కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 10 పేజీ 28-పేజీ 29 పేరా 7
  • యేసు కుటుంబం యెరూషలేముకు వెళ్లడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు కుటుంబం యెరూషలేముకు వెళ్లడం
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెరూషలేమునకు పర్యటనలు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • బాలుడైన యేసు
    నా బైబిలు పుస్తకం
  • దేవాలయంలో బాల యేసు
    నా బైబిలు కథల పుస్తకము
  • యేసు విధేయంగా ఉండడం నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 10 పేజీ 28-పేజీ 29 పేరా 7
ఆలయంలో పన్నెండేళ్ల యేసు యూదా బోధకుల్ని ప్రశ్నలు అడుగుతున్నాడు

10వ అధ్యాయం

యేసు కుటుంబం యెరూషలేముకు వెళ్లడం

లూకా 2:40-52

  • యేసు పన్నెండేళ్ల వయసులో బోధకుల్ని ప్రశ్నలు అడిగాడు

  • యేసు యెహోవాను “నా తండ్రి” అని పిలిచాడు

అది వసంత కాలం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా యోసేపు కుటుంబం స్నేహితులతో, బంధువులతో కలిసి యెరూషలేముకు వెళ్లడానికి సిద్ధమౌతోంది. ధర్మశాస్త్రం చెప్పినట్లు, వాళ్లు పస్కా పండుగ ఆచరించడానికి అక్కడికి వెళ్తున్నారు. (ద్వితీయోపదేశకాండం 16:16) నజరేతు నుండి యెరూషలేముకు వెళ్లాలంటే దాదాపు 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందరూ ప్రయాణం కోసం సిద్ధపడుతూ, ఉత్సాహంగా ఉన్నారు. యేసుకు ఇప్పుడు 12 ఏళ్లు. ఆయన ఈ పండుగ కోసం, మళ్లీ ఆలయానికి వెళ్లడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

పస్కా పండుగ అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు. పస్కా తర్వాతి రోజు “పులవని రొట్టెల పండుగ” మొదలయ్యేది. అది ఏడు రోజులపాటు జరుగుతుంది. (మార్కు 14:1) ఆ ఏడు రోజుల్ని కూడా పస్కా పండుగలో భాగంగానే చూసేవాళ్లు. యేసు, ఆయన కుటుంబం నజరేతులోని తమ ఇంటి నుండి యెరూషలేముకు వెళ్లడానికి, అక్కడ పండుగ జరుపుకోవడానికి, ఇంటికి తిరిగిరావడానికి దాదాపు రెండు వారాలు పట్టేది. కానీ ఈ సంవత్సరం, ఒక సంఘటన వల్ల ఇంకాస్త ఎక్కువ సమయం పట్టింది. ఆ సంఘటన, వాళ్లు యెరూషలేము నుండి తిరిగి వెళ్తున్నప్పుడు జరిగింది.

సంతోషంగా సాగే ప్రయాణాలు

యేసు, ఆయన కుటుంబం యెరూషలేముకు వెళ్తున్నారు

సంవత్సరంలో జరిగే మూడు పండుగల కోసం అందరూ యెరూషలేముకు వెళ్లేవాళ్లు, ఆ సమయంలో ఎంతో సంతోషించేవాళ్లు. (ద్వితీయోపదేశకాండం 16:15) ఆ ప్రయాణంలో యేసు రకరకాల ప్రదేశాల్ని చూస్తూ, వాటి భౌగోళిక విషయాల్ని తెలుసుకునేవాడు. అంతేకాదు, వేరే ప్రాంతాల నుండి వచ్చిన తోటి ఆరాధకుల్ని కలుసుకునేవాడు. ఆ ప్రయాణాలు ఎంత మధురమైన జ్ఞాపకాలో కదా!

యోసేపు మరియలు వాళ్ల బంధువులతో, స్నేహితులతో కలిసి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. యేసు ఆ గుంపులోనే ఉండివుంటాడని యోసేపు మరియలు అనుకున్నారు. కానీ, రాత్రిపూట ఒక చోట ఆగినప్పుడు వాళ్లకు యేసు కనిపించలేదు. దాంతో వాళ్లు తమ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఆయన్ని వెతికారు. కానీ యేసు ఎక్కడా కనిపించకపోవడంతో, వాళ్లు ఆయన్ని వెతుక్కుంటూ తిరిగి యెరూషలేముకు వచ్చారు.

వాళ్లు ఒక రోజంతా వెతికినా యేసు కనిపించలేదు. రెండో రోజూ కనిపించలేదు. చివరికి మూడో రోజు, వాళ్లు ఆలయంలోని గదుల్లో వెతుకుతుండగా యేసు కనిపించాడు. ఆయన కొంతమంది యూదా బోధకుల మధ్య కూర్చొని, వాళ్లు చెప్పేది వింటూ, వాళ్లను ప్రశ్నలు అడుగుతున్నాడు. యేసుకున్న అవగాహన చూసి ఆ బోధకులు ఎంతో ఆశ్చర్యపోయారు.

యోసేపు మరియలకు యేసు కనిపించాడు

మరియ ఆయన్ని చూడగానే “బాబూ, నువ్వెందుకు ఇలా చేశావు? ఇదిగో నేను, మీ నాన్న ఎంతో ఆందోళనతో నీ కోసం వెతుకుతూ ఉన్నాం” అంది.—లూకా 2:48.

తాను ఎక్కడ ఉంటాడో వాళ్లు అర్థం చేసుకోలేకపోయినందుకు, యేసు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు: “మీరెందుకు నా కోసం వెతుకుతున్నారు? నేను నా తండ్రి మందిరంలో ఉండాలని మీకు తెలీదా?”—లూకా 2:49.

యేసు ఆ తర్వాత యోసేపు మరియలతో నజరేతుకు తిరిగొచ్చి, అన్నివేళలా వాళ్లకు లోబడివున్నాడు. ఆయన పెద్దవాడౌతూ తెలివైనవాడిగా తయారౌతున్నాడు. చిన్నవయసులోనే ఆయన దేవుని దయను, మనుషుల దయను పొందాడు. అవును, యేసు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వడంలో, అమ్మానాన్నల్ని గౌరవించడంలో మంచి ఆదర్శం ఉంచాడు.

  • వసంత కాలంలో యేసు, ఆయన కుటుంబం క్రమం తప్పకుండా ఎక్కడికి వెళ్లేవాళ్లు? ఎందుకు?

  • యెరూషలేము నుండి తిరిగొస్తున్న యోసేపు మరియలు ఏం గమనించారు? తర్వాత వాళ్లకు యేసు ఎక్కడ కనిపించాడు?

  • నేటి పిల్లలకు యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి