కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 6 పేజీ 20-పేజీ 21 పేరా 8
  • దేవుడు వాగ్దానం చేసిన శిశువు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు వాగ్దానం చేసిన శిశువు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాగ్దాన శిశువు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ఆమె ‘వాటి గురించి ఆలోచించింది’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆమె ‘వాటిని గురించి ఆలోచించింది’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఆమె యెహోవా దయాప్రాప్తురాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 6 పేజీ 20-పేజీ 21 పేరా 8
సుమెయోను పసివాడైన యేసును ఎత్తుకున్నాడు, యోసేపు, మరియ, ప్రవక్త్రి అన్న చూస్తున్నారు

6వ అధ్యాయం

దేవుడు వాగ్దానం చేసిన శిశువు

లూకా 2:21-39

  • యేసుకు సున్నతి చేయించారు, కొన్ని రోజులకు ఆలయానికి తీసుకెళ్లారు

యోసేపు మరియలు నజరేతుకు తిరిగి వెళ్లకుండా బేత్లెహేములోనే ఉండిపోయారు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, వాళ్లు యేసుకు ఎనిమిదో రోజున సున్నతి చేయించారు. (లేవీయకాండం 12:2, 3) అదే రోజున పిల్లవాడికి పేరు పెట్టడం ఆనవాయితీ. కాబట్టి, వాళ్లు గబ్రియేలు దూత చెప్పినట్టే తమ పిల్లవాడికి యేసు అని పేరు పెట్టారు.

దాదాపు నెల రోజులు గడిచాయి, యేసు పుట్టి ఇప్పటికి 40 రోజులు. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన్ని యెరూషలేము ఆలయానికి తీసుకెళ్లారు. వాళ్లు ఉంటున్న చోటుకు అది కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం, మగబిడ్డ పుట్టిన 40 రోజుల తర్వాత, తల్లి తనను శుద్ధి చేసుకోవడానికి ఆలయంలో అర్పణ అర్పించాలి.—లేవీయకాండం 12:4-8.

కాబట్టి, మరియ రెండు చిన్న పక్షుల్ని అర్పణగా తీసుకెళ్లింది. దీన్నిబట్టి యోసేపు మరియల ఆర్థిక పరిస్థితి కొంతవరకు అర్థమౌతుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఒక మగ గొర్రెపిల్లను, ఒక పక్షిని అర్పించాలి. గొర్రెపిల్లను అర్పించేంత స్తోమత లేకపోతే రెండు గువ్వల్ని గానీ, రెండు పావురాల్ని గానీ అర్పించవచ్చు. కాబట్టి, మరియ తన స్తోమతకు తగ్గ అర్పణ అర్పించింది.

“వాళ్లు శుద్ధి చేసుకునే సమయం వచ్చినప్పుడు”

యోసేపు మరియలు యేసును తీసుకుని, ‘శుద్ధి చేసుకోవడానికి’ ఆలయానికి వచ్చారు

ఒక ఇశ్రాయేలు స్త్రీ బిడ్డను కన్నప్పుడు, ధర్మశాస్త్రం ప్రకారం ఆమె కొన్ని రోజులపాటు అపవిత్రురాలిగా ఉంటుంది. ఆ రోజులు పూర్తయిన తర్వాత, ఆమె శుద్ధి చేసుకోవడానికి దహనబలి అర్పించాలి. తల్లిదండ్రుల అపరిపూర్ణత, పాపం పిల్లలకు వారసత్వంగా వచ్చాయని అది అందరికీ గుర్తుచేసేది. కానీ యేసు పరిపూర్ణుడు, పవిత్రుడు. (లూకా 1:35) అయినప్పటికీ, యోసేపు మరియలు ఆయన్ని తీసుకుని, ధర్మశాస్త్రం ప్రకారం ‘శుద్ధి చేసుకోవడానికి’ ఆలయానికి వెళ్లారు.—లూకా 2:22.

ఆలయంలో, ఒక వృద్ధుడు యోసేపు మరియల దగ్గరికి వచ్చాడు. అతని పేరు సుమెయోను. అతను చనిపోయే లోపు, వాగ్దానం చేయబడిన క్రీస్తును అంటే మెస్సీయను చూస్తాడని యెహోవా అతనికి తెలియజేశాడు. ఆ రోజు అతను పవిత్రశక్తి నడిపింపుతో ఆలయంలోకి వచ్చాడు. అక్కడ పసిబిడ్డతో ఉన్న యోసేపు మరియలు అతనికి కనిపించారు. సుమెయోను ఆ పిల్లవాణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు.

సుమెయోను యేసును పట్టుకుని దేవునికి ఇలా కృతజ్ఞతలు చెప్పాడు: “సర్వోన్నత ప్రభువా, ఇప్పుడు నువ్వు నీ మాట ప్రకారం నీ దాసుణ్ణి మనశ్శాంతితో వెళ్లిపోనిస్తున్నావు. ఎందుకంటే నా కళ్లు నీ రక్షణ మార్గాన్ని చూశాయి. ఆ మార్గాన్ని అన్నిదేశాల ప్రజల కళ్లముందు నువ్వు సిద్ధం చేశావు. ఆయన, దేశాల మీదున్న ముసుగును తీసేసే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నాడు.”—లూకా 2:29-32.

ఈ మాటలు విన్న యోసేపు మరియలు చాలా ఆశ్చర్యపోయారు. సుమెయోను వాళ్లను దీవించి, మరియతో ఇలా అన్నాడు: “ఈయన వల్ల కొంతమంది ఇశ్రాయేలీయులు పడిపోతారు, ఇంకొంతమంది లేస్తారు.” దుఃఖం పదునైన ఖడ్గంలా ఆమెలో నుండి దూసుకుపోతుందని కూడా అతను చెప్పాడు.—లూకా 2:34.

ఆ రోజు ఆలయంలో అన్న అనే ప్రవక్త్రి కూడా ఉంది. ఆమెకు 84 ఏళ్లు. ఆమె మానకుండా రోజూ ఆలయానికి వస్తుంది. సుమెయోను మాట్లాడుతున్న సమయంలోనే, ఆమె కూడా యోసేపు మరియల దగ్గరికి వచ్చింది. అన్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వినే వాళ్లందరికి యేసు గురించి చెప్పడం మొదలుపెట్టింది.

ఆలయంలో జరిగిన ఆ సంఘటనలు చూసి, యోసేపు మరియలు ఎంత సంతోషించివుంటారో మీరు ఊహించవచ్చు! ఇవన్నీ, తమ పిల్లవాడు దేవుడు వాగ్దానం చేసిన వ్యక్తి అనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించాయి.

  • ఇశ్రాయేలీయులు ఏ రోజున మగబిడ్డకు పేరు పెట్టేవాళ్లు?

  • పిల్లవాడు పుట్టిన 40 రోజులకు తల్లి ఏం చేయాలి? మరియ తెచ్చిన అర్పణ బట్టి ఏ విషయం అర్థమౌతుంది?

  • యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ఆలయంలో ఎవరెవరు గుర్తుపట్టారు? వాళ్లు ఆ విషయాన్ని ఎలా తెలియజేశారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి