145వ పాట
ప్రకటించడానికి సిద్ధపడదాం
సువార్త
చాటాలని
లేస్తాం చీకటితోనే.
అసలే నిద్ర,
పైగా వర్షం కూడా.
మానేయాలి అనిపిస్తుంది
మనకు.
(పల్లవి)
సిద్ధపడి మనం ప్రార్థిస్తే
దీవెనల కోసం;
కావల్సిన పురికొల్పును
పొందుతాము.
తోడున్నారు యేసు, దూతలు
నిర్దేశించేందుకు.
పక్కనుంటే మంచి మిత్రుడు,
పడిపోము.
వీటిని
పాటిస్తుంటే
సంతోషాన్ని పొందుతాం.
ప్రేమతో మనం
చేసే ఏ పనినీ
మరువడు మన దేవుడు
ఎప్పుడూ.
(పల్లవి)
సిద్ధపడి మనం ప్రార్థిస్తే
దీవెనల కోసం;
కావల్సిన పురికొల్పును
పొందుతాము.
తోడున్నారు యేసు, దూతలు
నిర్దేశించేందుకు.
పక్కనుంటే మంచి మిత్రుడు,
పడిపోము.
(ప్రసం. 11:4; మత్త. 10:5, 7; లూకా 10:1; తీతు 2:14 కూడా చూడండి.)