ఒక ఉద్దేశమున్న ప్రచురణ
చెక్ రిపబ్లిక్‌లోని, ప్రాగ్ నగరంలోని ప్రజా గ్రంథాలయపు మ్యానేజర్, తేజరిల్లు! పత్రికను గురించిన రెండు పేజీల మదింపును ఆ గ్రంథాలయంలోని ఇన్‌ఫర్మేషన్ బోర్డు మీద పెట్టారు. ఆయన వ్రాసిన ఆ మదింపులో కొంత భాగం ఇలా ఉంది:
“నేను యెహోవాసాక్షిని కాను. వాచ్‌టవర్ సొసైటీకి అంకితభావంతో మద్దతునిచ్చేవాడనూ కాను, అలా అని గట్టిగా వ్యతిరేకించేవాడనూ కాను. అయినప్పటికీ, కొంతకాలంగా నేను చదువుతున్న తేజరిల్లు! పత్రికను హృదయపూర్వకంగా సిఫార్సు చేయకుండా ఉండలేకపోతున్నాను. రోజుకోసారి ఈ పత్రిక పేరును చదివినా చాలు ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే, ఈ పత్రిక పేరు మాత్రమే గాక దాంట్లోని విషయాలు వాణిజ్య పత్రికలకు ఒక చక్కని అనుబంధంగా ఉన్నాయి . . .
“తేజరిల్లు!లో, జాగ్రత్తగా ఆలోచించి సిద్ధం చేసిన సమాచారం ఉంటుంది. వేర్వేరు కారణాలను బట్టి ఇతర పత్రికలు ప్రచురించడానికి ఇష్టపడని విషయాలను ఈ పత్రికలోని శీర్షికలు చర్చిస్తాయి. తేజరిల్లు! పత్రిక, విషయాల తర్కబద్ధమైన సంబంధాలను చూపిస్తుంది, భూగోళాన్ని గూర్చిన స్పృహ కలగజేసుకోవడంలో శిక్షణనిస్తుంది . . . తేజరిల్లు!, తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దదు గానీ, వాస్తవాలనూ, ఆధికారిక దృక్కోణాలనూ తెలియజేస్తుంది, అనుకూల ప్రతికూల కారణాలను కళ్ళ ముందుంచుతుంది, బైబిలులో చెప్పబడిన విషయాలను చూపిస్తూ, ప్రస్తుత సమస్యలను ముందుంచుతుంది. ఏ అభిప్రాయానికి రావాలన్న విషయాన్ని పాఠకునికే విడిచిపెడుతుంది. అంతేకాకుండా, తేజరిల్లు! ప్రశ్నలను అడుగుతుంది, ప్రశ్నలను అడిగేలా చదువరులకు నేర్పిస్తుంది.”
ప్రతి పత్రిక యొక్క 4వ పేజీలో, “తేజరిల్లు! ఎందుకు ప్రచురించబడుతుందంటే” అనే భాగం, “అతి ప్రాముఖ్యంగా, ఈ పత్రిక ప్రస్తుత దుష్ట అరాచక విధానం స్థానంలో రానున్న శాంతిభద్రతలతో కూడిన ఒక నూతనలోకాన్ని గూర్చిన సృష్టికర్త వాగ్దానమందు నమ్మకాన్ని దృఢపరుస్తుంది” అని వివరిస్తుంది.
జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? అనే 32-పేజీల బ్రోషూర్‌లోని చివరి రెండు భాగాల్లో—“దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది,” “భూపరదైసులో నిత్యము జీవించుము” అనే భాగాల్లో—దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించి చర్చించబడడాన్ని మీరు చూస్తారు. దీనితో పాటు ఉన్న కూపన్‌ను నింపి, కూపన్‌లో ఇవ్వబడిన చిరునామాకు లేక ఈ పత్రిక 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు అనుకూలమైన దానికి పంపడం ద్వారా మీరు ఈ బ్రోషూర్‌ను పొందగలరు.
◻ జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? అనే బ్రోషూర్‌ను నాకు పంపించండి.
◻ మా ఇంటికి వచ్చి ఉచితంగా బైబిలు పఠనం నిర్వహించేందుకు దయచేసి ఈ చిరునామాలో నన్ను సంప్రదించండి.