“నాకున్న అతి గొప్ప కోరిక”
యుగోస్లేవియా వ్రాన్య పట్టణంలోని ఒక తరగతిలోని విద్యార్థులకు పైన తెల్పబడిన విషయంపై ఒక వ్యాసం వ్రాయమని నియమించారు. ఎనిమిదేండ్ల సిర్‌గ్యే అనే అబ్బాయి వ్రాసిన ఈ క్రింది వ్యాసం పాఠశాలలో అందరూ చదివేందుకు తర్వాత నోటీస్ బోర్డ్‌లో పెట్టబడింది.
“మొదటిగా, మంచి ర్యాంకులతో పాఠశాలను ముగించి సెలవులకు బెల్‌గ్రేడ్ నగరానికి వెళ్ళాలన్నది నాకున్న అతి గొప్ప కోరిక అని నేను వ్రాయాలని ఇష్టపడ్డాను. కానీ నేను ఇంటిదగ్గర వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను. ప్రపంచం మొత్తం శాంతితో ఉండాలనీ, ప్రజలందరూ సంతోషంగా జీవించాలనీ, ఒకరినొకరు ప్రేమను కలిగి సహాయం చేసుకోవాలనేదే నా అతి గొప్ప కోరిక. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగానూ మన ఈ గ్రహం అంతా ఇప్పుడున్నంత కన్నా ఎక్కువ శుభ్రంగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను.
“ఈ రోజు భూమి రసాయనాలతో కలుషితమై పోయింది. నీరు, గాలి కూడా కలుషితమై పోయాయి. ప్రపంచంలో ప్రతీరోజూ వేలమంది పిల్లలు ఆకలితో చనిపోతున్నారు, చాలామంది రోగాల వల్ల చనిపోతున్నారు. అవన్నీ అదృశ్యమైపోవాలని, పిల్లలందరూ తమ తల్లిదండ్రుల ప్రేమను అనుభవించాలనీ, అలా ప్రతీ రోజూ రమ్యమైనదిగా ఉంటుందన్న నిశ్చయతతో ఆనందంగా, సంతోషంగా నిద్రకు ఉపక్రమించాలనీ నేను ఇష్టపడుతున్నాను. ఇది ఇప్పుడు ఈ లోకంలో సాధ్యం కాదు, భవిష్యత్తులో సాధ్యమౌతుంది. ఇదే నాకున్న అతి గొప్ప కోరిక.”
ఈ సంగతులు జరుగబోతున్నాయని సిర్‌గ్యే నిశ్చయతను కలిగివుండేలా ఏది చేసింది? బైబిలులో వర్ణించబడిన దేవుని వాగ్దానాలపై ఆయన నమ్మకముంచాడు. దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్‌లోని “దేవుని వలన కలిగే అద్భుతమగు నూతన లోకము” అనే శీర్షిక భాగంలో ఈ వాగ్దానాలు వర్ణించబడ్డాయి.
మీ ప్రాంతంలోని మా ప్రతినిధుల్లో ఒకర్ని మిమ్మల్ని సందర్శించమని కోరటం ద్వారా, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే ప్రచురణ గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి మీకు సహాయపడటానికి మేము ఆనందిస్తాము. మీకిష్టమైనట్లైతే దయచేసి ఈ క్రిందనున్న కూపన్‌ను పూరించి, అక్కడివ్వబడిన చిరునామాకు గానీ, 5వ పేజీలోని చిరునామాల్లో మీకు అనుకూలమైన దానికి గానీ పంపించండి.
◻ మీ ప్రతినిధుల్లో ఒకరిని నన్ను సందర్శించడానికి పంపించండి