“మీరు ప్రజలకు చాలా గొప్ప సేవ చేస్తున్నారు”
ఇండియాలోని గోవాలోని ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చిన ఇద్దరు సాక్షుల దగ్గర నుండి తేజరిల్లు! యొక్క రెండు ప్రతులను పొందాడు. వాటిని చదివిన తర్వాత, ఆయన ఈ పత్రిక ప్రకాశకులకు ఈ క్రింది లేఖను వ్రాశాడు:
“ఆ రోజు మా ఇంటికి వచ్చి తేజరిల్లు! ప్రతులు ఇచ్చి వెళ్ళిన ఆ ఇద్దరు మహిళలకు నేను తప్పకుండా కృతజ్ఞతలు తెలపాలి. ఆ పత్రికలు ఏవో ప్రచార పత్రికలులే అని అనుకుని కొంతకాలం వరకూ నేను వాటిని పట్టించుకోనే లేదు. అయితే ఒక రోజు ఆ పత్రికల్లో ‘అమజాన్ వర్షపాత అడవి’ (మార్చి 22, 1997, ఆంగ్ల సంచిక) అనే దానిపై దృష్టి సారించాను. నేను ఆ పత్రికను చదవడం మొదలుపెట్టాక, దాన్ని జాగ్రత్తగా పూర్తిగా చదివే వరకు ప్రక్కన పెట్టలేకపోయాను.
“తేజరిల్లు!లోని సమాచారం చాలా ఆసక్తికరమైనదిగా, వివరాలనిచ్చేదిగా ఉన్నట్లు కనుగొన్నాను. అందులోని అంశాల్లోని వైవిధ్యం కూడా నన్ను ఆకర్షించింది. నేను మరెక్కువగా మెచ్చుకునే విషయమేమిటంటే, వివిధ శీర్షికలను సహేతుకంగా, సమతుల్యంగా చర్చించడమే.”
తేజరిల్లు!ను మొదటిసారిగా చదివిన ఈ వ్యక్తి “ఇలాంటి విలువైన సమాచారాన్ని ఇండ్ల గుమ్మం వరకూ తెచ్చివ్వడం ద్వారా మీరు ప్రజలకు చాలా గొప్ప సేవ చేస్తున్నారు” అని కూడా అన్నాడు.
తేజరిల్లు! నుండి మీరు కూడా ప్రయోజనం పొందగలరు. మీరు మరో ప్రతిని కావాలనుకుంటున్నట్లయితే, లేక మీతో బైబిలును చర్చించేందుకు మీ ఇంటికి ఎవరైనా రావాలనుకుంటున్నట్లయితే దయచేసి Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాయండి.