కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 98 పేజీ 228-పేజీ 229 పేరా 5
  • అపొస్తలులు గొప్ప స్థానాల కోసం మళ్లీ ఆరాటపడ్డారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపొస్తలులు గొప్ప స్థానాల కోసం మళ్లీ ఆరాటపడ్డారు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు మరణము సమీపించుచుండగా శిష్యులు వాదించుకొనుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఆయన వెళ్లిపోవుట కొరకు అపొస్తలులను సిద్ధముచేయుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • “గడియ వచ్చియున్నది!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 98 పేజీ 228-పేజీ 229 పేరా 5
సలోమే యేసు దగ్గరికి వచ్చి, తన కుమారుల తరఫున ఒక విన్నపం చేస్తుంది

98వ అధ్యాయం

అపొస్తలులు గొప్ప స్థానాల కోసం మళ్లీ ఆరాటపడ్డారు

మత్తయి 20:17-28 మార్కు 10:32-45 లూకా 18:31-34

  • తాను చంపబడతానని యేసు మళ్లీ చెప్పాడు

  • గొప్ప స్థానాలు కోరుకుంటున్న అపొస్తలుల్ని యేసు సరిదిద్దాడు

యేసు, ఆయన శిష్యులు పెరయ నుండి దక్షిణం వైపుగా యెరూషలేముకు ప్రయాణిస్తున్నారు. వాళ్లు యెరికో దగ్గర యొర్దాను నది దాటారు. అది సా.శ. 33వ సంవత్సరం. పస్కా పండుగ కోసం వాళ్లతోపాటు ఇతరులు కూడా యెరూషలేముకు ప్రయాణిస్తున్నారు.

పస్కా సమయానికల్లా యెరూషలేము చేరుకోవాలని యేసు తన శిష్యులకు ముందుగా నడుస్తున్నాడు. కానీ శిష్యులకు మాత్రం భయంగా ఉంది. ఎందుకంటే, అంతకుముందు లాజరు చనిపోయినప్పుడు యేసు పెరయ నుండి యూదయకు బయల్దేరుతున్న సందర్భంలో, మిగతా శిష్యులతో తోమా ఇలా అన్నాడు: “మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం.” (యోహాను 11:16, 47-53) యెరూషలేముకు వెళ్లడం ప్రమాదకరం కాబట్టి, వాళ్ల భయం అర్థం చేసుకోదగినదే.

త్వరలో జరగబోయే వాటికి అపొస్తలుల్ని సిద్ధం చేయడానికి, యేసు వాళ్లను పక్కకు తీసుకెళ్లి ఇలా అన్నాడు: “మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మానవ కుమారుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధిస్తారు; ఆయన్ని ఎగతాళి చేసి, కొరడాలతో కొట్టి, కొయ్య మీద వేలాడదీయడానికి అన్యజనులకు అప్పగిస్తారు. కానీ మూడో రోజున ఆయన మళ్లీ బ్రతికించబడతాడు.”—మత్తయి 20:18, 19.

యేసు తాను చంపబడతానని, పునరుత్థానం అవుతానని శిష్యులకు చెప్పడం ఇది మూడోసారి. (మత్తయి 16:21; 17:22, 23) అయితే ఈసారి మాత్రం, తాను కొయ్య మీద వేలాడదీయబడతానని స్పష్టం చేశాడు. వాళ్లు ఆయన మాటల్ని విన్నారు గానీ అర్థం చేసుకోలేకపోయారు. ఇశ్రాయేలు రాజ్యం ఈ భూమ్మీద మళ్లీ స్థాపించబడుతుందని, తాము ఇదే భూమ్మీద క్రీస్తుతోపాటు మహిమ, ఘనత పొందుతామని వాళ్లు అనుకుంటుండవచ్చు.

యాకోబు, యోహాను

యేసుతోపాటు ప్రయాణిస్తున్నవాళ్లలో బహుశా యాకోబు యోహానుల తల్లి అయిన సలోమే కూడా ఉంది. యాకోబు యోహానుల దుడుకు స్వభావం చూసి, యేసు ఆ ఇద్దరు అపొస్తలులకు “ఉరుము పుత్రులు” అని పేరుపెట్టాడు. (మార్కు 3:17; లూకా 9:54) క్రీస్తు రాజ్యంలో గొప్ప స్థానాలు పొందాలనే కోరిక వాళ్లలో కొంతకాలంగా ఉంది. వాళ్ల అమ్మకు కూడా ఆ విషయం తెలుసు. ఆమె యేసు దగ్గరికి వచ్చి, వంగి నమస్కరించి, వాళ్ల తరఫున ఒక విన్నపం చేసింది. అప్పుడు యేసు “నీకు ఏం కావాలి?” అని అడిగాడు. అందుకు ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారుల్లో ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకో” అంది.—మత్తయి 20:20, 21.

నిజానికి యాకోబు యోహానులే ఆమెతో అలా అడిగించారు. అయితే, యేసు తాను ఎంత అవమానకరంగా, హీనంగా చంపబడతాడో కాసేపటి క్రితమే చెప్పాడు. ఇప్పుడు ఆయన వాళ్లతో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను తాగబోతున్న గిన్నెలోది మీరు తాగగలరా?” అని అడిగాడు. “మేము తాగగలం” అని వాళ్లు అన్నారు. (మత్తయి 20:22) ఇప్పటికీ, యేసు ఏం చెప్తున్నాడో వాళ్లకు అర్థమైవుండదు.

యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “నా గిన్నెలోది మీరు ఖచ్చితంగా తాగుతారు, కానీ నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు, నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధం చేశాడో వాళ్లే ఆ స్థానాల్లో కూర్చుంటారు.”—మత్తయి 20:23.

యాకోబు, యోహాను గొప్ప స్థానాల కోసం అడగడంతో మిగతా పదిమంది అపొస్తలులకు కోపం వచ్చింది. అంతకుముందు, తమలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు బహుశా యాకోబు యోహానులే ఎక్కువగా వాదించి ఉంటారా? (లూకా 9:46-48) ఏదేమైనా వాళ్లిద్దరూ చేసిన విన్నపాన్ని బట్టి, వినయం గురించి యేసు ఇచ్చిన సలహాను ఆ పన్నెండుమందీ పెడచెవిన పెట్టారని అర్థమౌతుంది. గొప్ప స్థానాలు పొందాలనే కోరిక వాళ్లలో ఇంకా అలానే ఉంది.

ఆ వివాదాన్ని, దానివల్ల వస్తున్న సమస్యల్ని యేసు పరిష్కరించాలనుకున్నాడు. ఆయన ఆ పన్నెండుమందిని పిలిచి ప్రేమగా ఇలా సలహా ఇచ్చాడు: “దేశాల పరిపాలకులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారనీ, వాళ్లలో గొప్పవాళ్లు వాళ్లమీద పెత్తనం చేస్తారనీ మీకు తెలుసు కదా? కానీ మీలో అలా ఉండకూడదు; మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి, మీలో అందరికన్నా ముఖ్యమైన స్థానంలో ఉండాలనుకునేవాడు అందరికీ దాసుడిగా ఉండాలి.”—మార్కు 10:42-44.

వాళ్లు అనుకరించడానికి యేసు ఈసారి తన సొంత ఉదాహరణే చెప్పాడు. ఆయన ఇలా వివరించాడు, “మానవ కుమారుడు కూడా ఇతరులతో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ ఇతరులకు సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.” (మత్తయి 20:28) దాదాపు మూడు సంవత్సరాలుగా యేసు ఇతరులకు సేవచేస్తూ ఉన్నాడు. చివరికి మనుషులందరి కోసం చనిపోబోతున్నాడు కూడా! శిష్యులు కూడా క్రీస్తులాంటి స్వభావం కలిగి ఉండాలి. అంటే ఇతరుల చేత సేవ చేయించుకోవాలని కోరుకునే బదులు వాళ్లే ఇతరులకు సేవచేయాలి, గొప్ప స్థానాలు కోరుకునే బదులు తమను తాము తగ్గించుకోవాలి.

  • త్వరలో జరగబోయే వాటికి యేసు తన శిష్యుల్ని ఎలా సిద్ధం చేశాడు?

  • ఇద్దరు అపొస్తలులు యేసును ఏం అడిగారు? మిగతా అపొస్తలులు ఎలా స్పందించారు?

  • గొప్ప స్థానాలు కోరుకుంటున్న తన అపొస్తలుల్ని యేసు ఎలా సరిదిద్దాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి