భాగం 11
నూతన లోకపు పునాది ఇప్పుడు రూపుదిద్దుకొంటోంది
1, 2. బైబిలు ప్రవచన నెరవేర్పుగా, మన కళ్లముందే ఏమి సంభవిస్తున్నది?
సాతాను పాతలోకము క్షీణిస్తుండగా దేవుని నూతన లోకపు పునాది యిప్పుడు రూపుదిద్దుకొంటోందన్న వాస్తవం కూడ అద్భుతమే. మన కళ్లముందే, దేవుడు సమస్త జనాంగములనుండి ప్రజలను సమకూర్చి, త్వరలోనే వారిని నేటి అనైక్య లోకానికి బదులు నూతనలోక సమాజ పునాదులుగా రూపుదిద్దుతున్నాడు. బైబిలులో 2 పేతురు 3:13 నందు ఈ నూతన సమాజం “క్రొత్త భూమి” అని పిలువబడింది.
2 బైబిలు ప్రవచనం యిలా కూడ అంటున్నది: “అంత్యదినములలో [మనము ప్రస్తుతం జీవించే కాలం] . . . , జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యెహోవా పర్వతమునకు [ఆయన సత్యారాధనకు] మనము వెళ్లుదము రండి, . . . ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2-3.
3. (ఎ) యెషయా ప్రవచనం ఎవరిమధ్య నెరవేరుతున్నది? (బి) ఈ విషయమై బైబిలునందలి చివరి పుస్తకము ఎలా వ్యాఖ్యానిస్తున్నది?
3 ‘దేవుని మార్గములకు’ విధేయులై ‘ఆయన త్రోవలలో నడుచుకొనువారి’ మధ్య ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతున్నది. సమాధానమును ప్రేమించు ఈ అంతర్జాతీయ సమాజాన్ని బైబిలునందలి చివరి పుస్తకము “ప్రతిజనమునుండియు ప్రతివంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయాభాషలు మాట్లాడువారిలోనుండి వచ్చిన . . . గొప్పసమూహమని,” ఐక్యంగా దేవుని సేవించు నిజమైన ప్రపంచవ్యాప్త సహోదర బృందమని వర్ణిస్తుంది. ఇంకను బైబిలు యిలా కూడ అంటున్నది: “వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు” అనగా వారు ఈ దుష్టవిధానాంతము నుండి తప్పించుకొనువారు.—ప్రకటన 7:9, 14; మత్తయి 24:3.
నిజమైన అంతర్జాతీయ సహోదర బృందము
4, 5. యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సహోదరత్వం ఎందుకు సాధ్యము?
4 లక్షలాదిమంది యెహోవాసాక్షులు దేవుని ఉపదేశములకు మరియు మార్గములకు అనుగుణంగా జీవించుటకు యథార్థంగా కృషి చేస్తున్నారు. వారి నిత్యజీవ నిరీక్షణ అంతా దేవుని నూతన లోకం మీదనే ఉన్నది. దేవుని శాసనములకు విధేయులై తమ దైనందిన జీవితాలను గడుపుటద్వారా, యిప్పుడును, రాబోవు నూతన లోకమందును ఆయనపాలనా విధానమునకు విధేయులమై యుంటామని తమ పూర్ణాంగీకారమును వారు ప్రదర్శిస్తున్నారు. వారి జాతి, లేక వర్ణమేదైనను, వారు ఎల్లవాడల దేవుడు తన వాక్యమందు నిర్దేశించిన ఒకే నియమావళికి విధేయులౌతారు. అందుకేవారు ఒక నిజమైన అంతర్జాతీయ సహోదర బృందం, దేవుడు సమకూర్చుతున్న ఒక నూతన లోకసమాజమై ఉన్నారు.—యెషయా 54:13; మత్తయి 22:37, 38; యోహాను 15:9, 14.
5 యెహోవాసాక్షులు తాము సాటిలేని ప్రపంచవ్యాప్త సహోదర బృందమై యున్నారని గర్వించరు. దేవుని శాసనాలకు లోబడు ప్రజలపై ఆయన శక్తివంతమైన ఆత్మ పనిచేయుట మూలంగా కల్గిన ఫలితమే ఇదని వారికి తెలుసు. (అపొస్తలుల కార్యములు 5:29, 32; గలతీయులు 5:22, 23) అది దేవుడు కలుగజేస్తున్నదే. యేసు యిలా చెప్పాడు, “మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు.” (లూకా 18:27) కావున సదానిలిచే విశ్వాన్ని చేసిన దేవుడే సదానిలిచియుండే నూతనలోక సమాజాన్ని కూడా సాధ్యపరుస్తాడు.
6. యెహోవాసాక్షుల సహోదరత్వమును ఒక ఆధునిక అద్భుతమని ఎందుకు పిలువవచ్చును?
6 ఆ విధంగా, నూతన లోకంలో యెహోవా పరిపాలించు విధానాన్ని, ఆయన ప్రస్తుతం తయారు చేస్తున్న నూతన లోక పునాదిలోనే చూడవచ్చును. అంటే, ఆయన సాక్షుల విషయములో తాను చేసింది ఒక ఆధునిక అద్భుతం అని చెప్పవచ్చును. ఎందుకు? ఎందుకంటే, ఆయన యెహోవాసాక్షులను జాతి, వర్ణ, లేదా మతవివక్షతల మూలంగా ఎన్నటికి విచ్ఛినము కానటువంటి ఒక నిజమైన ప్రపంచవ్యాప్త సహోదర బృందముగా తీర్చిదిద్దాడు. సాక్షులు 200 కంటే ఎక్కువ దేశాలలో నివసిస్తూ లక్షలాదిగా ఉన్నను, వారు అవిచ్ఛిన్న బంధమందు ఒకటిగా చేయబడియున్నారు. ఈ ప్రపంచవ్యాప్త సహోదర బృందం, చరిత్రంతటిలో సాటిలేనిదై, నిజంగా దేవుడు కలుగచేసిన ఆధునిక అద్భుతమే.—యెషయా 43:10, 11, 21; అపొస్తలుల కార్యములు 10:34, 35; గలతీయులు 3:28.
దేవుని ప్రజలను గుర్తించుట
7. తన నిజమైన అనుచరులు ఎలా గుర్తించబడతారని యేసు చెప్పెను?
7 ఈ నూతన లోకానికి దేవుడు ఎవరిని పునాదిగా ఉపయోగిస్తున్నాడనేది యింకను ఎలా నిర్ణయించవచ్చు? మరి, యోహాను 13:34, 35 నందలి యేసుమాటలను ఎవరు నెరవేరుస్తున్నారు? ఆయనిట్లన్నాడు: “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” యెహోవాసాక్షులు యేసు మాటలయందు నమ్మికయుంచి ఆ ప్రకారం చేస్తారు. దేవుని వాక్యం ఉపదేశించురీతిగా వారు “ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమగలవారై యున్నారు.” (1 పేతురు 4:8) దానికి తోడు వారు “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొన్నారు.” (కొలస్సయులు 3:14) కనుక ప్రపంచవ్యాప్తంగా వారిని ఒకటిగా చేర్చియుంచే “జిగురు” సహోదర ప్రేమయే.
8. దేవుని ప్రజలను 1 యోహాను 3:10-12 యింకే విధంగా గుర్తిస్తున్నది?
8 మరియు, 1 యోహాను 3:10-12 యిట్లంటున్నది: “దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింప వలెననునది మొదటినుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను.” ఆ విధంగా దేవుని ప్రజలు అహింసాపరులును, ప్రపంచవ్యాప్త సహోదర బృందమునైయున్నారు.
మరొక గుర్తింపు లక్షణం
9, 10. (ఎ) అంత్యదినాల్లో దేవుని సేవకులు ఏ పనిని బట్టి గుర్తించబడతారు? (బి) మత్తయి 24:14 ను యెహోవాసాక్షులు ఎలా నెరవేర్చారు?
9 దేవుని సేవకులను గుర్తించుటకు మరో పద్ధతున్నది. లోకాంతమును గూర్చిన తన ప్రవచనములో యేసు ఈ లోకాన్ని అంత్యదినాలని గుర్తించే అనేక సంగతులను పేర్కొన్నాడు. (ఈ బ్రోషర్ నందలి భాగం 9 చూడండి.) ఈ ప్రవచనము యొక్క ప్రాథమిక అంశము మత్తయి 24:14 నందున్న ఆయన మాటల్లో పేర్కొనబడింది: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటుతరువాత అంతము వచ్చును.”
10 ఆ ప్రవచనం నెరవేరుతున్నట్లు మనం గమనించామా? అవును. అంత్య దినాలు 1914 లో ప్రారంభమైననాటి నుండి, యెహోవాసాక్షులు దేవుని రాజ్యసువార్తను ప్రపంచమంతటా యేసు ఆజ్ఞాపించిన రీతిలో, అనగా ప్రజల యిండ్లకు వెళ్లి ప్రకటిస్తున్నారు. (మత్తయి 10:7, 12; అపొస్తలుల కార్యములు 20:20) నూతన లోకాన్ని గూర్చి ప్రతిదేశమందలి ప్రజలతో మాట్లాడేందుకు లక్షలాదిమంది సాక్షులు వారిని సందర్శిస్తున్నారు. యెహోవాసాక్షుల పనిలో దేవుని రాజ్యాన్ని గూర్చి తెల్పే కోట్లాది సాహిత్యములను ముద్రించి పంచిపెట్టుట యిమిడియున్నది కనుకనే నీవు బ్రోషర్‌ను పొందగల్గావు. ప్రపంచమంతటా దేవుని రాజ్యాన్ని యింటింట ప్రకటిస్తున్న వారెవరైనా నీకు తెలుసా? అంతం రాకముందు ఈ ప్రకటించు మరియు బోధించుపని “ముందుగా” జరగాలని మార్కు 13:10 చూపుతున్నది.
రెండో గొప్ప వివాదాంశానికి జవాబిచ్చుట
11. దేవుని పాలనకు లోబడుటద్వారా యెహోవాసాక్షులు మరింకేమి నెరవేర్చుదురు?
11 యెహోవాసాక్షులు దేవుని శాసనాలకు, నియమాలకు కట్టుబడి యుండుట మూలంగా మరొక దానిని నెరవేరుస్తున్నారు. మానవులు శ్రమసమయాల్లో దేవునికి నమ్మకముగా ఉండలేరని సాతాను పల్కిన దానినిబట్టి అతడు అబద్ధికుడని వారు నిరూపిస్తున్నారు. (యోబు 2:1-5) సకల దేశాలనుండి సమకూడిన సాక్షులు, లక్షలాదిగా ఉన్న ఈ సమాజం, ఒకే కూటమిగా దేవుని పాలనకు తమ యథార్థతను ప్రదర్శిస్తున్నారు. వారు అపరిపూర్ణులైన మానవులైనప్పటికిని, సాతాను వత్తిడి ఉన్నను, విశ్వసర్వాధిపత్యపు వివాదాంశమందు వారు దేవుని పక్షము వహిస్తున్నారు.
12. తమ విశ్వాసమునుబట్టి సాక్షులు ఎవరిని అనుకరిస్తారు?
12 నేడు ఈ లక్షలాదిమంది యెహోవాసాక్షులు, గతంలో దేవుని యెడల తమ యథార్థతను ప్రదర్శించిన అనేక యితర సాక్షులకు, తమ సాక్ష్యాలను జోడిస్తున్నారు. వారిలో పేర్కొనదగిన కొంతమందెవరనగా హేబెలు, నోవహు, యోబు, అబ్రాహాము, శారా, ఇస్సాకు, యాకోబు, దెబోరా, రూతు, దావీదు మరియు దానియేలు. (హెబ్రీయులు 11 వ అధ్యాయం) బైబిలు పేర్కొనునట్లుగా వారు ‘మేఘమువలె ఉన్న గొప్ప సాక్షి సమూహము.’ (హెబ్రీయులు 12:1) వీరును, యేసు ఆయన శిష్యులతో సహా మరి యితరులును దేవుని యెడల తమ యథార్థతను నిలుపుకున్నారు.
13. సాతానుగూర్చి యేసు పల్కిన ఏ మాటలు నిజమని నిరూపించబడ్డాయి?
13 యేసు, మతనాయకులతో సాతానును గూర్చి చెప్పినది నిజమని యిది నిరూపిస్తున్నది: “దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనై నన్ను మీరిప్పుడు చంపవెదకుచున్నారే . . . మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునపుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.”—యోహాను 8:40, 44.
నీ ఎంపిక ఏమిటి?
14. నూతనలోక పునాదికి యిప్పుడేమి సంభవిస్తున్నది?
14 ఇప్పుడు యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమాజం మధ్య దేవుడు సమకూర్చుతున్న నూతన లోక పునాది అంతకంతకు పటిష్టమౌతున్నది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది దేవుని పాలనను అంగీకరించుటకు కచ్చితమైన జ్ఞానముపై ఆధారపడిన తమ స్వేచ్ఛాచిత్తము నుపయోగిస్తున్నారు. వారు నూతన లోకసమాజంలో భాగమై, విశ్వసర్వాధిపత్య వివాదములో దేవుని పక్షము వహించి, సాతానును అబద్ధికుడని నిరూపిస్తున్నారు.
15. మనకాలంలో యేసు వేరుచేసే ఏ పనిని చేపట్టుచున్నాడు?
15 వారు దేవుని పాలనను ఎంచుకున్నందున, క్రీస్తు “గొఱ్ఱెలను” “మేకలను” వేరుచేస్తుండగా వారు ఆయన “కుడివైపున” ఉంచబడుటకు అర్హులౌతున్నారు. అంత్యదినములను గూర్చిన తన ప్రవచనములో యేసు యిలా తెల్పాడు: “సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.” గొఱ్ఱెలు దేవుని పాలనకు లోబడి క్రీస్తు సహోదరులతో సహవసించి మద్దతునిచ్చే వినయముగల ప్రజలు. మేకలు, గర్విష్టులైనె ప్రజలై యుండి, దేవుని పాలనకు ఏమాత్రం లోబడనొల్లక క్రీస్తు సహోదరులను తృణీకరిస్తున్నారు. వీరికి లభించే ఫలితమేమి? యేసు యిలా అన్నాడు: “వీరు [మేకలు] నిత్యశిక్షకును నీతిమంతులు [గొఱ్ఱెలు] నిత్యజీవమునకును పోవుదురు.”—మత్తయి 25:31-46.
16. రానున్న పరదైసులో నీవును జీవించగోరితే నీవేమి చేయాలి?
16 నిజంగా, దేవుడు మనపై శ్రద్ధకల్గియున్నాడు. త్వరలో ఆయన ఉల్లాసవంతమగు భూపరదైసును మన కనుగ్రహిస్తాడు. ఆ పరదైసులో నీవు జీవించగోరుదువా? అట్లయితే, యెహోవాను గూర్చి నేర్చుకొని, నేర్చుకున్నదాని ప్రకారం ప్రవర్తించి, ఆయన ఏర్పాట్లయెడల నీ మెప్పుదలను ప్రదర్శించుము. “యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను; వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారియందు జాలిపడును.”—యెషయా 55:6, 7.
17. ఎవరిని సేవించాలో అన్నవిషయమై ఎంపిక చేసుకొనడానికి సమయం ఎందుకు వృధాచేయకూడదు?
17 వృధాచేయడానికి సమయం లేదు. ఈపాత విధానాంతం అతిసమీపంగా ఉంది. దేవుని వాక్యము ఇలా హెచ్చరిస్తున్నది. “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమవానిలో నుండదు . . . లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:15-17.
18. దేవుని అద్భుత నూతన లోకములో జీవించుటకు దృఢనమ్మకముగా ఎదురుచూచేందుకు ఎట్టి ప్రవర్తన నీకు దోహదము చేయును?
18 నూతన లోకంలో నిత్యజీవము కొరకు దేవుని ప్రజలిప్పుడు తర్ఫీదు పొందుతున్నారు. పరదైసును విస్తరింపజేయుటకు అవసరమయ్యే ఆత్మీయ, మరితర నైపుణ్యాలను వారు నేర్చుకొంటున్నారు. నీవును దేవున్ని పాలకునిగా ఎన్నుకొని, నేడు ఆయన భూవ్యాప్తంగా చేయిస్తున్న జీవమును కాపాడు పనికి మద్దత్తునిమ్మని మేము నిన్ను ప్రోత్సహిస్తున్నాము. యెహోవాసాక్షులతో బైబిలును పఠించి, నిన్నుగూర్చి నిజంగా శ్రద్ధవహిస్తున్న, బాధను అంతమొనర్చగల దేవుని గూర్చి తెలుసుకొనుము. ఈ విధంగా నీవును నూతనలోక పునాదిలో భాగమై యుండగలవు. అప్పుడు నీవును దేవుని అనుగ్రహాన్ని పొంది, అట్టి అద్భుత నూతన లోకమందు నిరంతరం జీవించేందుకు దృఢనమ్మకముతో ఎదురు చూడగలవు.
[31 వ పేజీలోని చిత్రం]
ఒక నిజమైన అంతర్జాతీయ సహోదర బృందాన్ని యెహోవాసాక్షులు కల్గియున్నారు
[32 వ పేజీలోని చిత్రం]
దేవుని నూతన లోక పునాది యిప్పుడు రూపుదిద్దుకొంటోంది