తేజరిల్లు! ఒక జీవాన్ని కాపాడేందుకు సహాయపడింది
ఈక్వెడార్‌లోని ఓ యెహోవాసాక్షి, మెకానిక్ తన కారును బాగు చేస్తున్నప్పుడు వేచి ఉండగా, తన పసి పిల్లాడైన బైరన్ విషయమై తాను చింతిస్తున్నానని ఆ మెకానిక్ భార్య సాక్షికి చెప్పింది. వాడు వారానికి ఐదు లేక ఆరు సార్లు కంపిస్తాడు, అయితే వైద్యులు సమస్యేమిటో గుర్తించలేకపోయారు. రాజధాని నగరమైన కీటోలోని వైద్య నిపుణుల వద్దకు కూడా ఆ బాలున్ని తీసుకువెళ్లడం జరిగింది.
ఆ సాక్షి ఇలా వివరిస్తుంది: “ఆ తల్లితో సంభాషిస్తున్నప్పుడు, ఒక పని వాడు కారుకు పెయింటు వేయడాన్ని నేను గమనించాను, మరి లెడ్ పాయిసనింగ్ను గురించిన ఒక తేజరిల్లు! (ఆంగ్లం) శీర్షిక నాకు జ్ఞాపకం వచ్చింది. లెడ్ పాయిసనింగ్కుగల సూచనల్లో కంపించడం ఒకటని ఆ శీర్షిక పేర్కొన్నది. నేనా శీర్షికను ఆమెకు తెచ్చిస్తానని ఆ స్త్రీతో చెప్పాను.”
బైరన్ తలిదండ్రులు ఆ శీర్షికను చదివినప్పుడు, తమ కుమారుడు లెడ్ పాయిసనింగ్ విషయంలో పరీక్షింపబడేందుకు ఆ బాలున్ని తీసుకెళ్లారు. బైరన్ రక్తంలో చాలా ఎక్కువ మోతాదులో లెడ్ కనుగొనబడింది. వైద్య చికిత్స మరియు ఇక మీదట లెడ్కు దూరంగా ఉండటం బైరన్ ఆరోగ్యంలో గణనీయమైన అభివృద్ధిని కలిగించాయి. ఆ సాక్షి ఇలా చెప్పింది: “గత నాలుగు నెలల్లో ఆ బాలుడు ఒక్కసారి కూడా కంపించలేదు. ఆ బాలుని తండ్రి అప్పటినుండి అనేకమంది వైద్యులతో ఆ కేసును గురించి మాట్లాడాడు, మరియు తన కుమారుని జీవితాన్ని కాపాడిందని అతను ఎల్లప్పుడూ తేజరిల్లు!కు ఆ ఘనతను ఆపాదిస్తాడు. ఇప్పుడు ఆ వైద్యుల్లో కొందరు కూడా తేజరిల్లు!ను చదువుతున్నారు.”
తేజరిల్లు!ను చదవడం ద్వారా మీరు కూడా ప్రయోజనం పొందుతారని మాకు నమ్మకం ఉంది. మీరు ఒక ప్రతిని అందుకోవాలనుకుంటే లేక ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో బైబిలును చర్చించాలని మీరు ఇష్టపడినట్లైతే, Praharidurg Prakashan Society, Plot A/35 Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., India,కు లేక 5వ పేజీలో ఇవ్వబడిన సరైన చిరునామాకు వ్రాయండి.