సమయంలో ముగ్గురు అపొస్తలులు ఏం చేస్తున్నారు?

  • యేసు “చెమట రక్తపు చుక్కల్లా” కారడం, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలియజేస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి