కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 24 పేజీ 62-పేజీ 63 పేరా 7
  • గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఎందుకు ఈ భూమికి వచ్చెను
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • A7-C యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (1వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • యెహోవా ఆరాధన కొరకైన ఆసక్తి
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • మెస్సీయలో నెరవేరిన ప్రవచనాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 24 పేజీ 62-పేజీ 63 పేరా 7
పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను యేసును కనుగొన్నారు

24వ అధ్యాయం

గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం

మత్తయి 4:23-25 మార్కు 1:35-39 లూకా 4:42, 43

  • యేసు నలుగురు శిష్యులతో కలిసి గలిలయలో ప్రయాణించాడు

  • ఆయన పరిచర్య, అద్భుతాల గురించి అంతటా తెలిసింది

కపెర్నహూములో యేసు తన నలుగురు శిష్యులతో కలిసి రోజంతా తీరిక లేకుండా గడిపాడు. సాయంత్రం, ఆ నగరంలోని ప్రజలు ఆయన దగ్గరికి రోగుల్ని తీసుకొచ్చి వాళ్లను బాగు చేయమన్నారు. కాబట్టి ఏకాంతంగా తన తండ్రికి ప్రార్థన చేసుకునే సమయం యేసుకు దొరకలేదు.

తర్వాతి రోజు ఉదయం యేసు చీకటితోనే లేచి, తన తండ్రికి ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. అయితే ఏకాంతంగా గడిపే అవకాశం ఆయనకు ఎక్కువసేపు దొరకలేదు. ఎందుకంటే, యేసు కనిపించకపోవడంతో “సీమోను, అతనితో ఉన్నవాళ్లు” ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లారు. యేసు తన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పేతురే మిగతావాళ్లను తీసుకుని ఆయన్ని వెతకడానికి బయల్దేరి ఉంటాడు.—మార్కు 1:36; లూకా 4:38.

యేసు కనిపించగానే పేతురు ఇలా అన్నాడు: “అందరూ నీకోసం వెతుకుతున్నారు.” (మార్కు 1:37) యేసు తమ ఊరిలోనే ఉండాలని కపెర్నహూము ప్రజలు కోరుకున్నారు. వాళ్లు ఆయన చేసినవాటిని చూసి ఎంతో ముగ్ధులయ్యారు, అందుకే “ఆయన్ని తమ దగ్గర నుండి వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించారు.” (లూకా 4:42) రోగుల్ని బాగుచేయడానికే యేసు భూమ్మీదికి వచ్చాడా? ఆయన ఆ అద్భుతాల్ని ఈ ఊరిలో మాత్రమే చేస్తాడా? యేసు ఏమన్నాడు?

యేసు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులతో మాట్లాడుతూ దగ్గర్లోని ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు

యేసు తన శిష్యులతో, “రండి, మనం దగ్గర్లోని పట్టణాలకు ఎక్కడికైనా వెళ్దాం. అక్కడ కూడా నేను ప్రకటించాలి, అందుకే కదా నేను వచ్చాను” అన్నాడు. నిజానికి, తనను అక్కడే ఉండిపోమంటున్న ప్రజలతో ఆయన ఇలా అన్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.”—మార్కు 1:38; లూకా 4:43.

అవును, యేసు భూమ్మీదికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, దేవుని రాజ్యం గురించి ప్రకటించడం. ఆ రాజ్యం తండ్రి పేరును పవిత్రపరుస్తుంది, మనుషుల రోగాలన్నిటినీ శాశ్వతంగా తీసేస్తుంది. అయితే, దేవుడే తనను పంపించాడని రుజువు చేయడానికి యేసు అద్భుతరీతిలో రోగుల్ని బాగుచేశాడు. వందల సంవత్సరాల క్రితం, మోషే కూడా దేవుడు తనను పంపించాడని చూపించడానికి అద్భుతాలు చేశాడు.—నిర్గమకాండం 4:1-9, 30, 31.

యేసు తన నలుగురు శిష్యులతో కలిసి మిగతా నగరాల్లో ప్రకటించడానికి కపెర్నహూము నుండి వెళ్లిపోయాడు. వాళ్లెవరంటే: పేతురు, అతని సహోదరుడు అంద్రెయ, యోహాను, అతని సహోదరుడు యాకోబు. ఒక వారం క్రితం, వాళ్లు యేసుతో కలిసి ప్రయాణిస్తూ పరిచర్య చేసే ఆహ్వానాన్ని పొందారు. ఆ అవకాశం మొదట దక్కింది వాళ్లకే.

యేసు, ఆయన నలుగురు శిష్యులు గలిలయలో చేసిన ప్రకటనా యాత్రకు మంచి ఫలితాలు వచ్చాయి. నిజానికి, యేసు గురించిన వార్త సుదూర ప్రాంతాలకు వ్యాపించింది. అది “సిరియా అంతటా,” దెకపొలి అని పిలవబడే పది నగరాల్లో, యొర్దాను అవతలి ప్రాంతంలో వ్యాపించింది. (మత్తయి 4:24, 25) ఆ ప్రాంతాలకు, యూదయకు చెందిన చాలామంది ప్రజలు యేసును, ఆయన శిష్యుల్ని అనుసరించారు. వాళ్లు ఆయన దగ్గరికి రోగుల్ని, చెడ్డదూతలు పట్టినవాళ్లను తీసుకొచ్చారు. యేసు వాళ్లను నిరాశపర్చకుండా రోగుల్ని బాగుచేశాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు.

  • యేసు కపెర్నహూములో తీరిక లేకుండా గడిపిన తర్వాత, మరుసటి రోజు ఉదయం ఏం జరిగింది?

  • దేవుడు యేసును భూమ్మీదికి ఎందుకు పంపించాడు? అద్భుతాలు చేయడం ద్వారా యేసు ఏం రుజువు చేశాడు?

  • గలిలయలో ప్రకటించడానికి యేసుతో కలిసి ఎవరు వెళ్లారు? ఆయన ప్రకటనా పనికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి