‘అవి మా దృక్కోణాన్ని విశాలపర్చాయి’
మునుపటి సోవియట్ యూనియన్ రిపబ్లిక్ రాజధాని అయిన కిర్ఘిజ్స్తాన్లో కారాకూల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్లోని విదేశ భాషల విభాగపు అధికారి యెహోవాసాక్షుల ప్రచురణలను మెచ్చుకున్నారు. రష్యాలోని యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీసుకు ఆయన ఈ క్రింది విధంగా వ్రాశారు:
“నేటి సామాజిక మరియు ఆర్థిక అరాచక పరిస్థితుల్లో ఇంగ్లీష్, జర్మన్, రష్యన్, కిర్ఘిజ్, టర్కిష్ భాషలను బోధించడంలో మీ పుస్తకాలూ, బ్రోషూర్లూ మాకు చాలా సహాయపడుతున్నాయి. . . . ఆచరణాత్మక అనువాదాన్ని అధ్యయనం చేస్తున్నవారి మధ్య మీ బ్రోషూర్ల కొరకైన డిమాండ్ చాలా ఉంది. . . . జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా?, కుటుంబ సంతోషానికిగల రహస్యము, యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు అనే పుస్తకాలకు కృతజ్ఞతలు.
“మా విద్యార్థుల్లో చాలా మంది యెహోవాసాక్షులు ఉన్నారు. వాళ్ళు తేజరిల్లు! శీర్షికలను చాలా ఆసక్తితో చదువుతారు, హోమ్‌వర్క్ ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తారు.”
తేజరిల్లు!ను మెచ్చుకునేందుకు మరో కారణాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పారు: “ఆసక్తికరమైన మరియు విజ్ఞానదాయకమైన శీర్షికలను బట్టి కృతజ్ఞతలు. . . . అవి మాలో నిరీక్షణను కలిగిస్తాయి, మా సాధారణ దృక్కోణాన్ని విశాలపరుస్తాయి. . . . తేజరిల్లు!లోని ‘ప్రపంచ పరిశీలన’ అనే భాగాన్ని మేమందరమూ చాలా ఉత్సాహంగా చదువుతాం.”
తేజరిల్లు! ప్రతిని పొందాలని మీరు ఇష్టపడుతున్నట్లయితే, లేదా యెహోవాసాక్షుల్లో ఒకరు మీ ఇంటికి వచ్చి, మీతో బైబిలు గురించి చర్చించాలని మీరు ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి Praharidurg Prakashan Society, Plot A/35 Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., India, లేదా 5వ పేజీలోని సముచితమైన చిరునామాకు వ్రాయండి.