పాట 42
‘బలహీనుల్ని’ సంరక్షిద్దాం
1. మంటివారము మనం, బలహీనులం.
ఐనా యెహోవా ప్రేమ, తగ్గదేమాత్రం.
చూపిస్తాడు దయ జాలి, ప్రేమాగుణం.
మనమూ యెహోవాలా, ప్రేమ చూపిద్దాం.
2. బలహీనుల్ని మనం, అలక్ష్యంచేయం.
వారికై కూడా క్రీస్తు, ఇచ్చాడు ప్రాణం.
దేవుడే వారికి, అందిస్తాడు బలం.
సానుభూతి చూపిద్దాం, ఓదార్పునిద్దాం.
3. బలహీనుల్ని మనం, అవమానించం.
దయచూపి వారిని, బలపరుద్దాం.
చూపిస్తూ ప్రేమను, ప్రోత్సాహాన్ని ఇద్దాం.
సాయమందిస్తూ మనం, సాంత్వననిద్దాం.
(యెష. 35:3, 4; 2 కొరిం. 11:29; గల. 6:2 కూడా చూడండి.)