కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • kl అధ్యా. 4 పేజీలు 32-42
  • యేసుక్రీస్తు—దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసుక్రీస్తు—దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకము
  • నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాగ్దానం చేయబడిన మెస్సీయ
  • యేసే మెస్సీయ అని చెప్పడానికి నిదర్శనం
  • యేసు మానవ పూర్వపు ఉనికి
  • భూమిపై యేసు జీవితం
  • యేసు నేడు
  • ఆయన తొలి జీవితం
  • ఆయన పరిచర్య
  • ఆయన అప్పగింపబడుట, మరణము
  • “మేము మెస్సీయను కనుగొంటిమి”!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • వారు మెస్సీయ కోసం ఎదురుచూశారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
kl అధ్యా. 4 పేజీలు 32-42

అధ్యాయము 4

యేసుక్రీస్తు—దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకము

1, 2. దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకమైన వ్యక్తిని ప్రపంచ మతాలు ఎలా చేశాయి?

మీరు మీ తలుపు దగ్గర నిలబడి, మీ తాళపుచెవులతో తిప్పలుపడుతున్నారు. బయట చలిగా, చీకటిగా ఉంది, లోనికి వెళ్లాలని మీకు ఆత్రంగా ఉంది—కాని తాళపుచెవి పనిచేయడం లేదు. అది సరైన తాళపుచెవిగానే కనిపిస్తుంది, అయినా తాళం తెరుచుకోదు. ఎంత విసుగొస్తుంది! మీరు మళ్లీ మీ తాళాల వైపు చూస్తారు. మీరు సరైనదాన్నే ఉపయోగిస్తున్నారా? ఎవరైనా తాళపుచెవిని పాడుచేశారా?

2 ఈ ప్రపంచ మతాల గందరగోళం దేవుని గూర్చిన జ్ఞానంతో చేసిన దానికి అది తగిన ఉదాహరణే. వాస్తవంగా, మనం గ్రహించడానికి సహాయం చేసే కీలకాన్ని అంటే యేసుక్రీస్తును అనేకులు అలాగే చేశారు. కొన్ని మతాలు యేసును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ద్వారా, ఆ కీలకాన్ని తీసివేశాయి. ఇతరులు యేసును సర్వశక్తిగల దేవునిగా ఆరాధిస్తూ, ఆయన పాత్రను వక్రీకరించారు. ఏదేమైనప్పటికీ, మనకు యేసుక్రీస్తు అనే ఈ ప్రముఖ వ్యక్తిని గూర్చిన కచ్చితమైన అవగాహన లేకుండా దేవుని గూర్చిన జ్ఞానం మూసివేయబడింది.

3. దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకమని యేసు ఎందుకు పిలువబడవచ్చు?

3 “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నునూ నీవు పంపిన యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము” అని యేసు చెప్పాడని మీకు గుర్తుండి ఉండవచ్చు. (యోహాను 17:3, NW) ఇలా చెప్పడంలో, యేసు అతిశయించడం లేదు. లేఖనాలు క్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానం యొక్క అవసరతను పదేపదే నొక్కిచెబుతున్నాయి. (ఎఫెసీయులు 4:13; కొలొస్సయులు 2:2; 2 పేతురు 1:8; 2:20) “ప్రవక్తలందరు ఆయననుగూర్చి [యేసుక్రీస్తును గూర్చి] సాక్ష్యమిచ్చుచున్నారు” అని అపొస్తలుడైన పేతురు తెలియజేశాడు. (అపొస్తలుల కార్యములు 10:43) మరియు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే [యేసునందే] గుప్తములైయున్నవి.” (కొలొస్సయులు 2:3) యేసు మూలంగా యెహోవా వాగ్దానాలన్నీ నెరవేరుతాయని కూడా పౌలు చెప్పాడు. (2 కొరింథీయులు 1:20) కాబట్టి యేసుక్రీస్తు దేవుని గూర్చిన జ్ఞానానికి అసలు కీలకము. యేసును గూర్చిన మన జ్ఞానం విషయంలో, ఆయన నైజం, దేవుని ఏర్పాటులో ఆయన పాత్ర వంటి వాటిని గురించి ఏ విధమైన అపార్థాలు ఉండకూడదు. అయితే దేవుని సంకల్పాలలో యేసు ప్రముఖుడని ఆయన శిష్యులు ఎందుకు పరిగణిస్తారు?

వాగ్దానం చేయబడిన మెస్సీయ

4, 5. మెస్సీయపై ఏ నిరీక్షణలు కేంద్రీకరించబడ్డాయి, యేసు శిష్యులు ఆయననెలా దృష్టించారు?

4 విశ్వాసియైన హేబెలు కాలంనుండి, యెహోవా దేవుడు ప్రవచించిన సంతానం కొరకు దేవుని సేవకులు ఆతురతతో ఎదురుచూశారు. (ఆదికాండము 3:15; 4:1-8; హెబ్రీయులు 11:4) “అభిషిక్తుడు” అనే భావంగల మెస్సీయగా ఆ సంతానం దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాడని తెలియజేయబడింది. ఆయన ‘పాపమును నివారణ చేయును,’ ఆయన రాజ్యాన్ని గూర్చిన మహిమలు కీర్తనలలో ముందే తెలియజేయబడ్డాయి. (దానియేలు 9:24-26; కీర్తన 72:1-20) ఎవరు మెస్సీయగా నిరూపించబడతారు?

5 నజరేయుడైన యేసు మాటలను విన్నప్పుడు యూదుడూ యౌవనస్థుడుయైన అంద్రెయ పొందిన ఉత్సాహాన్ని ఊహించండి. అంద్రెయ తన సహోదరుడైన సీమోను పేతురు దగ్గరికి పరుగెత్తి, ఆయనకిలా చెప్పాడు: “మేము మెస్సీయను కనుగొంటిమి.” (యోహాను 1:41) ఆయనే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని యేసు శిష్యులకు రూఢిగా తెలుసు. (మత్తయి 16:16) మరియు యేసే వాస్తవంగా ప్రవచింపబడిన మెస్సీయ లేక క్రీస్తు అనే నమ్మకం కొరకు నిజక్రైస్తవులు తమ జీవితాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉండిరి. వారికున్న నిదర్శనమేమిటి? మనం మూడు రకాల నిదర్శనాలను పరిశీలిద్దాము.

యేసే మెస్సీయ అని చెప్పడానికి నిదర్శనం

6. (ఎ) వాగ్దాన సంతానాన్ని ఏ వంశక్రమం ఉత్పన్నం చేయవలసి ఉండెను, ఆ వంశక్రమం నుండే యేసు వచ్చాడని మనకెలా తెలుసు? (బి) సా.శ. 70 తర్వాత జీవించేవారు ఎవరైనా సరే తాను మెస్సీయనని నిరూపించుకోవడం ఎందుకు అసాధ్యమై ఉంటుంది?

6 వాగ్దానం చేయబడిన మెస్సీయగా ఆయనను గుర్తించడానికి యేసు వంశావళి మొదటి ఆధారం. వాగ్దానం చేయబడిన సంతానం తన సేవకుడైన అబ్రాహాము కుటుంబంనుండి వస్తుందని యెహోవా ఆయనకు చెప్పాడు. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన యూదా వీరందరూ అలాంటి వాగ్దానాన్నే పొందారు. (ఆదికాండము 22:18; 26:2-5; 28:12-15; 49:10) శతాబ్దాల తర్వాత, రాజైన దావీదు కుటుంబం ఈ సంతానాన్ని ఉత్పన్నం చేస్తుందని ఆయనకు చెప్పబడినప్పుడు, మెస్సీయ వంశావళి క్రమం తగ్గించబడింది. (కీర్తన 132:11; యెషయా 11:1, 10) యేసు ఆ వంశక్రమం నుండే వచ్చాడని మత్తయి మరియు లూకా సువార్త వృత్తాంతాలు ధృవీకరిస్తున్నాయి. (మత్తయి 1:1-16; లూకా 3:23-38) యేసుకు ఎంతోమంది బద్ధ శత్రువులున్నప్పటికీ, బహుళ ప్రచారం పొందిన ఆయన వంశక్రమాన్ని ఎవరూ సవాలు చేయలేదు. (మత్తయి 21:9, 15) కాబట్టి, ఆయన వంశక్రమం వివాదాస్పదమైనది కాదన్నది స్పష్టం. అయితే, సా.శ. 70 లో యెరూషలేమును రోమన్లు చుట్టుముట్టినప్పుడు, యూదుల వంశ చరిత్రలు నాశనం చేయబడ్డాయి. ఆ తర్వాతి కాలాల్లో, ఎవ్వరూ ఎన్నడూ వాగ్దానం చేయబడిన మెస్సీయనని చెప్పుకోలేరు.

7. (ఎ) యేసు మెస్సీయ అని చెప్పడానికి రెండవ నిదర్శనం ఏది? (బి) యేసుకు సంబంధించి మీకా 5:2 ఎలా నెరవేర్చబడింది?

7 నెరవేరిన ప్రవచనం రెండవ నిదర్శనం. డజన్ల కొలది హెబ్రీ లేఖనాలు మెస్సీయ జీవిత గమనంలోని అనేక దశలను వివరిస్తాయి. ఈ గొప్ప పరిపాలకుడు సామాన్య పట్టణమైన బేత్లెహేములో జన్మిస్తాడని సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో ప్రవక్తయైన మీకా ప్రవచించాడు. ఇశ్రాయేలులో రెండు పట్టణాలకు బేత్లెహేము అనే పేరుంది, కాని ఈ ప్రవచనం ఏ పట్టణమో స్పష్టంగా తెలియజేసింది: రాజైన దావీదు జన్మించిన బేత్లెహేము ఎఫ్రాతా. (మీకా 5:2) యేసు తలిదండ్రులైన యోసేపు, మరియ బేత్లెహేముకు 90 మైళ్లు ఉత్తరంగా, నజరేతులో నివసించారు. అయితే, మరియ గర్భంతో ఉన్నప్పుడు, రోమా పరిపాలకుడైన కైసరు ఔగుస్తు ప్రజలందరు తమ స్వంత పట్టణాల్లో పేర్లను నమోదు చేయించుకోవాలని ఆజ్ఞాపించాడు.a కాబట్టి యోసేపు గర్భంతోవున్న తన భార్యను బేత్లెహేముకు తీసుకువెళ్లవలసి వచ్చింది, అక్కడే యేసు జన్మించాడు.—లూకా 2:1-7.

8. (ఎ) ఎప్పుడు, ఏ సంఘటనతో 69 ‘వారములు’ ప్రారంభమయ్యాయి? (బి) ఆ 69 ‘వారములు’ ఎంత కాలనిడివి గలవి, అవి ముగిసినప్పుడు ఏమి జరిగింది?

8 యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన 69 ‘వారముల’ తర్వాత “అభిషిక్తుడగు అధిపతి” కనిపిస్తాడని, సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో ప్రవక్తయైన దానియేలు ప్రవచించాడు. (దానియేలు 9:24, 25) ఈ “వారము”లలో ఒక్కొక్కటి ఏడు సంవత్సరాల కాలనిడివిగలది.b బైబిలు మరియు లౌకిక చరిత్ర ప్రకారం, యెరూషలేమును మరల కట్టించవచ్చుననే ఆజ్ఞ సా.శ.పూ. 455 లో ఇవ్వబడింది. (నెహెమ్యా 2:1-8) కాబట్టి సా.శ.పూ. 455 నుండి 483 (69x7) సంవత్సరాల తర్వాత మెస్సీయ కనిపించవలసి ఉండింది. అది మనల్ని సా.శ. 29 అంటే యెహోవా యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించిన సంవత్సరానికి తెస్తుంది. అలా యేసు “క్రీస్తు” (“అభిషిక్తుడు” అని భావం) లేక మెస్సీయ అయ్యాడు.—లూకా 3:15, 16, 21, 22.

9. (ఎ) కీర్తన 2:2 ఎలా నెరవేరింది? (బి) యేసునందు నెరవేరిన కొన్ని ఇతర ప్రవచనాలు ఏవి? (చార్టు చూడండి.)

9 అయితే, వాగ్దానం చేయబడిన మెస్సీయగా యేసును అందరూ అంగీకరించలేదు, లేఖనాలు దీన్ని గూర్చి ప్రవచించాయి. కీర్తన 2:3 నందు వ్రాయబడినట్లుగా, రాజైన దావీదు ఇలా ప్రవచించడానికి దైవికంగా ప్రేరేపించబడ్డాడు: “భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు.” యెహోవా యొక్క అభిషిక్తునిపై, లేక మెస్సీయపై దాడి చేసేందుకు ఒకటికంటే ఎక్కువ దేశాల నాయకులు ఐక్యమౌతారని ఈ ప్రవచనం సూచించింది. అలాగే జరిగింది. యూదా మత నాయకులు, రాజగు హేరోదు, రోమా పరిపాలకుడైన పొంతి పిలాతు వీళ్లందరు యేసును చంపించడంలో భాగం వహించారు. గతంలో శత్రువులైన హేరోదు మరియు పిలాతు అప్పటి నుండి ఆప్తమిత్రులయ్యారు. (మత్తయి 27:1, 2; లూకా 23:10-12; అపొస్తలుల కార్యములు 4:25-28) యేసు మెస్సీయయై ఉండెననడానికి ఇతర సాక్ష్యాధారాల కొరకు “మెస్సీయను గూర్చిన కొన్ని ప్రముఖ ప్రవచనాలు” అనే పేరుగల ప్రక్కనున్న చార్టును దయచేసి చూడండి.

10. యేసే తాను వాగ్దానం చేసిన అభిషిక్తుడని యెహోవా ఏయే విధాలుగా సాక్ష్యమిచ్చాడు?

10 యెహోవా దేవుని సాక్ష్యం యేసు మెస్సీయ అనడానికి మద్దతునిచ్చే మూడవ నిదర్శనం. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ప్రజలు తెలుసుకునేందుకు యెహోవా దేవదూతలను పంపించాడు. (లూకా 2:10-14) వాస్తవానికి, యేసు భూ జీవిత కాలంలో, యేసును గూర్చిన తన ఆమోదాన్ని వ్యక్తపరుస్తూ యెహోవా తానే పరలోకం నుండి మాట్లాడాడు. (మత్తయి 3:16, 17; 17:1-5) యెహోవా దేవుడు యేసుకు అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు. యేసు మెస్సీయ అని చెప్పడానికి వీటిలో ఒక్కొక్కటి దైవిక నిదర్శనమై ఉంది, ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే శక్తిని ఒక మోసగానికి ఎన్నడూ ఇవ్వడు. చరిత్రలో ఎంతో విస్తృతంగా అనువదించబడిన, పంచిపెట్టబడిన గ్రంథమైన బైబిల్లో యేసు మెస్సీయ అనడానికిగల నిదర్శనం ఒక భాగమయ్యేలా సువార్త వృత్తాంతాలను ప్రేరేపించేందుకు కూడా యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు.—యోహాను 4:25, 26.

11. యేసు మెస్సీయ అని చెప్పడానికి ఎంత నిదర్శనం ఉంది?

11 మొత్తానికి, వాగ్దానం చేయబడిన మెస్సీయగా యేసును గుర్తించే వందలాది వాస్తవాలు ఈ నిదర్శనాలలో చేరివున్నాయి. కాబట్టి స్పష్టంగా, నిజ క్రైస్తవులు ఆయనను ‘ప్రవక్తలందరూ సాక్ష్యం పలికినవానిగా,’ దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకముగా సరిగ్గానే దృష్టించారు. (అపొస్తలుల కార్యములు 10:43) కాని యేసుక్రీస్తు మెస్సీయ అనే వాస్తవం కంటే ఇంకా ఎక్కువే నేర్చుకోవలసి ఉంది. ఆయన ఎక్కడ నుండి వచ్చాడు? ఆయన ఎలా ఉండేవాడు?

యేసు మానవ పూర్వపు ఉనికి

12, 13. (ఎ) భూమి పైకి రాక ముందు యేసు పరలోకంలో ఉండెనని మనకెలా తెలుసు? (బి) “వాక్యము” ఎవరు, మానవుడు కాకమునుపు ఆయనేమి చేశాడు?

12 యేసు జీవితాన్ని మూడు భాగాలుగా విభాగించవచ్చు. ఆయన భూమిపై జన్మించడానికి ఎంతోకాలం ముందే, మొదటి భాగం ప్రారంభమైంది. మెస్సీయ ఆరంభం “పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము” అని మీకా 5:2 తెలియజేసింది. తాను ‘పైనుండి’ అంటే పరలోకం నుండి వచ్చానని యేసు స్పష్టంగా చెప్పాడు. (యోహాను 8:23; 16:28) భూమిపైకి రాకముందు ఆయన పరలోకంలో ఎంత కాలం నుండి ఉనికిలో ఉన్నాడు?

13 యెహోవా యేసును స్వయంగా సృష్టించాడు కాబట్టి, ఆయన దేవుని “అద్వితీయ కుమారు”డని పిలువబడ్డాడు. (యోహాను 3:16) యేసు “సర్వసృష్టికి ఆదిసంభూతుడై”నందున ఇతరమైనవన్నీ సృష్టించడానికి దేవునిచే ఉపయోగించుకోబడ్డాడు. (కొలొస్సయులు 1:15; ప్రకటన 3:14) “వాక్యము” (యేసు తన మానవ పూర్వపు ఉనికిలో) “ఆదియందు” దేవునియొద్ద ఉండెనని యోహాను 1:1 చెబుతుంది. కాబట్టి “భూమ్యాకాశములను” సృష్టించినప్పుడు వాక్యము యెహోవా యొద్ద ఉండెను. “మన పోలికె చొప్పున నరులను చేయుదము” అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఆ వాక్యంతో మాట్లాడుతుండెను. (ఆదికాండము 1:1, 26) అలాగే, సామెతలు 8:22-31 నందు వ్యక్తీకరింపబడిన జ్ఞానముగా, అన్నిటినీ చేయడంలో యెహోవాతో పాటు పనిచేస్తున్నట్లుగా వర్ణించబడిన వాక్యము దేవుని ప్రియమైన “ప్రధాన శిల్పి”యై ఉండవచ్చు. యెహోవా ఆయనను సృజించిన తర్వాత, భూమిపైకి మానవునిగా రాకముందు వాక్యము పరలోకంలో దేవునితోపాటు అసంఖ్యాక యుగాలు గడిపాడు.

14. “అదృశ్య దేవుని స్వరూపం” అని యేసు ఎందుకు పిలువబడ్డాడు?

14 కొలొస్సయులు 1:15 యేసును “అదృశ్యదేవుని స్వరూపి” అని పిలువడంలో ఆశ్చర్యంలేదు! లెక్కించలేనన్ని సంవత్సరాల సన్నిహిత సహచర్యం ద్వారా, విధేయుడైన కుమారుడు తన తండ్రియైన యెహోవాలాగే తయారయ్యాడు. జీవాన్నిచ్చే దేవుని గూర్చిన జ్ఞానానికి యేసు ఎందుకు కీలకమైయున్నాడనే దానికి ఇది మరో కారణం. యేసు భూమిపై ఉన్నప్పుడు చేసినదంతా కచ్చితంగా యెహోవా చేసివుండేదే. కాబట్టి, యేసును తెలుసుకోవడమంటే యెహోవాను గూర్చిన మన జ్ఞానాన్ని అధికం చేసుకోవడమని కూడా అర్థం. (యోహాను 8:28; 14:8-10) కాబట్టి, యేసు గురించి ఎక్కువ నేర్చుకోవడం ప్రాముఖ్యమన్నది స్పష్టం.

భూమిపై యేసు జీవితం

15. యేసు పరిపూర్ణ శిశువుగా ఎలా జన్మించాడు?

15 యేసు జీవితంలోని రెండవ భాగం ఈ భూమ్మీదే. దేవుడు ఆయన జీవాన్ని పరలోకం నుండి మరియ అనే విశ్వాసురాలైన యూదా కన్యక గర్భంలోకి మార్చినప్పుడు, ఆయన ఇష్టపూర్వకంగా విధేయత చూపాడు. యెహోవా యొక్క శక్తివంతమైన పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తి మరియను ‘కమ్ముకొని,’ ఆమె గర్భం ధరించి చివరికి పరిపూర్ణమైన శిశువుకు జన్మనిచ్చేలా చేసింది. (లూకా 1:34, 35) యేసు జీవం పరిపూర్ణమైన మూలం నుండి వచ్చింది గనుక, ఆయన ఏ అపరిపూర్ణతను సంతరించుకోలేదు. వడ్రంగివాడైన యోసేపు యొక్క దత్తపుత్రునిగా, కుటుంబంలోని అనేకమంది పిల్లల్లో మొదటి వానిగా ఆయన ఒక సామాన్య గృహంలో పెంచబడ్డాడు.—యెషయా 7:14; మత్తయి 1:22, 23; మార్కు 6:3.

16, 17. (ఎ) అద్భుతాలు చేయడానికి యేసుకు శక్తి ఎక్కడినుండి లభించింది, వాటిలో కొన్ని ఏవి? (బి) యేసు ప్రదర్శించిన కొన్ని లక్షణాలేవి?

16 యెహోవా దేవుని ఎడల యేసుకు గల ప్రగాఢ భక్తి ఆయన 12 సంవత్సరాల వయస్సులో ఉండగానే స్పష్టమయ్యింది. (లూకా 2:41-49) యేసు పెరిగి పెద్దవాడై, 30వ యేట తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత, తన తోటి మానవుల ఎడల తనకుగల అత్యధిక ప్రేమను కూడా ఆయన ప్రదర్శించాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను అద్భుతాలు చేయడానికి శక్తిమంతున్ని చేసినప్పుడు ఆయన రోగులను, కుంటివారిని, అంగహీనులను, గ్రుడ్డివారిని, చెవిటివారిని, కుష్ఠరోగులను ప్రేమపూర్వకంగా స్వస్థపర్చాడు. (మత్తయి 8:2-4; 15:30) యేసు ఆకలిగొన్న వేలాదిమందికి ఆహారాన్నిచ్చాడు. (మత్తయి 15:35-38) తన స్నేహితుల భద్రతకు భంగం కలిగించబోయిన తుపానును ఆయన నిమ్మళపరిచాడు. (మార్కు 4:37-39) వాస్తవానికి, ఆయన మృతులను పునరుత్థానం కూడా చేశాడు. (యోహాను 11:43, 44) ఈ అద్భుతాలు చరిత్ర యొక్క నిర్ధారిత వాస్తవాలు. ఆయన ‘అనేక అద్భుతాలు చేశాడని’ యేసు శత్రువులు సహితం అంగీకరించారు.—యోహాను 11:47, 48.

17 దేవుని రాజ్యం గురించి ప్రజలకు బోధిస్తూ, యేసు తన స్వదేశమంతటా తిరిగాడు. (మత్తయి 4:17) సహనం, సహేతుకతలలో ఆయన అత్యున్నతమైన మాదిరిని కూడా ఉంచాడు. ఆయన శిష్యులాయనను నిరాశపర్చినప్పుడు సహితం ఆయన సానుభూతితో “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని” అన్నాడు. (మార్కు 14:37, 38) అయినప్పటికీ, సత్యాన్ని ద్వేషించి నిస్సహాయులను అణగద్రొక్కిన వారితో యేసు ధైర్యంగా నిర్మొహమాటంగా వ్యవహరించాడు. (మత్తయి 23:27-33) ప్రాముఖ్యంగా, ఆయన ప్రేమ విషయంలో తన తండ్రి మాదిరిని పరిపూర్ణంగా అనుకరించాడు. అపరిపూర్ణ మానవులకు భవిష్యత్తు కొరకు ఒక నిరీక్షణ ఉండేలా యేసు మరణించడానికి కూడా సిద్ధంగా ఉండెను. కాబట్టి, దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకమని యేసును మనం కచ్చితంగా సూచించవచ్చుననడంలో ఆశ్చర్యం లేదు! అవును, ఆయన సజీవమైన కీలకము! కాని మనం సజీవమైన కీలకమని ఎందుకంటున్నాము? ఇది మనల్ని ఆయన జీవిత గమనంలోని మూడవ భాగానికి తెస్తుంది.

యేసు నేడు

18. నేడు మనం యేసుక్రీస్తును ఎలా దృశ్యీకరించుకోవాలి?

18 యేసు మరణాన్ని గూర్చి బైబిలు తెలియజేసినప్పటికీ, ఆయన ఇప్పుడు సజీవంగా ఉన్నాడు! నిజానికి, ఆయన పునరుత్థానం చేయబడ్డాడనే వాస్తవానికి సా.శ. మొదటి శతాబ్దంలో జీవించిన వందలాది మంది ప్రజలు ప్రత్యక్షసాక్షులై ఉండిరి. (1 కొరింథీయులు 15:3-8) ప్రవచింపబడినట్లుగా, ఆయన ఆ తర్వాత తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని, పరలోకంలో రాజరికపు అధికారాన్ని పొందేందుకు నిరీక్షించాడు. (కీర్తన 110:1; హెబ్రీయులు 10:12, 13) కాబట్టి మనం నేడు యేసును ఎలా దృశ్యీకరించుకోవాలి? ఆయన పశువుల తొట్టిలోవున్న నిస్సహాయ శిశువని మనం భావించాలా? లేక చంపనుద్దేశింపబడిన బాధపడుతున్న వ్యక్తిగా దృశ్యీకరించుకోవాలా? కాదు. ఆయన శక్తిమంతుడైన, పరిపాలిస్తున్న రాజు! ఆయన ఇప్పుడు త్వరలోనే, కష్టాలతో నిండివున్న మన భూమిపై తన పరిపాలనను ప్రారంభిస్తాడు.

19. సమీప భవిష్యత్తులో యేసు ఏ చర్య గైకొంటాడు?

19 రాజైన యేసుక్రీస్తు దుష్టులను నాశనం చేయడానికి గొప్ప శక్తితో వస్తున్నట్లు ప్రకటన 19:11-15 నందు స్పష్టంగా వర్ణించబడ్డాడు. నేడు లక్షలాదిమందిని బాధిస్తున్న శ్రమను అంతమొందించేందుకు ఈ ప్రేమగల పరలోక పరిపాలకుడు ఎంత ఆసక్తి కలిగివుండవచ్చు! తాను భూమి మీద ఉన్నప్పుడు చూపించిన పరిపూర్ణమైన మాదిరిని అనుకరించేందుకు ప్రయాసపడుతున్న వారికి సహాయం చేయడానికి ఆయన అంతే ఆతురత కలిగి ఉన్నాడు. (1 పేతురు 2:21) దేవుని పరలోక రాజ్య భూ సభ్యులుగా వారు నిరంతరం జీవించగలిగేలా తరచూ హార్‌మెగిద్దోను అని పిలువబడుతూ వేగంగా సమీపిస్తున్న “దేవుని మహాదినమున జరుగు యుద్ధము” నుండి వారిని సజీవంగా కాపాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు.—ప్రకటన 7:9, 14; 16:14, 16.

20. తన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో మానవజాతి కొరకు యేసు ఏమి చేస్తాడు?

20 యేసు యొక్క ప్రవచింపబడిన వెయ్యేండ్ల శాంతియుత పరిపాలనా కాలంలో, ఆయన సమస్త మానవుల నిమిత్తం అద్భుతాలు చేస్తాడు. (యెషయా 9:6, 7; 11:1-10; ప్రకటన 20:6) యేసు రోగాలన్నిటినీ స్వస్థపర్చి, మరణానికి అంతం తెస్తాడు. వందలకోట్ల మంది కూడా భూమిపై నిరంతరం జీవించగలిగేలా వారిని ఆయన పునరుత్థానం చేస్తాడు. (యోహాను 5:28, 29) ఆయన మెస్సీయ రాజ్యాన్ని గూర్చి తరువాతి అధ్యాయంలో మరింత నేర్చుకోవడానికి మీరు పులకించిపోతారని మేము విశ్వసిస్తున్నాము. దీని గురించి నిశ్చయత కలిగివుండండి: రాజ్య పరిపాలన క్రింద మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉండగలవో మనం ఏమాత్రం ఊహించలేము. యేసుక్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యం! అవును, నిత్యజీవానికి నడిపించే దేవుని గూర్చిన జ్ఞానానికి యేసు సజీవమైన కీలకమని మనం ఎన్నడూ మరచిపోకుండా ఉండడం ప్రాముఖ్యము.

[అధస్సూచీలు]

a రోమా సామ్రాజ్యం పన్నులను సరైనవిధంగా రాబట్టడానికి ఈ నమోదు చేయించేపని దోహదపడింది. గనుక, ‘రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపే’ ఒక పరిపాలకునికి సంబంధించిన ప్రవచనాన్ని నెరవేర్చేందుకు ఔగుస్తు తెలియనిరీతిగానే సహాయం చేశాడు. “నిబంధనాధిపతి” లేక మెస్సీయ, ఈ పరిపాలకుని తరువాత వచ్చిన వ్యక్తి దినములలో “నాశనమౌతాడు” అని అదే ప్రవచనం తెలియజేసింది. ఔగుస్తు తర్వాతి పరిపాలకుడైన తిబెరు పరిపాలనా కాలంలో యేసు చంపబడ్డాడు.—దానియేలు 11:20-22, NW.

b ప్రాచీన యూదులు సాధారణంగా వారపు దినాల్ని సంవత్సరాలుగా తలంచేవారు. ఉదాహరణకు, ప్రతి ఏడవ దినం విశ్రాంతి దినం అయినట్లే, ప్రతి ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అయ్యేది.—నిర్గమకాండము 20:8-11; 23:10, 11.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

యేసు మెస్సీయ అనే విషయాన్ని ఆయన వంశావళి ఎలా సమర్థిస్తుంది?

యేసునందు నెరవేరిన కొన్ని మెస్సీయ సంబంధిత ప్రవచనాలు ఏవి?

యేసు తన అభిషిక్తుడని దేవుడు ఎలా సూటిగా చూపించాడు?

యేసు ఎందుకు దేవుని గూర్చిన జ్ఞానానికి సజీవమైన కీలకము?

[37వ పేజీలోని చార్టు]

మెస్సీయను గూర్చిన కొన్ని ప్రముఖ ప్రవచనాలు

ప్రవచనం సంఘటన నెరవేర్పు

ఆయన తొలి జీవితం

యెషయా 7:14 కన్యకు జన్మించుట మత్తయి 1:18-23

యిర్మీయా 31:15 ఆయన జననం తర్వాత మత్తయి 2:16-18

శిశువులు చంపబడ్డారు

ఆయన పరిచర్య

యెషయా 61:1, 2 దేవుడాయనకు ఇచ్చిన ఆజ్ఞ లూకా 4:18-21

యెషయా 9:1, 2 పరిచర్య ప్రజలు గొప్ప మత్తయి 4:13-16

వెలుగును చూసేలా చేసింది

కీర్తన 69:9 యెహోవా ఇంటిని యోహాను 2:13-17

గూర్చిన ఆసక్తి

యెషయా 53:1 విశ్వసింపబడలేదు యోహాను 12:37, 38

జెకర్యా 9:9; గాడిదపిల్లనెక్కి మత్తయి 21:1-9

కీర్తన 118:26 యెరూషలేములో ప్రవేశించుట;

రాజుగా, యెహోవా నామమున

వస్తున్న వ్యక్తిగా

స్తుతించబడ్డాడు

ఆయన అప్పగింపబడుట, మరణము

కీర్తన 41:9; 109:8 అవిశ్వాసియైన ఒక అపొస్తలుడు; అపొస్తలుల కార్యములు

యేసును అప్పగించినందున తర్వాత వేరే 1:15-20

వ్యక్తి అతని స్థానాన్ని పొందాడు

జెకర్యా 11:12 ముప్పై వెండి మత్తయి 26:14, 15

నాణెములకు అప్పగింపబడ్డాడు

కీర్తన 27:12 ఆయనకు వ్యతిరేకంగా మత్తయి 26:59-61

అబద్ధ సాక్షులు ఉపయోగించబడ్డారు

కీర్తన 22:18 ఆయన వస్త్రాలకొరకు చీట్లు వేయబడ్డాయి యోహాను 19:23, 24

యెషయా 53:12 పాపులతో లెక్కింపబడ్డాడు మత్తయి 27:38

కీర్తన 22:7, 8 మరణిస్తుండగా దూషించబడ్డాడు మార్కు 15:29-32

కీర్తన 69:21 చిరక ఇవ్వబడింది మార్కు 15:23, 36

యెషయా 53:5; బల్లెముతో పొడవబడ్డాడు యోహాను 19:34, 37

జెకర్యా 12:10

యెషయా 53:9 ధనికులతో సమాధి చేయబడ్డాడు మత్తయి 27:57-60

కీర్తన 16:8-11, అథః. కుళ్లిపోకముందే లేపబడ్డాడు అపొస్తలుల కార్యములు

2:25-32; 13:34-37

[35వ పేజీలోని చిత్రం]

యేసుకు రోగులను స్వస్థపర్చే శక్తిని దేవుడిచ్చాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి