“వాడు చదివిన మొదటి పుస్తకం ఇదే”
ఉక్రెయిన్‌లో ఉన్న యెహోవాసాక్షులు ట్రెయిన్ల కోసం వేచివున్న వారితో తరచూ మాట్లాడతారు. బైబిలునందు ఆసక్తి చూపించిన ఓ స్త్రీకి అనేక చిత్రాల్ని ఉపయోగిస్తూ బైబిలు కాలానుక్రమ చరిత్రను తెలియజేసే నా బైబిలు కథల పుస్తకం (ఆంగ్లం) ప్రతి ఇవ్వబడింది.
తర్వాత, అదే స్టేషన్‌లో అదే స్త్రీ ఆ సాక్షిని మరలా చూసి, ఆ పుస్తకాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలా వివరిస్తోంది: “మా అబ్బాయి తన స్కూలు పుస్తకాల్ని చదవడానికి ఇష్టపడడు. వాడు వాటిని కనాకష్టంగా చదువుతాడు. కానీ నేను వాడికి బైబిలు కథలు పుస్తకాన్ని ఇచ్చినప్పుడు, బొమ్మల్ని చూసి దాన్ని చదవాలనే కోరికను పెంచుకున్నాడు. దాదాపు రెండు వారాల్లోనే వాడు ఆ పుస్తకాన్నంతటినీ చదివేశాడు. వాడు చదివిన మొదటి పుస్తకం ఇదే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా, వాడు దేవున్ని తెల్సుకున్నందుకు ఆనందించాడు. మరి వాడిలో ఈ మార్పుల్ని చూస్తున్నందుకు నేను కూడా ఆనందిస్తున్నాను. చదవడానికి మరిన్ని పుస్తకాల్ని దయచేసి ఇవ్వండి.”
దగ్గర్లోనే నిల్చొనివున్న మరో స్త్రీ, దీన్ని వింది. నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) ఉంటే తనకు కూడా ఒకటి కావాలని అడిగింది. Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాసి 256 పేజీలున్న ఈ పుస్తక ప్రతిని మీరు కూడా పొందవచ్చు లేదా మీతో బైబిలు విద్య యొక్క విలువను గురించి చర్చించడానికి ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానించవచ్చు.