కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 3 పేజీలు 10-11
  • వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయండి
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్య
  • బైబిలు సలహా
  • వేరే వర్గాల ప్రజలతో స్నేహం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
  • మీరేం చేయవచ్చు?
  • వాళ్లు వివక్ష అనే అడ్డుగోడను కూల్చేశారు
    తేజరిల్లు!—2020
  • ప్రేమ చూపించండి
    తేజరిల్లు!—2020
  • నేను ఎక్కువమంది స్నేహితుల్ని చేసుకోవాలా?
    యువత అడిగే ప్రశ్నలు
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 3 పేజీలు 10-11
తమ పిల్లలు గ్రౌండ్‌లో ఆడుకుంటుంటే వేర్వేరు జాతులకు చెందిన నలుగురు స్త్రీలు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు.

వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయండి

సమస్య

మనకు ఎవరి మీదైతే చెడు అభిప్రాయం ఉందో, ఆ ప్రజలతో కలవకుండా దూరంగా ఉంటే మనలో వివక్ష మరింత పెరగవచ్చు. అంతేకాదు మనలాంటి వాళ్లతోనే స్నేహం చేస్తే మనం ఆలోచించే, భావించే, ప్రవర్తించే విధానమే సరైనదని అనుకునే ప్రమాదం ఉంది.

బైబిలు సలహా

“మీ హృదయాల్ని విశాలం చేసుకోండి.”—2 కొరింథీయులు 6:13.

అంటే . . . ‘హృదయం’ అనే పదం మన భావాల్ని, భావోద్వేగాల్ని సూచించవచ్చు. మనలాంటి ప్రజల్నే ఇష్టపడితే, మన హృదయం ఇరుగ్గా తయారై మూసుకుపోవచ్చు. అలా అవ్వకూడదంటే, వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడాలి.

వేరే వర్గాల ప్రజలతో స్నేహం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

మనం వేరే వర్గాల ప్రజలతో స్నేహం చేసినప్పుడు, వాళ్లు కొన్ని పనుల్ని ఎందుకు భిన్నంగా చేస్తారో అర్థంచేసుకుంటాం. వాళ్లతో స్నేహం బలపడే కొద్దీ వాళ్లూ మనలాంటి వాళ్లే అని గుర్తిస్తాం. వాళ్లను మరింత విలువైన వాళ్లుగా చూస్తాం; వాళ్ల సంతోషాన్ని మన సంతోషంలా, వాళ్ల బాధను మన బాధలా భావిస్తాం.

నజరీ ఉదాహరణ పరిశీలించండి. ఒకప్పుడు ఆమె వలసవచ్చిన వాళ్ల మీద వివక్ష చూపించేది. ఆ వివక్షను ఎలా తీసేసుకుందో ఆమె చెప్తోంది: “నేను వాళ్లతో సమయం గడిపాను, వాళ్లతో కలిసి పనిచేశాను. అప్పుడు వాళ్ల గురించి మిగతా ప్రజలు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని నాకు అర్థమైంది. మీరు వేరే సంస్కృతికి చెందిన వాళ్లతో స్నేహం చేసినప్పుడు, వాళ్లు అచ్చం మీలానే ఉండాలని కోరుకునే బదులు వాళ్లను వాళ్లలానే చూడడం, ప్రేమించడం మొదలుపెడతారు.”

జాగ్రత్త

కొందరి జీవన విధానం, అలవాట్లు వాళ్లకు అలాగే ఇతరులకు హానిచేసేలా ఉంటాయి. అందుకే స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నీతి, నిజాయితీ, నైతిక విలువలు లేని వాళ్లకు దూరంగా ఉండడం వివక్ష అవ్వదు. మన విలువల్ని పాడుచేసే వాళ్లతో స్నేహం చేయకుండా జాగ్రత్తపడాలి కానీ వాళ్లకు హాని చేయకూడదు, వాళ్ల హక్కుల్ని కాలరాయకూడదు.—సామెతలు 13:20.

మీరేం చేయవచ్చు?

వేరే దేశం, జాతి, లేదా భాషకు చెందిన ప్రజలతో మాట్లాడే అవకాశాల కోసం చూడండి. బహుశా మీరు . . .

  • వాళ్ల గురించి ఏదైనా చెప్పమని అడగవచ్చు.

  • వాళ్లను భోజనానికి పిలవవచ్చు.

  • వాళ్ల అనుభవాలు విని, వాళ్లకు ఏవి ప్రాముఖ్యమో తెలుసుకోవచ్చు.

వాళ్ల అనుభవాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ వర్గానికి చెందిన ప్రజల మీద మీకు మంచి అభిప్రాయం ఏర్పడవచ్చు.

నిజ జీవిత అనుభవం: కందసామి, సూకమ్మ (కెనడా)

“మేము దక్షిణ ఆఫ్రికాలో పెరిగాం. అక్కడ జాతి వివక్ష ఎక్కువగా ఉండడంతో, ఒక జాతి వాళ్లు వేరే జాతి వాళ్లతో కలవకుండా విడివిడిగా నివసించాల్సి వచ్చింది. దానివల్ల వేర్వేరు జాతుల మధ్య వివక్ష మొదలైంది. మేము నల్లజాతి వాళ్లం, కొంతమంది తెల్లజాతి వాళ్లు మమ్మల్ని హీనంగా చూసేవాళ్లు కాబట్టి మేము వాళ్లను అసహ్యించుకునే వాళ్లం. వాళ్లే వివక్ష చూపిస్తున్నారు అనుకున్నాం కానీ మేము కూడా వివక్ష చూపిస్తున్నామని గుర్తించలేదు.”

“మా ఆలోచనను సరిచేసుకోవడానికి, మా హృదయాల్ని విశాలం చేసుకుని వేర్వేరు నేపథ్యాల వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాం. తెల్లవాళ్లతో స్నేహం చేస్తున్నప్పుడు, చాలా విషయాల్లో వాళ్లూ మాలాగే ఉన్నారని గుర్తించాం. వాళ్ల పరిస్థితులు, మా పరిస్థితులు; వాళ్ల కష్టాలు, మా కష్టాలు ఒకేలా ఉన్నాయి.”

“తెల్లజాతికి చెందిన ఒక జంటను మా ఇంట్లోకి ఆహ్వానించాం. వాళ్లు చాలాకాలం మాతో ఉన్నారు. మేము వాళ్ల గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నాం. కొన్ని రోజులకే ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం, మేమంతా సమానమని గ్రహించాం. అప్పటినుండి తెల్లవాళ్ల మీద మాకున్న అభిప్రాయం మారింది.”

నిజమైన స్నేహితులు

జానీ, గిడియన్‌ యెహోవాసాక్షుల రాజ్యమందిరం బయట పిల్లల్ని పలకరిస్తున్నారు.

తమ జాతులు, సిద్ధాంతాలు వేరయినా జానీ, గిడియన్‌ మంచి స్నేహితులయ్యారు.

జానీ, గిడియన్‌: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు అనే వీడియో చూడండి. jw.org/te లో ఈ టైటిల్‌ టైప్‌ చేసి వెతకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి