కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 52 పేజీ 128-పేజీ 129 పేరా 7
  • అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసు అద్భుతరీతిగా వేలమందికి ఆహారము పెట్టుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యేసు వేలమందికి ఆహారం పెట్టాడు
    నా బైబిలు పుస్తకం
  • యేసు అనేకమందికి ఆహారం పెట్టడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 52 పేజీ 128-పేజీ 129 పేరా 7
యేసు ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచిపెట్టమన్నాడు

52వ అధ్యాయం

అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు

మత్తయి 14:13-21 మార్కు 6:30-44 లూకా 9:10-17 యోహాను 6:1-13

  • యేసు 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడు

పన్నెండుమంది అపొస్తలులు గలిలయ అంతటా సంతోషంగా ప్రకటించారు. వాళ్లు యేసు దగ్గరికి వచ్చి, “ఏమేం చేశారో, ఏమేం బోధించారో అన్నీ” ఆయనకు చెప్పారు. వాళ్లు బాగా అలసిపోయారు. చాలామంది ప్రజలు వస్తూ, పోతూ ఉండడం వల్ల కనీసం తినడానికి కూడా వాళ్లకు సమయం దొరకలేదు. అందుకే యేసు ఇలా అన్నాడు: “రండి, మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం, మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు.”—మార్కు 6:30, 31.

వాళ్లు బహుశా కపెర్నహూము దగ్గర్లో ఒక పడవ ఎక్కి, బేత్సయిదా అవతల ఉన్న ఏకాంత ప్రదేశానికి బయల్దేరారు. ఆ ప్రదేశం యొర్దాను నదికి తూర్పున ఉంది. వాళ్లు అలా బయల్దేరడం చాలామంది చూశారు, ఇంకొందరు దాని గురించి విన్నారు. వాళ్లందరూ కలిసి తీరం వెంబడి పరుగెత్తుకుంటూ వెళ్లి, పడవ ఆగిన చోటుకు చేరుకున్నారు.

యేసు పడవ దిగి, కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి జాలిపడ్డాడు. ఆయన వాళ్లకు రాజ్యం గురించి “చాలా విషయాలు బోధించడం” మొదలుపెట్టాడు. (మార్కు 6:34) అంతేకాదు, “రోగాలతో బాధపడుతున్న వాళ్లను బాగుచేశాడు.” (లూకా 9:11) సాయంత్రం వేళ శిష్యులు యేసుతో ఇలా అన్నారు: “ఇది మారుమూల ప్రాంతం, పైగా సాయంత్రం కావస్తోంది; ఈ ప్రజల్ని పంపించేస్తే, చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి ఆహారం కొనుక్కుంటారు.”—మత్తయి 14:15.

అప్పుడు యేసు, “వాళ్లు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి” అన్నాడు. (మత్తయి 14:16) తాను ఏం చేయబోతున్నాడో యేసుకు తెలిసినా, ఫిలిప్పును పరీక్షించాలని ఇలా అడిగాడు: “వీళ్లు తినడానికి రొట్టెలు ఎక్కడ కొందాం?” ఫిలిప్పు దగ్గర్లో ఉన్న బేత్సయిదా ప్రాంతంవాడు కాబట్టి యేసు అతన్నే ఆ ప్రశ్న అడిగాడు. అయినప్పటికీ, రొట్టెలు కొనడం సరైన పరిష్కారం కాదు. ఎందుకంటే అక్కడ దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలను, పిల్లల్ని కలుపుకుంటే 10,000 మంది పైనే ఉండవచ్చు! ఫిలిప్పు ఇలా జవాబిచ్చాడు: “వీళ్లలో ప్రతీ ఒక్కరికి కొంచెం ఇవ్వాలన్నా రెండు వందల దేనారాల [ఒక దేనారం అంటే ఒకరోజు కూలి] రొట్టెలు కూడా సరిపోవు.”—యోహాను 6:5-7.

ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్న పిల్లవాడితో యేసు మాట్లాడుతున్నాడు

బహుశా వాళ్లందరికీ ఆహారం పెట్టడం అసాధ్యమని చెప్పడానికి అంద్రెయ ఇలా అన్నాడు: “ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలు, రెండు చిన్నచేపలు ఉన్నాయి. అయితే ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి?”—యోహాను 6:9.

అది సా.శ. 32 వసంత కాలం. పస్కా పండుగ దగ్గరపడుతోంది, ఆ కొండ ప్రాంతమంతా పచ్చని గడ్డి పరుచుకొని ఉంది. ప్రజల్ని 50 మంది, 100 మంది చొప్పున చిన్నచిన్న గుంపులుగా ఆ గడ్డి మీద కూర్చోబెట్టమని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయన ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత రొట్టెల్ని విరిచి, చేపల్ని ముక్కలు చేశాడు. వాటిని శిష్యులకు ఇచ్చి ప్రజలకు పంచిపెట్టమన్నాడు. ఆశ్చర్యకరంగా, అక్కడున్న ప్రజలందరూ తృప్తిగా తిన్నారు!

తర్వాత యేసు తన శిష్యులతో, “మిగిలిన ముక్కలు పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి” అన్నాడు. (యోహాను 6:12) వాళ్లు అలా పోగుచేసినప్పుడు 12 గంపలు నిండాయి!

  • యేసు తన అపొస్తలుల్ని ఏకాంత ప్రదేశానికి ఎందుకు తీసుకెళ్లాడు?

  • యేసు, ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్లారు? వాళ్లు అక్కడికి చేరుకున్నాక ఏం జరిగింది?

  • శిష్యులు యేసుతో ఏమన్నారు? కానీ ఆయన ప్రజల అవసరాన్ని ఎలా తీర్చాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి