పాట 17
సాక్షుల్లారా ముందుకు సాగండి!
1. సాగండి మీరు స్థిరంగా ముందుకు
సువార్త పక్షమున పోరాడేందుకు.
సాతానడ్డుగా ఉన్నాగానీ
దేవుడెల్లప్పుడు తోడైవుంటాడు.
(పల్లవి)
ధైర్యంగా, సంతోషంతో ఓ సాక్షుల్లారా
దైవ చిత్తం చేస్తూ ముందుకు సాగండి.
భూమి పరదైసు కానుందనే వార్త
ప్రజలందరికీ తెలపండి.
2. ఆశించవద్దు లోక సౌకర్యాలు
దాని మాలిన్యం మీకంటనివ్వకండి.
అధికారుల్ని మెప్పించక
యెహోవాకే నమ్మకంగా ఉండండి.
(పల్లవి)
ధైర్యంగా, సంతోషంతో ఓ సాక్షుల్లారా
దైవ చిత్తం చేస్తూ ముందుకు సాగండి.
భూమి పరదైసు కానుందనే వార్త
ప్రజలందరికీ తెలపండి.
3. దేవుని రాజ్యం నిజం కాదంటారు
ఆయన్ను దూషిస్తూ అవమానిస్తారు.
ఘనపరుస్తూ యెహోవాను
చాటండి మన దేవుని నామము.
(పల్లవి)
ధైర్యంగా, సంతోషంతో ఓ సాక్షుల్లారా
దైవ చిత్తం చేస్తూ ముందుకు సాగండి.
భూమి పరదైసు కానుందనే వార్త
ప్రజలందరికీ తెలపండి.
(ఫిలి. 1:7; 2 తిమో. 2:3, 4; యాకో. 1:27 కూడా చూడండి.)