కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 47 పేజీ 118-పేజీ 119 పేరా 6
  • పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • అత్యానందముగా మారిన కన్నీరు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • అత్యానందముగా మారిన కన్నీరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యేసు మృతులను లేపడం
    నా బైబిలు కథల పుస్తకము
  • మనం చనిపోయినా తిరిగి లేస్తాం!
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 47 పేజీ 118-పేజీ 119 పేరా 6
యేసు యాయీరు కూతుర్ని తిరిగి బ్రతికిస్తున్నాడు

47వ అధ్యాయం

పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!

మత్తయి 9:18, 23-26 మార్కు 5:22-24, 35-43 లూకా 8:40-42, 49-56

  • యాయీరు కూతుర్ని యేసు బ్రతికించాడు

రక్తస్రావం ఉన్న స్త్రీని యేసు బాగుచేయడం యాయీరు గమనించాడు. కాబట్టి, తన కూతుర్ని కూడా ఆయన బాగుచేయగలడనే నమ్మకం యాయీరుకు ఉంది. అయితే ఈపాటికి ఆమె చనిపోయి ఉంటుందని అతను అనుకుంటున్నాడు. (మత్తయి 9:18) ఒకవేళ అదే నిజమైతే, యేసు ఏమైనా చేయగలడా?

యేసు తాను బాగుచేసిన స్త్రీతో మాట్లాడుతుండగానే, యాయీరు ఇంటి నుండి కొంతమంది వచ్చి, “మీ అమ్మాయి చనిపోయింది! ఇక బోధకుణ్ణి ఇబ్బందిపెట్టడం ఎందుకు?” అని యాయీరుతో అన్నారు.—మార్కు 5:35.

అది నిజంగా గుండె పగిలే వార్త! సమాజంలో ఎంతో పేరు, పలుకుబడి ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతని ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. అయితే యేసు వాళ్ల మాటలు విని యాయీరు వైపు తిరిగి, “భయపడకు, విశ్వాసం ఉంచు చాలు” అని ధైర్యం చెప్పాడు.—మార్కు 5:36.

చనిపోయిన యాయీరు కూతురు పక్కన దుఃఖిస్తున్న ప్రజలు

తర్వాత యేసు యాయీరుతో వెళ్లాడు. అతని ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడంతా గోలగోలగా ఉంది. అక్కడ ఉన్నవాళ్లు దుఃఖిస్తూ, ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. యేసు లోపలికి వెళ్లి, ఆశ్చర్యం కలిగించే ఈ మాట అన్నాడు: “పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే.” (మార్కు 5:39) ఆ మాట వినగానే, ప్రజలు యేసును చూసి నవ్వారు. పాప నిజంగా చనిపోయిందని వాళ్లకు తెలుసు. అయితే దేవుడు ఇచ్చిన శక్తితో, గాఢనిద్రలో ఉన్నవాళ్లను లేపినంత సులువుగా చనిపోయినవాళ్లను లేపగలనని యేసు చూపించబోతున్నాడు.

యేసు పేతురును, యాకోబును, యోహానును, చనిపోయిన పాప తల్లిదండ్రుల్ని తప్ప అందర్నీ బయటికి పంపించేశాడు. ఆయన ఆ ఐదుగురిని వెంటబెట్టుకొని పాప ఉన్న చోటికి వెళ్లాడు. తర్వాత ఆమె చేయి పట్టుకొని, “‘తలీతా కుమీ’ అన్నాడు. ఆ మాటను అనువదిస్తే, ‘పాపా, నీతో చెప్తున్నాను, లే!’ అని అర్థం.” (మార్కు 5:41) వెంటనే ఆమె లేచి నడవడం మొదలుపెట్టింది. అది చూసి యాయీరు, అతని భార్య ఎంత ఆనందించివుంటారో ఊహించండి! ఆమె నిజంగానే బ్రతికిందనడానికి ఇంకో రుజువు ఇస్తూ, ఆమెకు తినడానికి ఏమైనా పెట్టమని యేసు చెప్పాడు.

అంతకుముందు, యేసు ఎవరినైనా బాగుచేసినప్పుడు దానిగురించి ఇతరులకు చెప్పొద్దని ఆజ్ఞాపించేవాడు. ఈ తల్లిదండ్రులకు కూడా అదే చెప్పాడు. అయినా ఆ తల్లిదండ్రులు, ఇంకొందరు ఆనందం పట్టలేక యేసు చేసిన అద్భుతం గురించి “ఆ ప్రాంతమంతా” చెప్పారు. (మత్తయి 9:26) చనిపోయిన మీ ప్రియమైనవాళ్లు ఎవరైనా తిరిగి బ్రతికితే, మీరు కూడా ఉత్సాహంగా దాని గురించి చెప్పరా? బైబిలు చెప్తున్నట్లు, యేసు చేసిన పునరుత్థానాల్లో ఇది రెండోది.

  • యాయీరుకు ఏ వార్త అందింది? యేసు అతనికి ఏమని ధైర్యం చెప్పాడు?

  • యేసు యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

  • పాప నిద్రపోతోందని యేసు ఎందుకు అన్నాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి