సెక్షన్ 1
“సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం”
యెహోవాకు సృష్టించే, నాశనం చేసే, కాపాడే, చక్కదిద్దే శక్తి ఉంది. దాని గురించి బైబిలు ఎలా వివరిస్తుందో ఈ సెక్షన్లో చూస్తాం. “సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం” ఉన్న యెహోవా దేవుడు తన ‘అపారమైన శక్తిని’ ఎలా ఉపయోగిస్తాడో తెలుసుకుంటే, మన గుండెల్లో ధైర్యం, ఆశ పొంగిపొర్లుతాయి.—యెషయా 40:26.