ఆయన ప్రశ్నలన్నింటికీ జవాబులివ్వబడ్డాయి
తను చర్చిలో నేర్చుకున్న దానికి ఎంతో భిన్నమైన దానిని యెహోవాసాక్షులు బోధిస్తున్నారని ఇండియాలో యెహోవాసాక్షులను కలిసిన ఒక వ్యక్తి కనుగొన్నాడు. ఈ విషయాన్ని గురించి ఆయన యెహోవాసాక్షులతో మాట్లాడాడు, ప్రశ్నలను అడుగుతూ ఇండియాలోని వారి బ్రాంచ్ ఆఫీసుకి ఉత్తరం కూడా వ్రాశాడు.
అయితే ఒకరోజు, “లోనావ్లాలోని నా అత్యంత ప్రియమైన సహోదరులారా” అని సంబోధిస్తూ ఆ వ్యక్తి ఒక ఉత్తరం వ్రాశాడు. ఇండియాలోని యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీస్ ఉండేది లోనావ్లాలోనే. ఆయన ఇలా వివరించాడు: “మే 8, 1995 తేజరిల్లు! (ఆంగ్లం)లో ‘మీరెప్పుడైనా ఆలోచించారా?’ ఆనే అంశం క్రింద, యాదృచ్చికంగా నా సందేహాలన్నింటికీ ప్రశ్నలన్నింటికీ జవాబులివ్వబడ్డాయి. యెహోవాసాక్షుల దగ్గర సత్యముందని నేను పూర్తిగా ఒప్పించబడ్డాను.”
“వెల్లడి చేయబడిన దేవుని నామాన్ని దాచి ఉంచడానికో దానికి బదులుగా మరొకటి వాడడానికో సత్యారాధన ప్రయత్నం చేస్తుందా?” “సత్యరాధన తన బోధలతో ఎలాంటి ప్రవర్తనకు దోహదపడాలి?” “దేవుడు అంగీకరించిన ఆరాధన యుద్ధాల్లోనూ జాతీయ లేదా వర్గీయ మారణకాండల్లోనూ పాల్గొనేందుకు అనుమతిస్తుందా?” అనేటువంటి ప్రశ్నలకు తేజరిల్లు!లోని ఆ శీర్షిక జవాబిచ్చింది.
బైబిలు సత్యం కొరకైన మీ దాహాన్ని తీర్చుకునేందుకు తేజరిల్లు! మీకు కూడా సహాయపడగలదని మాకు నమ్మకం ఉంది. మీకూ ఒక ప్రతి కావాలనుకుంటే, లేదా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో బైబిలు విషయాలను చర్చించాలని మీరు ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, అనే చిరునామాకు లేదా 5వ పేజీలో ఉన్న మరో సముచితమైన చిరునామాకు వ్రాయండి.