కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • dg భాగం 4 పేజీలు 9-10
  • దేవుడు తన సంకల్పాలను గూర్చి మనకు తెలియజేస్తున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు తన సంకల్పాలను గూర్చి మనకు తెలియజేస్తున్నాడు
  • దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమాధానము లెచ్చట ఉన్నాయి?
  • దేవుని బహుమానము
  • ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • బైబిలు అనుపమానమైన గ్రంథం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
dg భాగం 4 పేజీలు 9-10

భాగం 4

దేవుడు తన సంకల్పాలను గూర్చి మనకు తెలియజేస్తున్నాడు

1, 2. యథార్థంగా ప్రశ్నించేవారికి దేవుడు సమాధానమిస్తాడని మనకెలా తెలుసు?

ప్రేమగల దేవుడు తన్ను వెదకు యథార్థపరులకు తన సంకల్పాలను గూర్చి నిశ్చయంగా తెలియజేయును. తాను బాధ నెందుకు అనుమతిస్తున్నాడు అనే ప్రశ్నలను విచారించి తెలుసుకొనగోరు మానవులకు ఆయన సమాధానములను పొందుపర్చును.

2 బైబిలు యిట్లంటున్నది: “నీవు ఆయనను [దేవుని] వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.” “మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు.” “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా ఏమియు చేయడు.”—1 దినవృత్తాంతములు 28:9; దానియేలు 2:28; ఆమోసు 3:7.

సమాధానము లెచ్చట ఉన్నాయి?

3. దేవుడు బాధనెందుకు అనుమతిస్తున్నాడనే దానిని మనమెచ్చట కనుగొనగలము?

3 దేవుడు బాధనెందుకు అనుమతించెను, దానివిషయమై తానేమిచేయును అనే ప్రశ్నలకు సమాధానములను మనప్రయోజనార్థము ఆయన ప్రేరేపింపజేసిన నివేదికయందు లభ్యమగును. ఆ నివేదిక, ఆయన వాక్యమైన పరిశుద్ధ బైబిలు. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.”—2 తిమోతి 3:16, 17.

4, 5. ఏది బైబిలును సాటిలేని పుస్తకంగా చేసింది?

4 బైబిలు నిజంగా సాటిలేని పుస్తకం. మానవుని చరిత్రను గూర్చి, మానవుని సృష్టికంటె ముందు జరిగిన వాటిని గూర్చి కూడ కచ్చితమైన నివేదికనది కల్గియున్నది. అందలి ప్రవచనాలు మన కాలమునకు, సమీప భవిష్యత్తునకు సంబంధించినవై యున్నందున అది తాజా వర్తమానాన్నికూడ కల్గియున్నది.

5 చారిత్రక కచ్చితం నిమిత్తం మరి ఏయితర పుస్తకానికి అంతటి ప్రామాణికములు లేవు. దృష్టాంతమునకు, ప్రాచీన సాంప్రదాయిక రచయితల వ్రాతప్రతులలో కొన్నిమాత్రమే ఉన్నాయి. అయితే అనేక బైబిలు చేతివ్రాతప్రతులు కొన్ని పాక్షికంగాను, కొన్ని పూర్తిగాను లభ్యమగుచున్నవి. వాటిలో హెబ్రీ లేఖనములు (“పాత నిబంధన” నందలి 39 పుస్తకాలు) ఇంచుమించు 6,000 ప్రతులు, క్రైస్తవ గ్రీకు లేఖనములలో (“క్రొత్త నింబంధన” నందు 27 పుస్తకాలు) ఇంచుమించు 13,000 ప్రతులు ఉన్నాయి.

6. దేవుడు బైబిలును ప్రేరేపించినప్పటివలెనే ఇప్పుడును అది ఆలాగే ఉన్నదని మనమెందుకు నిశ్చయత కల్గి వుండగలము?

6 బైబిలును వ్రాయుటకు ప్రేరేపించిన సర్వోన్నత దేవుడు, ఆ చేతివ్రాత ప్రతులందలి గ్రంథ సారాంశం యథాతథంగా ఉండెటట్లు చేశాడు. కావున ఆదిమ ప్రేరేపిత వ్రాతలవలె నేడు మన బైబిళ్లు కూడ యథాతథంగా ఉన్నాయి. దీనిని అభినందించుటకు మనకు దోహదపడే మరో విషయమేమంటే క్రైస్తవ గ్రీకు లేఖనములలో కొన్ని చేవ్రాత ప్రతులు తొలుత అవి వ్రాయబడిన కాలానికి ఒక వంద సంవత్సరాల లోపువే. నేటికి ఉనికిలోనున్న కొన్ని ప్రాచీనకాల యితర రచయితల చేతివ్రాతప్రతులు, అసలు వాటిని వ్రాసిన వారి కాలానికి అనేక శతాబ్దాల తర్వాతి నాటివే.

దేవుని బహుమానము

7. బైబిలు ఎంత విస్తృతంగా పంచబడింది?

7 చరిత్రలో బహు విస్తారముగా పంచబడిన పుస్తకము బైబిలు. ఇంచుమించు మూడు వందల కోట్ల ప్రతులు ముద్రించబడ్డాయి. మరి ఏ యితర పుస్తకము ఆ సంఖ్యకు చేరువగాలేదు. బైబిలు లేదా అందలి భాగాలు దాదాపు 2,000 భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి. ఆ విధంగా, మన గ్రహమందలి 98 శాతం జనాబాకు బైబిలు అందుబాటులో ఉన్నట్లుగా అంచనా వేయబడింది.

8-10. బైబిలు మన పరిశీలనకు యోగ్యమైనదనుటకు కొన్ని కారణాలేమిటి?

8 నిజమే, దేవునినుండి కల్గిందని చెప్పుకునేది, సత్యసంధతకు బాహ్య, అంతర్గత సాక్ష్యాలున్న గ్రంథము మన పరిశీలనకు యోగ్యమైనదే.a జీవిత సంకల్పాన్ని, ప్రపంచపరిస్థితుల భావాన్ని, భవిష్యత్తు ఏమి కల్గియున్నదోననే విషయాలనది వివరిస్తుంది. మరేయితర పుస్తకమూ అలా చేయలేదు.

9 అవును మానవ కుటుంబముతో దేవుడు చేసే సంభాషణే బైబిలు. తనచురుకైన శక్తి లేదా ఆత్మద్వారా దాదాపు 40 మంది మానవుల చేత ఆయన దానిని వ్రాయించాడు. ఆ ప్రకారంగా దేవుడు తన వాక్యమైన పరిశుద్ధ బైబిలు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి.”—1 థెస్సలొనీకయులు 2:13.

10 బైబిలు “దేవుడు మానవునికిచ్చిన అతిశ్రేష్ఠమైన బహుమానం . . . అదే లేకపోతే మంచి, చెడులు మనకు తెలియక పొవును,” అని అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ అన్నాడు. మరైతే, బాధ ఎలా ప్రారంభమైంది, దేవుడు దానినెందుకు అనుమతించాడు, దాని విషయమై ఆయన ఏమిచేస్తాడు అనే వాటిని గూర్చి ఈ అపూర్వమైన బహుమానం మనకేమి తెల్పుతుంది?

[అధస్సూచీలు]

a బైబిలు సత్యసంధతను గూర్చిన మరింత వివరణాత్మక సమాచారము కొరకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌ వారిచే 1989 లో ప్రచురించబడిన ది బైబిల్‌ గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌? అను పుస్తకాన్ని చూడండి.

[10 వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రేరేపిత గ్రంథమగు బైబిలు, మానవ కుటుంబముతో ఆయన చేసే సంభాషణే

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి