కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 3/8 పేజీ 3
  • స్ట్రోక్‌!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్ట్రోక్‌!
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • దాని పర్యవసానాలను తాళుకోవడం
    తేజరిల్లు!—1998
  • స్ట్రోక్‌—దాని కారణాలు
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 3/8 పేజీ 3

స్ట్రోక్‌!

పాశ్చాత్య పారిశ్రామిక ప్రపంచంలో మరణానికీ దీర్ఘకాల అశక్తతకూ నడిపించే ప్రధాన కారణం స్ట్రోకే. “స్ట్రోక్‌” అనే పదమే “బ్రెయిన్‌ ఎటాక్‌” (‘మస్తిష్కాఘాతం’) ఎంత హఠాత్తుగా సంభవిస్తుందనే విషయాన్ని సూచిస్తుంది. మీరో క్షణంలో బాగుంటే, మరొక క్షణంలో పిడుగుపాటుకు లోనైనట్టు తల్లడిల్లిపోతారు. తీవ్రమైన స్ట్రోక్‌కు గురైతే అది మీ జీవితాన్ని అర్ధాంతరంగానూ, హఠాత్తుగానూ మార్చివేయగలదు. నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వైకల్యానికి గురిచేస్తూ అది, మీకు మూగతనాన్ని కలుగజేయవచ్చు, భావోద్రేకాలను తీవ్రంగా అస్తవ్యస్తం చేసి, మీ వ్యక్తిత్వాన్నీ గ్రహణశక్తుల్నీ మార్చివేయవచ్చు. మీరూ మీ కుటుంబ సభ్యులూ ఒకప్పుడు గడిపిన మామూలు జీవితాన్ని మరలా పొందడానికి, ఈ పోరాటానికిక అంతంలేదనిపించే పోరాటాన్ని పోరాడేలా మిమ్మల్ని చేయవచ్చు.

ఎలెన్‌ మోర్గాన్‌ విషయాన్నే తీసుకోండి.a 64 ఏళ్ల వయస్సున్న ఎలెన్‌ బుధవారం నాటికి ఆరోగ్యంగానూ, చలాకీగానూ ఉంది. గురువారం నాడు ఎలెన్‌ తన భర్తతోపాటూ షాపింగ్‌ చేస్తుండగా, ఆమెకు ఆకస్మికంగా మాటపడిపోయింది. ఆమె ముఖం వంకరపోయింది. ఆమె శరీరం బలహీనమైపోయింది. త్రాగుడు మైకంలో ఉండి తూలిపోతున్నట్టుగా ఆమె తూలిపోయింది. ఎలెన్‌ తీవ్రమైన స్ట్రోక్‌కు గురయ్యింది!

స్ట్రోక్‌కు గురైన తర్వాత కలిగిన పర్యవసానాల మూలంగా, ఎలెన్‌ స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి చిన్న చిన్న పనుల్ని కూడా చేసుకోలేనంతగా అశక్తురాలైంది. ఆమె ఏమీ రాయలేకపోయేది, వేటినీ అల్లలేకపోయేది లేక కుట్టలేకపోయేది. దానితో ఆమె మనస్తాపానికి గురై, ఎంతగానో నీరసించిపోయింది. ఆ సమయమందంతటిలో, ఎలెన్‌ ఆలోచనా ప్రక్రియలు మాత్రం దెబ్బతినలేదు; అయినా, ఇతరులు తనను బహుశా వెర్రిబాగులదానిలా చూస్తారని ఆమె భావించినప్పుడు, ఆమెలో కలవరపర్చే భావాలు తలెత్తేవి. తర్వాత, ఎలెన్‌ ఇలా వివరించింది: “ఈ ఆకస్మిక మార్పు మూలంగా కల్గిన షాక్‌ ఒకర్ని భావోద్రేకంగానూ, మానసికంగానూ ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని కొద్దిమందే గ్రహిస్తారు. వ్యక్తిగా నా ఉనికికిది దాదాపు ముగింపన్నట్టుగా నేను భావించాను.”

స్ట్రోక్‌ రావడానికి కారణమేమిటి? స్ట్రోక్‌కు గురైన ప్రతీ ఒక్కరూ, ఒకే విధంగా గురయ్యారా? దీనికి గురై బ్రతికి బయటపడిన వాళ్లు ఈ రోగాన్ని ఎలా తాళుకున్నారు? స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడిన వ్యక్తుల కుటుంబాలెలా తాళుకున్నాయి? మద్దతునివ్వడానికి మనమంతా ఏం చెయ్యగలం? ఇలాంటి ప్రశ్నల్ని తేజరిల్లు! పరిశీలించి, స్ట్రోక్‌కు గురై బ్రతికి బయటపడినవారి జీవితాలను గురించీ, వాళ్ల పోరాటంలో పాలుపంచుకొన్న వారి కుటుంబ సభ్యుల జీవితాలను గురించీ మీరు అవగాహన కల్గివుండేలా చేస్తుంది.

[అధస్సూచి]

a వ్యాధిగ్రస్తుల ఎడలా, వారి కుటుంబాల ఎడలా శ్రద్ధను కనబరుస్తూ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి