కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jl పాఠం 7
  • మా కూటాలు ఎలా జరుగుతాయి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా కూటాలు ఎలా జరుగుతాయి?
  • నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా” పురికొల్పే కూటాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
jl పాఠం 7

7వ పాఠం

మా కూటాలు ఎలా జరుగుతాయి?

న్యూజిలాండ్‌లో యెహోవాసాక్షుల కూటం

న్యూజిలాండ్‌

జపాన్‌లో యెహోవాసాక్షుల కూటం

జపాన్‌

ఉగాండాలో ఒక బాబు బైబిలు చదువుతున్నాడు

ఉగాండా

లిథువానియాలో ఇద్దరు సహోదరీలు బైబిలు ప్రదర్శన చేస్తున్నారు

లిథువానియా

మొదటి శతాబ్దంలోని క్రైస్తవ కూటాల్లో ముఖ్యంగా పాటలు పాడడం, ప్రార్థించడం, లేఖనాలు చదివి చర్చించడం ఉండేవి. వాటిలో ఎలాంటి ఆచారాలు పాటించేవాళ్లు కాదు. (1 కొరింథీయులు 14:26) మా కూటాలు కూడా అలాగే జరుగుతాయి.

బైబిలు ఆధారంగా, పాటించదగిన ఉపదేశం ఇస్తారు. ప్రతీ సంఘంలో, శనివారం లేదా ఆదివారం జరిగే కూటంలో 30 నిమిషాల బైబిలు ప్రసంగం ఉంటుంది. మన జీవితాల గురించి, ఇప్పటి రోజుల గురించి బైబిలు ఏం చెప్తుందో ఆ ప్రసంగంలో తెలుసుకుంటాం. లేఖనాలు చదువుతున్నప్పుడు బైబిలు తీసి చూడమని మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ప్రసంగం తర్వాత ఒక గంటసేపు “కావలికోట” అధ్యయనం జరుగుతుంది. అప్పుడు కావలికోట అధ్యయన ప్రతిలోని ఒక ఆర్టికల్‌ చర్చిస్తారు, కూటానికి వచ్చిన వాళ్లందరూ జవాబులు చెప్పవచ్చు. ఈ అధ్యయనం, బైబిలు నిర్దేశాన్ని మా జీవితాల్లో పాటించడానికి సహాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,20,000 కన్నా ఎక్కువున్న యెహోవాసాక్షుల సంఘాల్లో ఒకే సమాచారం చర్చిస్తాం.

బోధనా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి సహాయం చేస్తారు. వారంమధ్యలో జరిగే కూటంలో మన క్రైస్తవ జీవితం, పరిచర్య అనే మూడుభాగాల కార్యక్రమం ఉంటుంది. అది ప్రతీనెల వచ్చే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ ఆధారంగా జరుగుతుంది. ఈ కూటంలో మొదటి భాగం, “దేవుని వాక్యంలో ఉన్న సంపద.” ఇది బైబిల్లోని కొన్ని అధ్యాయాల్ని లోతుగా పరిశీలించడానికి సహాయం చేస్తుంది. సంఘంలోని వాళ్లు ఆ అధ్యాయాల్ని ముందే చదువుకొని వస్తారు. రెండో భాగం, “చక్కగా సువార్త ప్రకటిద్దాం.” ఇందులో, ఇతరులతో బైబిలు విషయాలు ఎలా చర్చించాలో చూపించే ప్రదర్శనలు ఉంటాయి. చదవడంలో, బోధించడంలో మా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఒక సహోదరుడు సలహాలు ఇస్తాడు. (1 తిమోతి 4:13) మూడో భాగం, “మన క్రైస్తవ జీవితం.” రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాలు ఎలా పాటించవచ్చో ఈ భాగంలో పరిశీలిస్తాం. ఇందులో బైబిల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నాజవాబుల చర్చ ఉంటుంది.

మా కూటాలకు వచ్చినప్పుడు మీరు చక్కని బైబిలు ఉపదేశం పొందుతారు, అది మీకు తప్పకుండా నచ్చుతుంది.—యెషయా 54:13.

  • యెహోవాసాక్షుల కూటాల్లో మీరు ఏం నేర్చుకోవచ్చు?

  • వారంలో జరిగే రెండు కూటాల్లో మీరు దేనికి రావాలనుకుంటున్నారు?

ఇంకా తెలుసుకోవడానికి . . .

తర్వాతి కూటాల్లో చర్చించే కొంత సమాచారాన్ని పరిశీలించండి. రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఏ విషయాల్ని మీరు బైబిల్లో నేర్చుకోవచ్చో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి