కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీ 27
  • ప్రజలను ఏది సంతోషపరుస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలను ఏది సంతోషపరుస్తుంది?
  • తేజరిల్లు!—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • సంతోషం కోసం అన్వేషణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘సంతోషంగల దేవుణ్ణి’ ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నిజమైన సంతోషం ఎక్కడ కనుగొనబడగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీ 27

ప్రజలను ఏది సంతోషపరుస్తుంది?

రెండు దశాబ్దాలుగా, ఒక పరిశోధకుల గుంపు సంతోషాన్ని గురించిన అధ్యయనంలో ఒక పద్ధతి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ జరుపుతోంది. వారు కనుగొన్న విషయాలేమిటి? “సంతోషం అనేది ముఖ్యంగా బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదని అనిపిస్తుంది” అని సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక నివేదిస్తుంది.

ఈ శాస్త్రీయ పత్రిక ఇలా కూడా పేర్కొంటుంది: “సిరి సంపదలు కూడా సంతోషానికి హేతువు కాదు. తమ సంస్కృతులు అభివృద్ధి చెందిన సమయాల్లో కూడా ప్రజలు మరింత సంతోషంగా లేరు. . . . అనేక దేశాల్లో ఆదాయానికీ సంతోషానికీ మధ్య ఉన్న పరస్పర సంబంధం చాలా స్వల్పమే.”

సంతోషం గల ప్రజల గుణాలుగా అధ్యయనాలు సూచించిన నాలుగు విశిష్ట లక్షణాలు: వాళ్ళు తమను తాము ఇష్టపడతారు, వాళ్ళకు మరింత ఆత్మ గౌరవం ఉంటుంది, తమ వ్యక్తిగత జీవితాలపై తమకు నియంత్రణ ఉందని వాళ్ళు భావిస్తారు, వాళ్ళు ఆశావాదులు, వాళ్ళకు ఇతరుల మీద శ్రద్ధ ఉంటుంది. అంతేకాక, మంచి వివాహమూ, సన్నిహిత వ్యక్తిగత అనుబంధాలు సంతోషకరమైన జీవితాలకు కారకాలు. ఇవి ఆరోగ్యాన్నీ ఆయుష్షునూ పెంచుతాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, “మత సంబంధంగా క్రియాశీలంగా ఉన్నవారు కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుపుతారు. మతంతో బాగా సంబంధమున్న ప్రజలు ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నమవ్వని ప్రజల కన్నా రెండు రెట్లు ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారని గ్యాలప్‌ సర్వే కనుగొంది. తెలియజేయబడుతున్న సంతోషమూ జీవితంలోని సంతృప్తీ అనేవి మతంతో దృఢమైన సంబంధం కల్గి ఉండడం వల్లా, ఆరాధనా పరిచర్యలకు తరచుగా వెళ్ళడం వల్లా కలుగుతాయని, 14 దేశాల్లోని 1,66,000 మంది ప్రజలను 16 దేశాలు సమిష్టిగా చేసిన అధ్యయనంతో సహా ఇతర సర్వేలు కూడా కనుగొన్నాయి” అని సైంటిఫిక్‌ అమెరికన్‌ నివేదించింది.

వ్యక్తిగత సంతోషం అనేది యెహోవా దేవుడ్ని ఐక్యంగా ఆరాధించడంతో దగ్గరి సంబంధం కలిగి ఉందని వెల్లడి చేస్తూ చాలా కాలం క్రితం కీర్తనల రచయితయైన దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.”—కీర్తన 122:1.

“సమాజముగా కూడుకొనుట మానక, . . . ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను ఉద్బోధించడంలో ఆశ్చర్యమేమీ లేదు! (హెబ్రీయులు 10:24, 25, ఇటాలిక్కులు మావి.) నిజానికి, దేవుడ్ని ఆరాధించేందుకు అమూల్యమైన విశ్వాసంగల వారితో సమావేశమవ్వడం బైబిలు సత్యాన్ని ప్రేమించేవారికి ఆనందభరితమైన సంఘటనే. లక్షలాది మంది యెహోవా సాక్షులు ఇది నిజమని కనుగొన్నారు. మీకు దగ్గర్లో ఉన్న రాజ్య మందిరంలో వాళ్ళతో ఆరాధనలో కలిసి మీకై మీరే సంతోషాన్ని అనుభవించేందుకు వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి