కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 1/8 పేజీ 31
  • ఈ కుడూ మరిచిపోలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ కుడూ మరిచిపోలేదు
  • తేజరిల్లు!—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎయిడ్స్‌—విజృంభిస్తోన్న మహమ్మారి
    తేజరిల్లు!—1998
  • నా గురించి నాకు పూర్తిగా తెలుసా?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
తేజరిల్లు!—1997
g97 1/8 పేజీ 31

ఈ కుడూ మరిచిపోలేదు

దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

ఆకర్షణీయమైన, వంకీలు తిరిగిన కొమ్ములు మరియు ప్రత్యేకమైన చెవులుగల, లేడి జాతికి చెందిన అందమైన మగ కుడూ పూర్తిగా ఎదిగినప్పుడు భుజాల వరకు దాదాపు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఆడదానికి సాధారణంగా కొమ్ములుండకపోయినప్పటికీ, దాని పెద్ద చెవుల మూలంగా అది కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కుడూ బిడియపడే జంతువు, ఎప్పుడూ మెలకువ కల్గివుంటూ, దాక్కోవడానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉంటుంది. అయితే, జింబాబ్వేలోని కరెన్‌కు సంభవించినది విశేషమైన విషయం.

ఆఫ్రికన్‌ వైల్డ్‌లైఫ్‌ పత్రికలో నివేదించబడినట్లుగా, వైర్ల కంచెలో చిక్కుకుపోయి కనుగొనబడిన చిన్న ఆడ కుడూ దూడ తప్పించబడి కరేన్‌కు ఇవ్వబడింది, ఆమె దానికి కొన్ని వారాలపాటు సీసాతో పాలుపట్టింది. అది బలంగా ఎదుగుతూ, కరేన్‌ మరియు ఆమె కుటుంబం నివసిస్తున్న పాడి స్థలంలోనే ఉండిపోయి, తరచూ పిల్లలతో కుక్కలతో ఆడుకునేది. అయితే, అది మెల్లిగా మళ్లీ అడవిలోకి వెళ్లిపోయి అప్పుడప్పుడూ తిరిగివచ్చేది, అది దాదాపు పూర్తిగా ఎదిగిన తర్వాత ఇక తిరిగి రాలేదు.

సుమారు రెండు సంవత్సరాల తర్వాత, కరేన్‌ పొలానికి వెళ్లే రోడ్డు మీద కారులో వెళ్తూ, గర్భంతోవున్న ఒక కుడూ ఆవు తన కారు సమీపిస్తున్నా పారిపోకుండా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె దానివైపు నడవడం ప్రారంభించినా అది పారిపోలేదు. ఈ సరికల్లా, ఇది తాను సీసాతో పాలు పట్టిన ఆ జంతువేనని ఆమె గుర్తించింది, కాబట్టి మెల్లిగా దాని దగ్గరికి వెళ్తూ ఆమె నెమ్మదిగా మాట్లాడింది. ఆవు కూడా ఆమెను గుర్తించింది అందుకే ఆమె తనను హత్తుకోవడానికి అది అనుమతిస్తూ తన తల వంచి ఆమెను తన ముట్టెతో స్పర్శించింది!

కొన్ని నెలల తర్వాత, ఈసారి ఒక లేదూడతోపాటు ఆవు మళ్లీ రోడ్డు దగ్గరికి వచ్చింది. ఆ దూడను దాని తల్లి గర్వంగా పరిచయం చేస్తున్నట్లు కరేన్‌ భావించింది, ఆమె తనను లాలించడానికి అది మళ్లీ అనుమతించింది. కొన్ని వారాల తర్వాత అలాంటి సంగతే జరిగింది. వాస్తవానికి ఆ ఆవు ఇప్పుడు కరేన్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది.

ఇంకా కొన్ని నెలలు గడిచాయి, ఇదే కుడూ ఆవు మెడ చుట్టూ తాడు జారుముడి వేయబడివుండడాన్ని చూశామని కొంతమంది పొలంపనివాళ్లు చెప్పారు. ఆ ముడిని తీసివేయడానికి దాని దగ్గరికి వెళ్లడానికి వాళ్లు ప్రయత్నించారు గానీ ఆ ఆవు పారిపోయింది. కాబట్టి కరేన్‌ దాని కొరకు వెదుకుతూ పొదల్లోకి వెళ్లింది, అలా వెళ్తూ దాన్ని పిలిచింది. వెంటనే అది ఆమె ముందుకు వచ్చింది. కరేన్‌ ముందే ఆలోచించి ఆ ఆవుకు ఇష్టమైన బ్రెడ్‌ తనతో పాటు తెచ్చి, దాన్ని ఇస్తుండగా, కరేన్‌ భర్త అడ్డుగావున్న ఆ ముడిని కత్తిరించివేశాడు.

మనిషికి మృగానికి మధ్య అంతకాలం కొనసాగిన ఆ స్పష్టమైన బంధం ఈ కుటుంబానికి ఎంతో ఆనందాన్నితెచ్చింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి