పొగత్రాగడానికి వ్యతిరేకమైన ఒక పోస్టరుకు తేజరిల్లు! పురికొల్పునివ్వడం
ఇటలీలోని తేజరిల్లు! విలేఖరి
ఇటీవల, ఉత్తర ఇటలీలోని మోర్టారా నగరంలో ఇటాలియన్ క్యాన్సర్ వ్యతిరేక సమితీ, ఒక ప్రాంతీయ వార్తాపత్రికా పొగత్రాగడానికి వ్యతిరేకమైన ఒక పోస్టరును చిత్రించే ఒక పోటీని హై స్కూలు విద్యార్థుల మధ్య సంస్థీకరించాయి. యెహోవాసాక్షి అయిన పద్నాలుగు సంవత్సరాల సీమోనా, పొగాకు వల్ల వచ్చే ప్రమాదాలను గురించిన ఐడియాల కోసం వివిధ తేజరిల్లు! శీర్షికలను, ప్రాముఖ్యంగా జూలై 8, 1989, (ఆంగ్లం); జూన్ 8, 1995; శీర్షికలను తిరగేసింది. “పరిశోధన సాగిస్తుండగా, ఈ శీర్షికల ముఖ చిత్రాలను చూసి నేను ఎంతో అచ్చెరువొందాను. నేను ఒక తేజరిల్లు!లో చూసినటువంటి ఒక చిత్రాన్ని—ఒక సిగరెట్టును నోటిలో పెట్టుకున్న ఒక కపాలపు చిత్రాన్ని గీశాను, స్లోగన్ ఏమని వ్రాయాలి అనేదానికి ఆ ముఖచిత్ర శీర్షిక నాకు ఐడియానిచ్చింది,” అని సీమోనా వ్రాసింది. “పొగత్రాగటం—లక్షలను గడించడానికి లక్షలాదిమందిని చంపుతుంది” అన్నదే ఆమె స్లోగన్. పోటీకి వచ్చిన 250 పోస్టర్లలో తన పోస్టర్ ఒకటి.
ఆ పోటీలో పాల్గొన్న వేరే విద్యార్థుల కన్నా సీమోనా వయస్సులో చిన్నదైనప్పటికీ, తనే మొదటి బహుమతి గెలుచుకుంది, దానితో పాటు 300 అమెరికన్ డాలర్లను పారితోషికంగా పొందింది. తనకు ఐడియాలను ఇచ్చిన తేజరిల్లు!లోని ఫలకరమైన ముఖ శీర్షికలనుబట్టి కృతజ్ఞతలను తెలుపుతూ సీమోనా వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచ్ కార్యాలయానికి ఉత్తరం వ్రాసింది. తను తేజరిల్లు!ను చదవడాన్ని ఆస్వాదించడానికి కారణం, దాని ముఖ శీర్షికలు మాత్రమే కాదు. ఆరోగ్యం, ప్రస్తుత సంఘటనలు, యువత ఎదుర్కొంటున్న సమస్యల విషయమై అందులో వచ్చే సమయోచితమైన, ఆచరణాత్మకమైన శీర్షికలు కూడా కారణమే. చివరిగా: “ఇలాంటి శ్రేష్ఠమైన శీర్షికలను ప్రచురిస్తూ ఉండండి!” అని వ్రాస్తూ ఆమె తన ఉత్తరాన్ని ముగించింది.
క్రైస్తవులను బాధించే ఇతర వివాదాలను గురించిన మరింత సమాచారం పొందాలని మీరనుకుంటే, యెహోవాసాక్షుల ప్రాంతీయ రాజ్యమందిరాన్ని దయచేసి సంప్రదించండి, లేదా క్రింద ఇవ్వబడిన కూపన్‌ను పంపండి.
□ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్‌ను నాకు పంపించండి.
□ ఉచిత బైబిలు పఠనం నిర్వహించేందుకు దయచేసి ఈ చిరునామాకు సంప్రదించండి.