కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 37 పేజీ 94-పేజీ 95 పేరా 1
  • యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఒక విధవరాలి దుఃఖమును పోగొట్టుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • మరణించినవారికి తిరిగి జీవాన్ని ఇవ్వగలడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మనం చనిపోయినా తిరిగి లేస్తాం!
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • “లేదు, అలా జరిగి ఉండదు!”
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 37 పేజీ 94-పేజీ 95 పేరా 1
యేసుకు, ఆయన అపొస్తలులకు ఒక విధవరాలి కుమారుని అంత్యక్రియల ఊరేగింపు ఎదురైంది

37వ అధ్యాయం

యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు

లూకా 7:11-17

  • నాయీనులో పునరుత్థానం

సైనికాధికారి సేవకుణ్ణి బాగుచేసిన తర్వాత, యేసు కపెర్నహూము నుండి నాయీను అనే నగరానికి బయల్దేరాడు. అది కపెర్నహూముకు నైరుతి దిశలో దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన ఒంటరిగా వెళ్లడం లేదు, ఆయనతోపాటు శిష్యులు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. బహుశా సాయంత్రం కావస్తుండగా వాళ్లు నాయీను పొలిమేర్లకు చేరుకొనివుంటారు. అప్పుడు, అంత్యక్రియల కోసం ఊరేగింపుగా వెళ్తున్న చాలామంది యూదులు ఎదురయ్యారు. వాళ్లు ఒక యువకుడి శవాన్ని ఊరి బయట పాతిపెట్టడానికి మోసుకెళ్తున్నారు.

ఆ యువకుడి తల్లి వాళ్లందరి కన్నా చాలా దుఃఖంలో ఉంది. ఆమె విధవరాలు, ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు. భర్త చనిపోయినా ఇంతకాలం కనీసం కుమారుడైనా ఆమెకు తోడున్నాడు. వాళ్లిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉండేదో ఊహించుకోండి. ఆమె అతనిమీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఆమె భవిష్యత్తు అతని మీదే ఆధారపడివుంది. ఇప్పుడు అతను కూడా లేడు. ఇక ఆమెకు తోడుగా ఉంటూ ఆమెను ఎవరు చూసుకుంటారు?

ఆమె దుఃఖాన్ని, దీనస్థితిని చూసి యేసు ఎంతో చలించిపోయాడు. ఆయన మృదువుగా, భరోసాను ఇస్తూ “ఏడ్వకు” అని ధైర్యం చెప్పాడు. అంతటితో ఆగకుండా, పాడె దగ్గరికి వెళ్లి దాన్ని ముట్టుకున్నాడు. (లూకా 7:13, 14) ఏడుస్తున్న ఆ ఊరి ప్రజలు ఆయన స్పందించిన తీరును, పాడె ముట్టుకోవడాన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. ‘ఆయన ఆమెను ఎందుకు ఏడ్వద్దు అన్నాడు? ఆయన ఏం చేయబోతున్నాడు?’ అని చాలామంది అనుకొనివుంటారు.

పునరుత్థానమైన యువకుణ్ణి యేసు అతని తల్లికి అప్పగించాడు; ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు

మరి ఆయనతో ప్రయాణిస్తున్నవాళ్ల సంగతేంటి? ఆయన అద్భుతాలు చేయడం, ఎన్నో రోగాల్ని నయం చేయడం వాళ్లు చూశారు, కానీ చనిపోయినవాళ్లను బ్రతికించడం ఇంకా చూడలేదు. చాలాకాలం క్రితం పునరుత్థానాలు జరిగాయి, కానీ యేసు అలాంటిది చేయగలడా? (1 రాజులు 17:17-23; 2 రాజులు 4:32-37) అప్పుడు యేసు, “బాబూ, నేను నీతో చెప్తున్నాను, లే!” అని ఆజ్ఞాపించాడు. (లూకా 7:14) దాంతో ఆ యువకుడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు! యేసు అతన్ని వాళ్లమ్మకు అప్పగించాడు. ఆమె ఆశ్చర్యంలో, ఆనందంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు.

ఆ యువకుడు నిజంగానే బ్రతికాడని చూసిన ప్రజలు జీవదాత అయిన యెహోవాను స్తుతిస్తూ ఇలా అన్నారు: “ఒక గొప్ప ప్రవక్త మన మధ్యకు వచ్చాడు.” ఇంకొంతమంది యేసు చేసిన అద్భుతానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, “దేవుడు తన ప్రజల్ని గుర్తుచేసుకున్నాడు” అన్నారు. (లూకా 7:16) ఈ అద్భుతం గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. అది దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసు సొంతూరు నజరేతుకు కూడా చేరి ఉంటుంది. చివరికి దక్షిణాన ఉన్న యూదయకు కూడా ఆ వార్త చేరుకుంది.

బాప్తిస్మమిచ్చే యోహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. యేసు చేస్తున్న అద్భుతాల గురించి అతను ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నాడు. వాటి గురించి అతని శిష్యులు అతనికి చెప్పేవాళ్లు. వాటిని విన్నప్పుడు అతను ఎలా స్పందించాడు?

  • యేసు నాయీను పొలిమేర్లకు వస్తుండగా ఏం చూశాడు?

  • అది చూసినప్పుడు యేసుకు ఎలా అనిపించింది? ఆయన ఏం చేశాడు?

  • యేసు చేసిన అద్భుతాన్ని చూసి ప్రజలు ఎలా స్పందించారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి