కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • br-1110 పేజీలు 13-15
  • తల్లిదండ్రులు ఏమంటున్నారంటే . . .

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లిదండ్రులు ఏమంటున్నారంటే . . .
  • తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
  • ఇలాంటి మరితర సమాచారం
  • పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో బైబిలు మీకు సహాయం చేయగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • శైశవదశ నుండి కౌమారదశ వరకు పిల్లలను ఎలా పెంచాలి?
    తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
  • మీ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి?
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
br-1110 పేజీలు 13-15

తల్లిదండ్రులు ఏమంటున్నారంటే . . .

మీ పిల్లలు ఎదిగేకొద్దీ, పెద్దవాళ్లకు లోబడివుండడం అవసరమని ఎలా నేర్పించవచ్చు? వాళ్లు పెద్దయ్యేకొద్దీ జీవితంలో పనికొచ్చే నైపుణ్యాలు ఎలా నేర్పించవచ్చు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది తల్లిదండ్రులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ఇంటిపనులు, సామాజిక నైపుణ్యాలు

“మేము కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆ రోజు జరిగిన విశేషాల గురించి మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినడం ఎలాగో అప్పుడు మా పిల్లలు నేర్చుకుంటారు. మేము ఓపిగ్గా వినడం చూసినప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలని వాళ్లకు అర్థమౌతుంది. వాళ్ల ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది.”—రిచర్డ్‌, బ్రిటన్‌.

“మా పిల్లలు ఒకరినొకరు గౌరవించుకోవడం, మా సహాయం లేకుండానే తగాదాలు పరిష్కరించుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. పెద్దవాళ్లతో కూడా మా పిల్లలు ధైర్యంగా మాట్లాడుతున్నారు.”—జాన్‌, దక్షిణాఫ్రికా.

“నేనూ తప్పులు చేస్తుంటాను కాబట్టి, కొన్నిసార్లు అనుకోకుండా మా పిల్లలను బాధపెడుతుంటాను. అలాంటప్పుడు తప్పకుండా వాళ్లను క్షమాపణ కోరతాను.”—జనెల్‌, ఆస్ట్రేలియా.

“మా పిల్లలకు ఇంటిపనులు నేర్పిస్తున్నాం. పిల్లలు ఇంటిపనుల్లో చేయందివ్వడం వల్ల పనులన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి, కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. ఏదో సాధించామన్న తృప్తి పిల్లలకు కలుగుతోంది.”—క్లయివ్‌, ఆస్ట్రేలియా.

“ఒకరినొకరు అర్థంచేసుకోవడం, గౌరవించుకోవడం, క్షమించుకోవడం వంటివి పిల్లలకు నేర్పించడమంటే మాటలు కాదు. అయినా అలా చేయాలి.”—యూకో, జపాన్‌.

పరిశుభ్రత, ఆరోగ్యం

“చిన్నప్పుడు మా పిల్లలకు స్నానం చేసుకోవడం నేర్పించాం. వాళ్లు ఆడుతూపాడుతూ స్నానం చేయాలని బొమ్మల సబ్బులు, కార్టూన్‌ బొమ్మలున్న షాంపూలు, జంతువుల ఆకారంలోవున్న స్పాంజిలు కొనిపెట్టేవాళ్లం.”—ఎడ్గార్‌, మెక్సికో.

“ఇంట్లో కుళాయినీటి సౌకర్యం లేని ప్రాంతంలో ఉన్నప్పుడు పిల్లలు బయట నుండి రాగానే చేతులు కడుక్కునేలా ఒక దగ్గర సబ్బు, బకెట్లో నీళ్లు ఎప్పుడూ పెట్టేదాన్ని.”—ఎన్‌డ్యూరెన్స్‌, నైజీరియా.

“మా పిల్లలకు ప్రతీరోజు పోషకాహారం ఇస్తాం, సమతుల్య ఆహారం ఎందుకు తీసుకోవాలో వివరిస్తాం. వంటకాల్లో ఏమేమి వేస్తారని మా పిల్లలు కూతూహలంతో అడుగుతుంటారు. అందుకే, వంటపనిలో వాళ్ల సహాయం తీసుకుంటాను. అప్పుడు ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది.”—సాండ్రా, బ్రిటన్‌.

“వ్యాయామం చాలా అవసరం, అందుకే ఈ విషయంలో మేము మా పిల్లలకు ఆదర్శంగా ఉండడానికి ప్రయత్ని స్తున్నాం. కుటుంబమంతా కలిసి జాగింగ్‌ చేయడం, ఈతకొట్టడం, టెన్నిస్‌ లేదా బాస్కెట్‌ బాల్‌ ఆడడం, సైకిల్‌ తొక్కడం మా పిల్లలకు చాలా ఇష్టం. వ్యాయామం ఎంతో అవసరమనీ, అది సరదాగా ఉంటుందనీ వాళ్లకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది.”—కెరన్‌, ఆస్ట్రేలియా.

“తల్లిదండ్రులు తమతో సమయం గడపాలని పిల్లలు ఎంతో కోరుకుంటారు. బహుమానాలు, విహారయాత్రలు, డబ్బు వంటివేవీ దాంతో సాటిరావు. ఉదయం మాత్రమే పనివుండే ఉద్యోగాలకు వెళ్తాను. మధ్యాహ్నం ఇంటిపట్టునే ఉండి స్కూలు నుండి వచ్చిన మా పిల్లలతో సమయం గడుపుతాను.”—రోమీనా, ఇటలీ.

క్రమశిక్షణ

“ఎప్పుడూ ఒకేవిధమైన క్రమశిక్షణ ఇస్తే లాభం లేదని, పరిస్థితిని బట్టి దాన్ని మార్చాలని మాకు అర్థమైంది. కొన్నిసార్లు, పరిస్థితి తీవ్రత అర్థమయ్యేలా వాళ్లతో సూటిగా మాట్లాడాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు, వాళ్లకు కొన్ని ఆంక్షలు విధించాల్సి రావచ్చు.”—ఆగ్బీటీ, నైజీరియా.

“మేము ఇచ్చిన సూచనలు అర్థమయ్యాయో లేవో తెలుసుకోవడానికి, వాటిని తిరిగి చెప్పమని మా పిల్లలను అడుగుతాం. ఆ తర్వాత మేము చెప్పినదానికి కట్టుబడి ఉంటాం. పిల్లలు మాట విననప్పుడు శిక్షిస్తే, వాళ్లు మనం చెప్పినట్టు నడుచుకుంటారు.”—క్లయివ్‌, ఆస్ట్రేలియా.

“నేను మా పిల్లలను సరిదిద్దుతున్నప్పుడు కిందికి వంగి వాళ్ల కళ్లలోకి చూసి మాట్లాడతాను. దానివల్ల నేను చెప్పేది జాగ్రత్తగా వింటారు. వాళ్లు నా ముఖకవళికలను చూడగలుగుతారు. అలా మాట్లాడకుండానే ఎన్నో విషయాలు వాళ్లకు చెప్పవచ్చు.”—జెన్నిఫర్‌, ఆస్ట్రేలియా.

“‘నువ్వెప్పుడూ వినవు’ అనే మాట మా నోట రానివ్వం. కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది, అయినా అలా అనకుండా జాగ్రత్తపడతాం. అంతేకాదు, తోబుట్టువుల ముందు పిల్లలను మందలించం. ఎప్పుడైనా సరిదిద్దాల్సివస్తే వాళ్లకు మాత్రమే వినిపించేలా చెబుతాం, లేదా పక్కకు తీసుకువెళ్లి ఒంటరిగా మాట్లాడతాం.”—రూడీ, మొజాంబిక్‌.

“పిల్లల మీద ఇతరుల ప్రభావం త్వరగా పడుతుంది, వాళ్లు ఇతరులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే, చుట్టూ ఉన్న వాతావరణం వల్ల, తోటి విద్యార్థుల వల్ల, ప్రసారమాధ్యమాల వల్ల కలిగే చెడు ప్రభావాల నుండి వాళ్లను కాపాడి, మంచిబుద్ధులు అలవడేలా సహాయం చేయాలి. వాళ్లు మంచి విలువలు నేర్చుకుంటే హానికరమైన వాటికి దూరంగా ఉండగలుగుతారు.”—గ్రేగ్‌వార్‌, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.

“క్రమశిక్షణను ఖచ్చితమైన రీతిలో అమలుచేయండి. అది న్యాయంగా ఉండేలా చూడండి, మీరు చెప్పినదానికి ఎప్పుడూ కట్టుబడి ఉండండి. తప్పు చేస్తే ఏమి జరుగుతుందో మీ పిల్లలకు తెలిసుండాలి. మాట వినకపోతే మీరు అన్నట్టే శిక్షిస్తారని వాళ్లకు అర్థంకావాలి.” —ఓవన్‌, ఇంగ్లండ్‌.

[14వ పేజీలోని క్యాప్షన్‌]

“మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి.”—కొలొస్సయులు 3:21

[15వ పేజీలోని క్యాప్షన్‌]

ఓ కుటుంబ కథ

ఒంటరి తల్లిగా ఎలా నెగ్గుకురాగలిగింది?

లూసిన్డ ఫార్స్‌టర్‌తో ఇంటర్వ్యూ

ఒంటరి తల్లిగా మీరు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఏమిటి?

తల్లిగా బాధ్యతలు నిర్వర్తించడమే కష్టమంటే, ఒంటరి తల్లిగా నా సమయాన్ని, శక్తిని సరైన రీతిలో ఉపయోగించడం ఇంకా కష్టమనిపిస్తుంది. ఒకవైపు పిల్లలకు మంచిబుద్ధులు నేర్పిస్తూ మరోవైపు వాళ్లతో సరదాగా సమయం గడపాలంటే ఎంతో సమయం అవసరం. చాలాసార్లు, ఇంటిపనుల వల్ల విశ్రాంతి కూడా దొరకదు.

మీ అమ్మాయిలతో అరమరికల్లేకుండా మాట్లాడడానికి ఏమి చేస్తారు?

అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నప్పుడు అభద్రతా భావంతో పిల్లలు కోపంగా ఉండే అవకాశముంది. మృదువైన స్వరంతో, కళ్లలోకి చూస్తూ మాట్లాడితే సమస్యలు పరిష్కారమౌతాయని నేను గుర్తించాను. మా కోపం తగ్గేంతవరకు ఆగుతాను, ఆ తర్వాత సమస్యను భూతద్దంలో చూడకుండా, నేను ఎందుకు ఆందోళనపడుతున్నానో వివరిస్తాను. వాళ్ల అభిప్రాయాలను అడిగి, వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వింటాను. అలా వాళ్ల మనోభావాలకు నేనెంతో విలువిస్తున్నానని చూపిస్తాను. వాళ్ల చదువు విషయంలో శ్రద్ధ తీసుకుని, వాళ్లు చేస్తున్న కృషిని మెచ్చుకుంటాను. మేమెప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో కలిసి భోజనం చేస్తాం. నేను వాళ్లను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎప్పుడూ చెబుతుంటాను.

వాళ్లను క్రమశిక్షణలో ఎలా పెడతారు?

పిల్లలకు కొన్ని ఖచ్చితమైన హద్దులు విధించాలి, అవి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఖచ్చితంగా ఉంటూనే, వాళ్లతో దయగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను. ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తించకూడదో మా పిల్లలకు అర్థమయ్యేలా కొన్నిసార్లు వివరిస్తాను. వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చేముందు వాళ్లు ఎందుకలా ప్రవర్తించారో తెలుసుకోవడానికి ప్రయత్ని స్తాను. తప్పు నాదైతే లేదా నేను వాళ్లను అపార్థం చేసుకునివుంటే క్షమాపణ కోరతాను.

ఇతరులను గౌరవించడం ఎలా నేర్పిస్తారు?

ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని మనం కోరుకుంటామో అదే విధంగా మనం వాళ్లతో ప్రవర్తించాలని యేసు బోధించిన సూత్రాన్ని వాళ్లకు గుర్తుచేస్తాను. (లూకా 6:31) వాళ్ల మధ్య సమస్యలొస్తే, వీలైనంతవరకు సొంతగా పరిష్కరించుకోమని చెబుతాను. కోపం వచ్చినప్పుడు మృదువుగా, దయగా స్పందించడం చాలా అవసరమని వాళ్లకు చెబుతాను.

సేదదీరడానికి మీరేమి చేస్తారు?

ప్రతీసారి విహారయాత్రలకు వెళ్లలేం కాబట్టి, తక్కువ ఖర్చులో వెళ్లి రాగల ప్రాంతాల కోసం వార్తాపత్రికల్లో చూస్తాం. మేము అప్పుడప్పుడు పిక్నిక్‌కు వెళ్తాం, లేదా అలా సరదాగా నడుచుకుంటూ వెళ్లి మొక్కలను పెంచే తోటలను చూస్తాం. మా తోటలో ఆకుకూరలను పెంచుతాం, వాటిలో మాకు ఇష్టమైనదాన్ని తెచ్చుకొని చక్కగా వండుకుంటాం. దగ్గర్లోని పార్కుకు వెళ్లి కాసేపు గడిపివచ్చినా ఫర్వాలేదు, అప్పుడప్పుడు ఉల్లాసకార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.

మీరు ఎలాంటి ఆనందాలను, ఆశీర్వాదాలను పొందారు?

ఒంటరి తల్లిగా పిల్లలను పెంచడం కష్టమే అయినా మేము ఒకరికొకరం మరింత దగ్గరయ్యాం, దేవుడు మాకు ఇచ్చిన వాటితో సంతృప్తిచెంది ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకున్నాం. మా అమ్మాయిలిద్దరూ ఎదుగుతూ తమదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది. వాళ్లకు ఈ వయసులో నాతో సమయం గడపాలనుంటుంది. అలా గడపడం నాకూ ఇష్టమే. నేను సంతోషంగా ఉన్నదీ విచారంగా ఉన్నదీ వాళ్లు ఇట్టే పసిగడతారు, నన్ను ఓదార్చడానికి కొన్నిసార్లు వాటేసుకుంటారు. అలా వాళ్లు ప్రేమతో హత్తుకున్నప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువగా, మా కష్టాలన్నిటిలో తోడుగావున్న ప్రేమగల సృష్టికర్త ప్రేమను మేము రుచిచూశాం. బైబిలు సహాయం వల్లే నేను మంచి తల్లిగా ఉండేందుకు నిరంతరం కృషి చేయగలుగుతున్నాను.—యెషయా 41:13.

[క్యాప్షన్‌]

తన ఇద్దరు కూతుర్లు బ్రీ, షేలతో లూసిన్డ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి