కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 65 పేజీ 154-పేజీ 155 పేరా 3
  • యెరూషలేముకు వెళ్లే దారిలో బోధించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెరూషలేముకు వెళ్లే దారిలో బోధించాడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • రహస్యముగా యెరూషలేమును పర్యటించుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యెరూషలేముకు ఒక రహస్య పర్యటన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “ఆయన గడియ యింకను రాలేదు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఇశ్రాయేలు చరిత్రలో పండుగల మైలురాళ్లు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 65 పేజీ 154-పేజీ 155 పేరా 3
యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్తున్నారు

65వ అధ్యాయం

యెరూషలేముకు వెళ్లే దారిలో బోధించాడు

మత్తయి 8:19-22 లూకా 9:51-62 యోహాను 7:2-10

  • యేసు తమ్ముళ్లు ఆయన్ని ఎలా చూశారు?

  • రాజ్య సేవ ఎంత ముఖ్యమైంది?

కొంతకాలంగా యేసు ఎక్కువగా గలిలయ ప్రాంతంలోనే ప్రకటిస్తున్నాడు. యూదయతో పోలిస్తే ఇక్కడి ప్రజలు బాగా స్పందిస్తున్నారు. అంతకుముందు యెరూషలేములో యేసు విశ్రాంతి రోజున ఒక వ్యక్తిని బాగుచేసినప్పుడు, “యూదులు యేసును చంపాలని ఇంకా ఎక్కువగా ప్రయత్నించారు.”—యోహాను 5:18; 7:1.

అది సా.శ. 32 శరదృతువు [సెప్టెంబరు లేదా అక్టోబరు]. గుడారాల (లేదా, పర్ణశాలల) పండుగ దగ్గరపడుతోంది. వ్యవసాయ సంవత్సరం ముగింపులో దీన్ని జరుపుకుంటారు. ఈ పండుగను ఏడు రోజులు చేసుకుంటారు, ఎనిమిదవ రోజున ప్రజలంతా ఒకచోట సమావేశమౌతారు. ప్రజలు చాలా సంతోషిస్తూ, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు.

యేసు తన శిష్యులైన యాకోబు, యోహానులతో ఉన్నాడు

యేసు తమ్ముళ్లు అయిన యాకోబు, సీమోను, యోసేపు, యూదా ఆయనతో ఇలా అన్నారు: “నువ్వు ఇక్కడి నుండి బయల్దేరి యూదయకు వెళ్లు.” యెరూషలేము యూదా మతానికి కేంద్రంగా ఉండేది. ప్రతీ సంవత్సరం మూడు ముఖ్యమైన పండుగలప్పుడు యెరూషలేము నగరం ప్రజలతో కిటకిటలాడేది. అందుకే ఆయన తమ్ముళ్లు ఇలా అన్నారు: “అందరూ తనను తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తి ఏ పనినీ రహస్యంగా చేయడు. నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, నిన్ను నువ్వు లోకానికి చూపించుకో.”—యోహాను 7:3, 4.

నిజానికి, వాళ్లు “ఆయనమీద విశ్వాసం ఉంచలేదు” అంటే ఆయనే మెస్సీయ అని నమ్మలేదు. అయినా యేసు చేసే అద్భుతాల్ని, పండుగ కోసం యెరూషలేముకు వచ్చే ప్రజలు చూడాలని ఆయన తమ్ముళ్లు కోరుకున్నారు. కానీ, యెరూషలేములో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలిసిన యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “లోకం మిమ్మల్ని ద్వేషించడానికి ఏ కారణమూ లేదు. అయితే లోకం నన్ను ద్వేషిస్తుంది, ఎందుకంటే దాని పనులు చెడ్డగా ఉన్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు పండుగకి వెళ్లండి. నేను ఇప్పుడే రావట్లేదు, నా సమయం ఇంకా రాలేదు.”—యోహాను 7:5-8.

యేసు తమ్ముళ్లు అందరితో కలిసి యెరూషలేముకు బయల్దేరారు. కొన్ని రోజుల తర్వాత యేసు, ఆయన శిష్యులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా బయల్దేరారు. వాళ్లు అందరూ వెళ్లే దారిలో అంటే యొర్దాను నదికి దగ్గర్లోని దారిలో కాకుండా, సమరయ గుండా నేరుగా వెళ్లారు. యేసుకు, ఆయన శిష్యులకు సమరయ ప్రాంతంలో వసతి అవసరమైంది. కాబట్టి తగిన ఏర్పాట్లు చేయడానికి ఆయన కొంతమంది శిష్యుల్ని ముందుగా పంపించాడు. అయితే యేసు యూదుల పండుగ కోసం యెరూషలేముకు వెళ్తున్నాడు కాబట్టి, సమరయలోని ఒక ఊరివాళ్లు ఆయన్ని చేర్చుకోవడానికి లేదా ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పుడు యాకోబు, యోహానులు కోపంతో ఇలా అన్నారు: “ప్రభువా, వీళ్లను నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటావా?” (లూకా 9:54) అలాంటి ఆలోచన వచ్చినందుకు యేసు వాళ్లను గద్దించాడు. ఆ తర్వాత వాళ్లు ప్రయాణం కొనసాగించారు.

వాళ్లు ప్రయాణిస్తున్నప్పుడు ఒక శాస్త్రి యేసుతో, “బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెంట వస్తాను” అన్నాడు. కానీ యేసు అతనితో, “నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి. కానీ మానవ కుమారుడు తల వాల్చడానికి ఎక్కడా స్థలం లేదు” అన్నాడు. (మత్తయి 8:19, 20) తన అనుచరుడిగా మారితే అతని జీవితం కష్టంగా ఉంటుందని యేసు చెప్తున్నాడు. అయితే అలా జీవించడానికి కావాల్సిన వినయం అతనికి లేదని అర్థమౌతుంది. కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘యేసును అనుసరించడానికి నేను ఎంత సిద్ధంగా ఉన్నాను?’

1. గుహలో ఉన్న నక్క; 2. గూటిలో ఉన్న పక్షి

యేసు మరో వ్యక్తితో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. దానికి అతను, “ప్రభువా, ముందు వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు” అన్నాడు. అతని పరిస్థితి తెలిసిన యేసు, “మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోనివ్వు. నువ్వు వెళ్లి ప్రతీచోట దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అన్నాడు. (లూకా 9:59, 60) అతని తండ్రి ఇంకా చనిపోలేదు. ఒకవేళ చనిపోయివుంటే అతను యేసుతో ఇక్కడిలా మాట్లాడుతూ ఉండడు. అతను దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా లేడు.

వాళ్లు యెరూషలేముకు ప్రయాణం కొనసాగిస్తుండగా ఇంకో వ్యక్తి యేసుతో, “ప్రభువా, నేను నీ వెంట వస్తాను. కానీ ముందు మా ఇంట్లోవాళ్లకు వీడ్కోలు చెప్పిరావడానికి అనుమతి ఇవ్వు” అన్నాడు. అప్పుడు యేసు, “నాగలి మీద చెయ్యి పెట్టి వెనక ఉన్నవాటి వైపు చూసే వాళ్లెవ్వరూ దేవుని రాజ్యంలో ఉండడానికి తగినవాళ్లు కాదు” అన్నాడు.—లూకా 9:61, 62.

యేసును నిజంగా అనుసరించాలని కోరుకునేవాళ్లు తమ దృష్టంతా రాజ్య సేవ మీదే ఉంచాలి. పొలం దున్నే వ్యక్తి ముందుకు చూస్తూ ఉండకపోతే, నాగలి వంకరటింకరగా వెళ్లే అవకాశం ఉంది. లేదా అతను వెనక ఉన్నవి చూడడానికి నాగలిని దించితే పని ఆగిపోతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి ఈ పాత వ్యవస్థ వైపు చూస్తే, శాశ్వత జీవితానికి నడిపించే మార్గం నుండి పక్కకు మళ్లే అవకాశం ఉంది.

  • యేసు నలుగురు తమ్ముళ్లు ఆయన్ని ఎలా చూశారు?

  • సమరయులు యేసుకు ఎందుకు ఆతిథ్యం ఇవ్వలేదు? అప్పుడు యాకోబు, యోహానులు ఏం చేయాలనుకున్నారు?

  • దారిలో యేసు ముగ్గురు వ్యక్తులతో ఏం మాట్లాడాడు? దేవుని సేవ విషయంలో ఎలా ఉండాలని చెప్పాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి