“మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?”
1997లోని అక్టోబరు, నవంబరు నెలల్లో “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” అనే నాలుగు పేజీల కరపత్రం ప్రపంచమంతటా 100 కన్నా ఎక్కువ భాషలలో 30 కోట్ల ప్రతులు ముద్రించి పంచిపెట్టడం జరిగింది. ఈ కరపత్రం గురించి అనేకమంది అనుకూల వ్యాఖ్యానాలు చేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈస్టన్ నగరంలోని ఎక్స్ప్రెస్-టైమ్స్ పత్రికలోని సమీక్ష ఒకటి ఇక్కడ ఇవ్వబడింది:
“అది ఇరుగుపొరుగువారి మధ్య ప్రేమ చల్లారిపోతుందని చూపించే అనుభవాలను నొక్కిచెబుతుంది—చివరికి ఒకర్నొకరు చంపుకుంటూ, బోస్నియా-హెర్జెగోవినాలోనూ రువాండాలోనూ ఉన్నట్లుగా ఎంతోకాలంగా ఇరుగుపొరుగుగా ఉన్నప్పటికీ భిన్నమైన జాతివారు లేదా భిన్నమైన మతంవారు ఒకర్నొకరు తెగనరుక్కున్న ఉదాహరణలను పేర్కొంటుంది.
“అంతదూరం ఎందుకు మన స్వంత దేశంలోని ఉదాహరణలను కూడా అది పేర్కొంటుంది, ఎక్కడైతే వృద్ధులు ఏకాకులుగా, తమను ఎవరూ చూడడానికి రాక జీవితాల్ని వెళ్లదీస్తుండడాన్ని అది పేర్కొంది. అందులో ఉన్న ఒక శక్తిమంతమైన ఫోటోలో ఒక స్త్రీ గొలుసుపెట్టివున్న తలుపు సందులోనుండి భయంగా చూస్తుంటుంది.”
“స్లొవేనియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ద ఫిలసాఫికల్ లిటరేచర్ క్లబ్ ఇంప్రెస్య నుండి ఈ అభ్యర్థన అందింది: “మత సత్యాన్ని వివరించే విషయానికి వస్తే, విచారకరంగా స్లొవేనియాలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. ఈ మత సత్యాల్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” అనే కరపత్రం 50 కాపీలను మాకు పంపించమని వినమ్రంగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. అది ఒక విశిష్ఠమైన కరపత్రంగా మాకు కన్పిస్తుంది, ఇది కేవలం విషయాన్ని చెప్పడంలోనే కాదు. అందులోని చిత్రాలు కూడా మాపై బాగా ముద్రను వేశాయి.”
ప్రపంచ ప్రజలు శాంతియుతంగా, సమైక్యతలతో జీవించగలరన్న దానికి రుజువు కావాలని మీరు కూడా కోరుతున్నట్లైతే ఇక్కడున్న కూపన్ను పూరించి దానితో పాటు రూ. 6.00 పోస్టులో మాకు పంపించండి.
◻ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును నాకు పంపించండి.
◻ ఉచిత గృహ బైబిలు పఠనం విషయమై దయచేసి నన్ను కలవండి.