కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • uw అధ్యా. 22 పేజీలు 169-175
  • ఎడతెగక దేవుని వాక్యాన్ని గూర్చి ధైర్యంగా మాట్లాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎడతెగక దేవుని వాక్యాన్ని గూర్చి ధైర్యంగా మాట్లాడండి
  • అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన స్వంత బలంమీద ఆధారపడకుండుట
  • ధైర్యంగాచేసిన సాక్ష్యపుపనిని గూర్చిన చరిత్ర
  • దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • యేసులా ధైర్యంగా ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ‘మీరు నాకు సాక్షులుగా ఉంటారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • “భూమంతటా” సాక్ష్యం ఇవ్వడం
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
uw అధ్యా. 22 పేజీలు 169-175

అధ్యాయం 22

ఎడతెగక దేవుని వాక్యాన్ని గూర్చి ధైర్యంగా మాట్లాడండి

1. (ఎ) సా.శ. 33 పెంతెకొస్తు మొదలుకొని యేసు శిష్యులు ఏ సువార్తను ప్రకటించారు, అయితే పరిపాలకుల, యూదుల పెద్దల ప్రతిస్పందన ఏమైయుండెను? (బి) దీనిని గూర్చి మనకై మనమే ఏ ప్రశ్నలు వేసికోవచ్చు?

మానవ చరిత్రయందలి 4,000 పైగా సంవత్సరాల్లో అతి ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి. దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు ఈ యావత్‌ భూమికి భవిష్యత్‌ రాజుగా అభిషేకించబడ్డాడు. మతనాయకుల తప్పుడు నడిపింపువల్ల యేసు హత్యచేయబడిననూ, యెహోవా తన కుమారున్ని మృతుల్లోనుండి లేపాడు. నిత్యజీవపు దృష్టితో ఆయన ద్వారా ఇప్పుడు రక్షణ సాధ్యము. అయితే యేసు నమ్మకమైన శిష్యులు బహిరంగముగా ఈ సువార్త ప్రకటించినప్పుడు, తీవ్ర హింస చెలరేగింది. మొదట, ఇద్దరు అపొస్తలులు ఆ తర్వాత అందరూ చెరలో వేయబడ్డారు. వారిని కొరడాలతో కొట్టి, యేసు నామమున ప్రకటింపవద్దని ఆజ్ఞాపించారు. (అపొ. 4:1-3, 17; 5:17, 18, 40) వారేమి చెయ్యాలి? మీరేమి చేసియుండేవారు? సాక్ష్యమిచ్చుటలో మీరు ధైర్యంగా కొనసాగేవారా?

2. (ఎ) మన కాలమందు మరింత ఆశ్చర్యకరమైన ఏ వార్త ప్రకటింపబడాలి? (బి) దానినిచేసే బాధ్యతను ఎవరు కలిగియున్నారు?

2 విశ్వ ప్రాముఖ్యతగల మరింత ఆశ్చర్యకరమైన మరో సంఘటన సా.శ. 1914 లో జరిగింది. యేసుక్రీస్తు అధికారము క్రిందగల దేవుని రాజ్యం పరలోకమందు స్థాపించబడింది. ఆ తర్వాత, సాతాను అతని దయ్యాలు ఈ భూమిపైకి పడద్రోయబడ్డారు. (ప్రక. 12:1-5, 7-12) ఈ ప్రస్తుత దుష్టవిధానపు అంత్యదినాలు ఆరంభమయ్యాయి. సాతానుయొక్క యావత్‌ విధానాన్ని దేవుడు త్వరలో తుత్తినియలుగా చేస్తాడు. (ప్రక. 12:12) రక్షింపబడినవారు తమయెదుట నిత్యజీవ ఉత్తరాపేక్షను కలిగివుంటారు. దేవుని ఆది సంకల్ప నెరవేర్పునందు, ఈ భూమంతయు పరదైసుగా మార్చబడుతుంది. మీరిప్పటికే ఈ సువార్తను హత్తుకొనియుంటే, దానిని ఇతరులతో పంచుకొనే బాధ్యతను మీరు కలిగివున్నారు. (మత్త. 24:14) అయితే ఎట్టి స్పందనను మీరపేక్షించవచ్చు?

3. (ఎ) రాజ్య వర్తమానానికి ప్రజలెలా ప్రతిస్పందిస్తారు? (బి) కాబట్టి, మనమే ప్రశ్నను ఎదుర్కోవాలి?

3 రాజ్య ప్రచారకులుగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించినా, అనేకమంది అందుకు భిన్నంగా ఉంటారు. (మత్త. 24:37-39) మరితరులు అపహసించవచ్చు లేదా తీవ్రంగా మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. మీ స్వంత బంధువుల నుండే కొంత వ్యతిరేకత రావచ్చని యేసు హెచ్చరించాడు. (లూకా 21:16-19) మీరు పనిచేసే స్థలంలో లేదా పాఠశాలలో అది మీకు ఎదురుకావచ్చు. ప్రపంచంలో అనేక ప్రాంతాలందు యెహోవాసాక్షులు అన్యాయంగా ప్రభుత్వ నిషేధం క్రింద సహితం ఉన్నారు. వీటిలో ఏదైనా లేదా అన్ని పరిస్థితుల్నీ ఎదుర్కొన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?

4. మనం దేవున్ని నమ్మకంగా సేవించుటలో కొనసాగుతామని వ్యక్తిగత తీర్మానం హామినిస్తుందా?

4 నిస్సందేహంగా, మీరు ధైర్యవంతులైన దేవుని సేవకుల్లా ఉండాలని ఇచ్ఛయిస్తారు. అయిననూ, తమనేదియు అడ్డగించలేదని భావించిన కొందరు రాజ్య ప్రచారకులుగా ఉండలేకపోయారు. దీనికి భిన్నంగా, సహజంగా కొంత పిరికితనంగల వ్యక్తులతోసహా, మరితరులు ఆసక్తిగల దేవుని సేవకులుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నారు. “విశ్వాసమందు నిలకడగా” ఉండేవారని మీరెలా నిరూపించుకొనగలరు?—1 కొరిం. 16:13.

మన స్వంత బలంమీద ఆధారపడకుండుట

5. (ఎ) దేవుని నమ్మకమైన సేవకులుగా మనల్ని నిరూపించుకోవాలంటే, దానికున్న ప్రాథమిక అవసరత ఏమిటి? (బి) కూటములు ఎందుకంత ప్రాముఖ్యం?

5 దేవుని నమ్మకమైన సేవకులుగా ఉండుటలో అనేక సంగతులు ఇమిడివున్నాయి. అయితే వీటన్నిటికి ప్రాథమికంగా యెహోవామీద, ఆయనచేసిన ఏర్పాట్లమీద ఆధారపడాలి. అలా ఆధారపడటాన్ని మనమెలా చూపగలము? సంఘకూటాలకు హాజరుకావడం అందులో ఒకటి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. (హెబ్రీ. 10:23-25) ప్రజలు నిర్లిప్తత లేదా హింసవున్ననూ యెహోవాకు నమ్మకమైన సాక్షులుగా కొనసాగినవారు, తోటి ఆరాధికులతో క్రమంగా కూటాలకు హాజరుకావడానికెంతో పోరాడారు. ఈ కూటాల్లో లేఖనాలను గూర్చిన జ్ఞానం పెరుగుతుంది, అయితే కేవలం క్రొత్త సంగతులు నేర్చుకుంటామనే ఆసక్తి మనల్నిలా సమకూర్చడం లేదు. (అపొస్తలుల కార్యములు 17:21 పోల్చండి.) మనకు బాగా తెలిసిన సత్యాలయెడల మనమెప్పు పెరుగుతుంది, మనముపయోగించగల మార్గాల ఎడల మన జాగ్రత్త పదునౌతుంది. యేసు మనకొరకు ఉంచిన మాదిరి మన హృదయాలపై, మనస్సులపై బలమైన ముద్రవేస్తుంది. (ఎఫె. 4:20-24) ఐక్య ఆరాధనలో మన క్రైస్తవ సహోదరులకు మనం దగ్గరౌతాం, ఎడతెగక దేవుని చిత్తం చేయడంలో వ్యక్తిగతంగా బలం పొందుతాం. సంఘంద్వారా యెహోవా ఆత్మ నడిపింపునిస్తుండగా, ఆయన నామంపేరిట మనం కూడినప్పుడు ఆ ఆత్మ మూలంగా యేసు మన మధ్య ఉంటాడు.—ప్రక. 3:6; మత్త. 18:20.

6. యెహోవాసాక్షులు నిషేధింపబడినచోట, కూటముల విషయంలో ఏమి జరిగింపబడుతుంది?

6 క్రమంగా కూటాలకు హాజరగుతూ, ఇక్కడ మీరు వినే చర్చాంశాలను వ్యక్తిగతంగా అన్వయిస్తారా? నిషేధం క్రింద ఉన్నప్పుడు కొన్నిసార్లు కూటాల్ని చిన్న గుంపులుగా, ఇళ్లలో నిర్వహించాల్సి ఉంటుంది. స్థలాలు, వేళలు మారుతూ కొన్ని కూటాలు రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత నిర్వహింపబడుతూ, అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే, వ్యక్తిగత అననుకూలత లేదా ప్రమాదమున్నా నమ్మకస్థులైన సహోదర సహోదరీలు ప్రతి కూటానికి హాజరుకావడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు.

7. (ఎ) యెహోవామీద మనం ఆధారపడ్డామని మనమింకే విధంగా ప్రదర్శిస్తాము? (బి) ఎడతెగక ధైర్యంగా మాట్లాడుటకు మనకిదెలా సహాయం చేస్తుంది?

7 రివాజుగాకాక దేవుని సహాయం మనకవసరమనే హృదయపూర్వక గ్రహింపుతో క్రమంగా యెహోవాకు ప్రార్థనచేయుట కూడ ఆయనపై ఆధారపడటాన్ని చూపిస్తుంది. మీరలా చేస్తున్నారా? తన భూపరిచర్యలో యేసు పదేపదే ప్రార్థించాడు. (లూకా 3:21; 6:12, 13; 9:18, 28; 11:1; 22:39-44) మరియు తను వ్రేలాడదీయబడటానికి ముందు రాత్రి ఆయన తన శిష్యులనిలా వేడుకున్నాడు: “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థనచేయుడి.” (మార్కు 14:38) రాజ్య వర్తమానానికి ఎక్కువ వ్యతిరేకత ఎదురైనప్పుడు, మన పరిచర్యలో వెనక్కితగ్గే శోధన కలుగవచ్చు. ప్రజలు ఎగతాళి చేసినప్పుడు లేదా మరి తీవ్రమైన హింస కలిగినప్పుడు దానిని తప్పించుకోవడానికి మనం మాట్లాడకుండా ఉందామనే శోధన మనకు రావచ్చు. అయితే ఎడతెగక ధైర్యంగా మాట్లాడేందుకు దేవుని ఆత్మ సహాయం కొరకు చిత్తశుద్ధితో ప్రార్థిస్తే, ఆ శోధనలో పడిపోకుండా మనం కాపాడబడతాము.—లూకా 11:13; ఎఫె. 6:18-20.

ధైర్యంగాచేసిన సాక్ష్యపుపనిని గూర్చిన చరిత్ర

8. (ఎ) అపొస్తలుల కార్యాల్లో వ్రాయబడిన చరిత్ర మనకెందుకు ప్రత్యేకంగా శ్రద్ధకల్గించేదైయుంది? (బి) అందలి సమాచారం మనకెలా ప్రయోజనకరమో నొక్కి చెబుతూ, ఈ పేరా చివర ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

8 అపొస్తలుల కార్యముల పుస్తకమందున్న చరిత్ర మనందరికి ప్రత్యేకంగా శ్రద్ధకల్గించేదై ఉంది. మనవంటి భావాలేగల ప్రజలగు అపొస్తలులు, ఇతర తొలి శిష్యులు ఎలా అడ్డంకుల్ని అధిగమించి, యెహోవా నమ్మకమైన, ధైర్యంగల సాక్షులుగా నిరూపించుకున్నారో అది మనకు తెలియజేస్తుంది. ఈ క్రింది ప్రశ్నలు, ఇవ్వబడిన లేఖనాల సహాయంతో ఆ చరిత్రలో కొంతభాగాన్ని మనం పరిశీలిద్దాం. మనమలా చేస్తుండగా, మీరు చదివేదానినుండి వ్యక్తిగతంగా మీరెలా ప్రయోజనం పొందగలరో ఆలోచించండి.

అపొస్తలులు విద్యాధికులా? దేనినైనా ఎదుర్కోగల సహజ ధైర్యస్థులా ఆ వ్యక్తులు? (అపొ. 4:13; యోహా. 18:17, 25-27; 20:19)

ఎన్నోవారాలు కాకముందే దేవుని స్వంత కుమారున్నే ఖండించిన యూదుల న్యాయసభ ఎదుట ధైర్యంగా మాట్లాడటానికి పేతురును ఏది బలపర్చింది? (అపొ. 4:8; మత్త. 10:19, 20)

యూదుల మహాసభ ఎదుటకు తేబడక ముందున్న వారాల్లో అపొస్తలులు ఏమిచేశారు? (అపొ. 1:14; 2:1, 42)

యేసు నామమున ప్రకటింపవద్దని పాలకులు ఆజ్ఞాపించినప్పుడు, పేతురు యోహానులు ఏమని జవాబిచ్చారు? (అపొ. 4:19, 20)

విడుదలైన తర్వాత, వారు మరలా ఎవరి సహాయం కొరకు చూశారు? తమకు కలిగే హింసను ఆపుజేయమని అడిగారా లేక వారు దేనికొరకు ప్రార్థించారు? (అపొ. 4:24-31)

వ్యతిరేకులు ప్రకటించే పనిని ఆపుజేయడానికి ప్రయత్నించినప్పుడు యెహోవా దేని మూలముగా సహాయం అందించాడు? (అపొ. 5:17-20, 33-40)

తమ విడుదల కారణాన్ని తామర్థం చేసుకున్నామని అపొస్తలులెలా చూపించారు? (అపొ. 5:21, 41, 42)

హింస తీవ్రతనుబట్టి అనేకమంది శిష్యులు చెదిరిపోయిననూ, వారేమి చేయడం మానుకోలేదు? (అపొ. 8:3, 4; 11:19-21)

9. (ఎ) ఆ తొలి శిష్యుల పరిచర్యద్వారా పులకరింపజేయు ఎట్టి ఫలితాలొచ్చాయి? (బి) మనమెలా అందులో చేర్చబడ్డాము?

9 సువార్త సంబంధముగా వారుచేసిన సేవ వ్యర్థంకాలేదు. సా.శ. 33 పెంతెకొస్తునాడు దాదాపు 3,000 మంది శిష్యులు బాప్తిస్మం పొందారు. “పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.” (అపొ. 2:41; 4:4; 5:14) తీవ్రంగా హింసించిన వారిలో ఒకడైన తార్సువాడగు సౌలు కూడ యుక్తకాలంలో క్రైస్తవుడై సత్యవిషయమై బహుధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. ఆయనే అపొస్తలుడైన పౌలుగా తెలియబడ్డాడు. (గల. 1:22-24) మొదటి శతాబ్దంలో ఆరంభమైన ఆ సేవ ఆగిపోలేదు. అది ఈ “అంత్యదినములలో” మంచి ఊపందుకొని ప్రపంచమందలి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దానిలో భాగం వహించే ఆధిక్యత మనకున్నది, మనమలా చేస్తుండగా మనకు ముందు యథార్థసాక్షులుగా సేవచేసినవారి మాదిరినుండి మనమెంతో నేర్చుకోగలము.

10. (ఎ) సాక్ష్యమివ్వడానికి పౌలు ఎట్టి అవకాశాల్ని ఉపయోగించుకున్నాడు? (బి) ఏయే విధాలుగా రాజ్యవర్తమానాన్ని మీరితరులకు అందజేస్తారు?

10 యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని నేర్చుకున్న పిదప పౌలు ఏమాత్రం తాత్సారం చేయలేదు. “వెంటనే . . . యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచువచ్చెను.” (అపొ. 9:20) దేవుని కృపను ఆయన అభినందించి, తనకు లభించిన సువార్త ప్రతివారికి అవసరమని గ్రహించాడు. తను యూదుడు గనుక, సాక్ష్యమిచ్చేందుకు ఆ కాలమందలి వాడుకచొప్పున ఆయన యూదులందరు కూడుకొనే సమాజమందిరాలకు వెళ్లాడు. ఆయన ఇంటింట ప్రకటించుటే కాకుండ, వ్యాపార స్థలాల్లో ప్రజలతో తర్కించాడు. సువార్త ప్రకటించడానికి ఆయన క్రొత్త ప్రాంతాలకు తరలివెళ్లడానికి కూడ ఇష్టపడ్డాడు.—అపొ. 17:17; 20:20; రోమా. 15:23, 24.

11. (ఎ) ధైర్యంగావున్నా, సాక్ష్యమిచ్చేటప్పుడు తాను వివేకాన్ని ప్రదర్శించానని పౌలు ఎలా చూపాడు? (బి) బంధువులకు, తోటి ఉద్యోగస్థులకు, తోటి విద్యార్థులకు సాక్ష్యమిచ్చేటప్పుడు మనమెలా ఆ లక్షణాన్ని ప్రతిబింబించవచ్చు?

11 పౌలు ధైర్యస్థుడే కాదు వివేకికూడ, మనమూ అలాగే ఉండాలి. వారి పితరులకు దేవుడుచేసిన వాగ్దానాల ఆధారంగా ఆయన యూదులను వేడుకున్నాడు. ఆలాగే ఆయన గ్రీసు దేశస్థులకు పరిచయమున్న సంగతుల ఆధారంగా వారితో మాట్లాడాడు. సాక్ష్యమిచ్చేందుకు వాహనంగా ఆయన కొన్నిసార్లు తనెలా సత్యం నేర్చుకున్నాడో ఆ స్వంత అనుభవాన్నే ఉపయోగించాడు. ఆయనే వివరించినట్లుగా, “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.”—1 కొరిం. 9:20-23; అపొ. 22:3-21.

12. (ఎ) ధైర్యంగావున్నా, వ్యతిరేకుల్ని పదేపదే ఎదుర్కొనేటట్టుచేసే పరిస్థితుల్ని తప్పించుకోవడానికి పౌలు ఏమిచేశాడు? (బి) ఎప్పుడు మనం ఆ మాదిరిని జ్ఞానయుక్తంగా అనుకరించవచ్చు? (సి) ఎడతెగక ధైర్యంగా మాట్లాడే శక్తి ఎక్కడనుండి వచ్చింది?

12 సువార్తకు కలిగిన వ్యతిరేకత మరోచోట ప్రకటించడం లేదా కొంతకాలం కొరకు మరో ప్రాంతానికి కదలివెళ్లడం మంచిదనేటట్లు చేసినప్పుడు, సత్యానికి శత్రువులైన వారిని పదేపదే ఎదుర్కోవడానికి బదులు పౌలు ఆలాగే కదలివెళ్లాడు. (అపొ. 14:5-7; 18:5-7; రోమా. 12:18) అయితే పౌలు ఏనాడూ సువార్త విషయమై సిగ్గుపడలేదు. (రోమా. 1:16) వ్యతిరేకుల అసహ్య చర్యలు అవమానకరంగా, దౌర్జన్యకరంగా ఉండి తనకు అప్రీతికరంగా ఉన్నట్లు పౌలు కనుగొన్ననూ, ఎడతెగక ప్రకటించడానికి ఆయన “మన దేవునియందు ధైర్యము” తెచ్చుకొన్నాడు. బహు క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకొన్నా ఆయనిలా చెప్పాడు: “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము . . . ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను.” (1 థెస్స. 2:2; 2 తిమో. 4:17) క్రైస్తవ సంఘ శిరస్సయిన యేసుక్రీస్తు మనకాలం కొరకు తాను ప్రవచించిన సేవకు కావలసిన శక్తిని ఎడతెగక దయచేస్తున్నాడు.—మార్కు 13:10.

13. క్రైస్తవ ధైర్యాన్ని ఏది రుజువుచేస్తుంది, దానికి ఆధారమేమిటి?

13 యేసుక్రీస్తు, మొదటి శతాబ్దమందలి దేవుని ఇతర నమ్మకమైన సేవకులవలెనే నిర్విరామంగా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే ప్రతి కారణం మనకుంది. అంటే మన వ్యవహారమందు కఠినంగా లేదా కష్టపెట్టేవారిగా ఉండాలని దానర్థం కాదు. నిర్దయగా లేదా ఆ వర్తమానం అవసరంలేని వారిని ఒత్తిడిచేయాల్సిన పనిలేదు. అయితే ప్రజలు భిన్నంగా ఉన్నారని మనం సేవను మానుకోము లేక వ్యతిరేకతనుబట్టి భయపడి మౌనంగా ఉండము. యేసు చేసినట్లే, ఈ యావత్‌ భూమికి దేవుని రాజ్యమే సరియైన ప్రభుత్వమని సూచిస్తాము. విశ్వ సర్వాధిపతియగు యెహోవాకు ప్రాతినిధ్య వహిస్తున్నందున, మనం ప్రకటించే వర్తమానం మననుండి కాదుగాని ఆయననుండే కలిగినందున మనం ధైర్యంగా మాట్లాడతాం.—ఫిలి. 1:27, 28; 1 థెస్స. 2:13.

పునఃసమీక్షా చర్చ

• సాధ్యమైతే ప్రతివారితో రాజ్యవర్తమానం పంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? అయితే ఎట్టి ప్రతిస్పందనల్ని మనమపేక్షించాలి?

• యెహోవాను సేవించడానికి మన స్వంత శక్తిపై ఆధారపడుటకు ప్రయత్నించుట లేదని మనమెలా చూపగలం?

• అపొస్తలుల కార్యముల పుస్తకమునుండి మనమెట్టి విలువగల పాఠాల్ని నేర్చుకుంటాం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి