ఆమెకు దేవుని మీద ఎందుకు నమ్మకంలేదు?
సోవియట్ యూనియన్ యొక్క ఒక పూర్వపు రిపబ్లికైన జార్జియాలోని రుస్తావీకి చెందిన అల్యెష్యా, తన ఇంటికి వచ్చిన ఇద్దరు సందర్శకులకు తన తలిదండ్రుల ఫోటోను చూపించి ఇలా అన్నది: “దేవుడే ఉంటే, నా తలిదండ్రులు ఇంత యౌవనంలోనే చనిపోయేందుకు అనుమతించేవాడు కాదు!” అల్యెష్యా భర్త టామాజీ ఇంటికి వచ్చిన తర్వాత, ఆ సందర్శకులు, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము! మరియు “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అనే బ్రొషూర్లను వాళ్లకు ఇచ్చి వెళ్లిపోయారు.
ఈ జంటను పునఃదర్శించినప్పుడు, అల్యెష్యా “ఇదిగో! . . . సమస్తము” బ్రొషూర్ను అప్పటికే చదివేసి ఉంది, ఆమె బైబిలు పఠనం కావాలని కోరింది. ఆమె చదివినవి ఆమెకు నచ్చాయి. దాని తర్వాత జరిగిన చర్చలో, ఆమె వెంటనే బ్రొషూర్ను తెరిచి తాను మార్కు చేసుకున్న భాగాలను చదివింది. అందులోని సహేతుకమైన తర్కాలు ఆమెకు బాగా నచ్చాయి.
ఉదాహరణకు, ఆ బ్రొషూర్ ఇలా చెబుతోంది: “మనచుట్టూవున్న మహాద్భుతమైన—పుష్పములు, పక్షులు, జంతువులు, మహాశ్చర్యకరమైన మానవ సృష్టి, అద్భుతములైన జీవము, పుట్టుక—ఇవన్నియు అదృశ్యమైన అత్యుత్తమ తెలివి వాటిని ఉత్పత్తిచేసెనని రుజువు చేయుచున్నవి. (రోమీయులు 1:20) ఎక్కడ తెలివి ఉండునో, అక్కడ మనస్సు ఉండును. ఎక్కడ మనస్సు ఉండునో అక్కడ వ్యక్తి ఉండును. ఆ సర్వోన్నత తెలివి, సమస్త జీవులకు సృష్టికర్తయు, జీవమునకు ఊటయైయున్న సర్వోన్నత వ్యక్తిదైయున్నది. (కీర్తన 36:9) సృష్టికర్తయే నిజముగా, సమస్త స్తుతిని, ఆరాధనను పొందనర్హుడైయున్నాడు.—కీర్తన 104:24; ప్రకటన 4:11.”
మరణించిన ప్రియమైన వారిని పునరుత్థానం చేస్తాననే దేవుని వాగ్దానం, బైబిలు చదవాలనే కోరిక తనలో కలిగేలా చేసిందని అల్యెష్యా తర్వాత తన భావాలను వ్యక్తం చేస్తూ చెప్పింది. ఈ బ్రొషూర్లలోని, విశ్వాసాన్ని బలపర్చే సమాచారం నుండి మీరు కూడా ప్రయోజనం పొందుతారని మేము విశ్వసిస్తున్నాము. మీకు భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము! మరియు “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అనే బ్రొషూర్ల ఒక ప్రతి కావాలన్నా లేక ఉచిత గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించేందుకు ఎవరైనా మిమ్మల్ని సందర్శించాలనుకుంటే దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India,కి లేక 5వ పేజీలోని సరైన చిరునామాకు వ్రాయండి.