ఒక విలేఖరి మెప్పు పొందిన తేజరిల్లు! పత్రిక
అమెరికానందలి కొలరాడోలో ఉన్న పేయోనియాలో ప్రచురించబడిన అక్టోబరు 13, 1997నాటి హై కంట్రీ న్యూస్‌లో ఈ క్రింది సిఫారసు కన్పించింది.
“గ్రీన్‌పీస్ [ఒక అంతర్జాతీయ పర్యావరణ సంస్థ] ఇక ఇంటింటికి వెళ్లలేకపోవొచ్చుగానీ, మరో గుంపు తరచుగా పర్యావరణ విషయాల్ని నొక్కి చెపుతూ తన దీర్ఘకాల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అది తన సమాచారాన్ని జులు, పిడ్గిన్, హిలిగేయనన్ భాషలతోపాటు దాదాపు 60 [నిజానికి 81] భాషల్లో లక్షలాది [ఒక్కొక్క సంచిక కోటీ 90 లక్షల] ప్రతుల్ని పంచిపెడుతోంది. జూలై 8, (ఆంగ్లం) [1997] సంచిక దాని కవర్‌పేజీపై ఇలా ప్రశ్నించింది: “మన జంతుజీవాన్ని ఎవరు సంరక్షిస్తారు?” (గంటకు మూడు చొప్పున) అంతరించిపోయే రేటు పెరిగిపోవడాన్ని గురించీ, ‘గ్రహంలోని జీవజాలాల ఆరోగ్యపరిస్థితిని గురించీ, పరిసరాల క్షీణతను గురించీ లోపలి పేజీల్లో చర్చించింది . . . ఆగస్టు 22, (ఆంగ్లం) 1977 సంచిక ‘జల సంక్షోభం: భౌగోళిక సమస్య,’ జనాభా పెరుగుదల ప్రభావాలు, కాలుష్యమూ నదుల వినియోగంపై అంతర్జాతీయ ఉద్రిక్తత అనే విషయాల్ని చర్చించింది . . . చర్చించే సమాచారం విజ్ఞానశాస్త్రాధారితమైనదీ, విస్తృతమైనదీ అయినప్పటికీ, ఈ శీర్షికల ముగింపు మాత్రం పర్యావరణవాదానికి సంబంధించినదికాదు. భూగోళాన్ని పునరుద్ధరించే పనిలో మీరు భాగంవహించాలని అనుకుంటే, ‘బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా దేవుడు మీ నుండి కోరుతున్న వాటిని దయచేసి నేర్చుకోండి’ అని వాళ్లు చెబుతారు.
“ఆ గుంపే యెహోవాసాక్షులు, ఆ ప్రచురణయే తేజరిల్లు! వాళ్లు మీ ఇంటికి గనుక రాకపోయినట్లైతే, Watchtower Bible and Tract Society of New York Inc., 25 Columbia Heights, Brooklyn, NY 11201-2483 అడ్రసుని సంప్రదించండి.”
మేము అంతకన్నా మరి బాగా చెప్పలేము, కానీ ఇది మాత్రం జోడిస్తాము, “లేకపోతే తేజరిల్లు! 5వ పేజీలో మీకు దగ్గరగా ఉన్న అడ్రసును సంప్రదించండి.”