కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 9/8 పేజీ 3
  • దుర్ఘటన యొక్క ఫలితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుర్ఘటన యొక్క ఫలితం
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • పెరిగిపోతున్న శరణార్థుల సంఖ్య
    తేజరిల్లు!—1996
  • ‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ పరదేశులకు సహాయం చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • శరణార్థుల ఆటుపోట్లు—లక్షలమంది యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయారు
    అదనపు అంశాలు
  • పరిష్కారం ఏమిటి?
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 9/8 పేజీ 3

దుర్ఘటన యొక్క ఫలితం

ఓ శరణార్థి పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ప్రశాంతంగా జీవిస్తున్నారని, అయితే అకస్మాత్తుగా మీ ప్రపంచమంతా మారిపోతుందని ఊహించుకోండి. రాత్రికి రాత్రే, పొరుగువారు శత్రువులౌతారు. మీ ఇంటిని దోచుకుని, దాన్ని కాల్చేయడానికి సైనికులు వస్తున్నారు. మీరు వస్తువులను సర్దుకుని, మీ జీవితాన్ని కాపాడుకునేందుకు పారిపోడానికి పది నిమిషాలు మాత్రమే ఉన్నాయి. మీరు ఓ చిన్న సంచీనే తీసుకెళ్లగలరు, ఎందుకంటే మీరు దాన్ని ఎన్నో కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు దాంట్లో ఏం పెట్టుకుంటారు?

తుపాకీ కాల్పుల మధ్య, ఫిరంగీ ధ్వనుల మధ్య మీరు పారిపోతున్నారు. పారిపోతున్న ఇతరులతోపాటూ కలిసి మీరూ పారిపోతారు. దినాలు గడుస్తున్నాయి; ఆకలిగొని, దాహంతో మీరు చెప్పలేనంత అలసటతో కాళ్లీడ్చుకుంటూ నడుస్తున్నారు. మీరు బ్రతికుండాలంటే, ఎంత అలసిపోయి ఉన్నా మీరు నడవాల్సిందే. మీరు నేలపై పడుకుంటారు. తినేందుకు ఏమైనా లభిస్తుందేమోనని మీరు పొలంలో వెదకుతారు.

మీరు ఓ భద్రతగల దేశాన్ని చేరుకుంటారు, అయితే సరిహద్దు సైనికులు మిమ్మల్ని లోనకు ప్రవేశించనివ్వరు. వాళ్లు మీ సంచీని వెదకి, విలువైన ప్రతి దాన్నీ తీసేసుకుంటారు. మీరు మరో చెక్‌పాయింట్‌ చేరుకుంటారు, మీరు అక్కడ సరిహద్దు దాటుతారు. మిమ్మల్ని మురికిగా ఉన్న ఓ శరణార్థ శిబిరంలో పడేస్తారు, దానికి ముళ్ల తీగ కంచెగా ఉంటుంది. మీవంటి పరిస్థితినే కలిగివున్న ఇతరుల మధ్య మీరు ఉన్నప్పటికీ, మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు, గాబరా పడతారు.

మీ కుటుంబీకుల, స్నేహితుల కొరత మీకు ఉంటుంది. బయటినుండి వచ్చే సహాయంపై మీరెంతో ఆధారపడి ఉంటారు. మీకేమి పని లేదు, చేయడానికి ఏమీ లేదు. నిరాశ, నిస్పృహ మరియు కోప భావాలతో మీరు పోరాడతారు. శిబిరంలో తాత్కాలికంగా మాత్రమే ఉంటానని తెలుసుకుని మీరు మీ భవిష్యత్తు విషయమై చింతిస్తారు. ఎంతైనా శిబిరం ఇల్లు కాదు—అది ఓ విశ్రాంతి గది లాంటిది లేక ఎవరికీ అక్కరలేని ప్రజల గిడ్డంగి వంటిది. మీరు ఎక్కడినుండి వచ్చారో అక్కడికే మిమ్మల్ని బలవంతంగా పంపిస్తారేమో అని మీరు ఆలోచించవచ్చు.

నేడు కోట్లాదిమంది ప్రజల అనుభవమిది. ఐక్యరాజ్యసమితి శరణార్థి హైకమిషనర్‌ (UNHCR) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల డెబ్బై లక్షలమంది ప్రజలు యుద్ధం లేక హింస వలన పారిపోయారు. మరి అదనపు రెండు కోట్ల ముప్పై లక్షలమంది ప్రజలు తమ స్వంత దేశాల్లోనే నిర్వాసితులై ఉన్నారు. విషయాలన్నీ పరిశీలించిన తర్వాత, భూమిపైనున్న ప్రతి 115 మంది ప్రజల్లో ఒకరు పారిపోయేందుకు ఒత్తిడి చేయబడ్డారని తెలుస్తుంది. వారిలో అధిక శాతంమంది స్త్రీలూ పిల్లలే. యుద్ధం మరియు ఆపద యొక్క ఫలితాలైన శరణార్థులు, తాము ఎవరై ఉన్నామనే దాన్నిబట్టి కాక తాము ఏమై ఉన్నామనే దాన్నిబట్టి తమను వద్దనే ప్రపంచంలో, తమను నిరాకరించే ప్రపంచంలో అసహాయంగా ఉన్నారు.

వారి ఉనికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికమైన అల్లకల్లోలానికి ఓ సూచన. UNHCR ఇలా పేర్కొంటుంది: “శరణార్థులు సాంఘిక అనైక్యతకుగల అంతిమ చిహ్నం. ఓ దేశం యొక్క సాంఘిక మరియు రాజకీయ పతనం యొక్క తీవ్రతను నిర్వచించే ప్రభావాలు మరియు ప్రతిఫలాల పరంపరలో వారు చివరి, అత్యంత స్పష్టమైన కొక్కెంలా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, వారు మానవ నాగరికత యొక్క ప్రస్తుత స్థితిని సూచించే భారమితి అయ్యున్నారు.”

సమస్య యొక్క పరిమాణం ఊహించలేనంత పెద్దదని మరియు దాని అంతం కనుచూపు మేరలో లేనంతగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితికి ఏది దారితీసింది? ఏదైనా పరిష్కారం ఉందా? తదుపరి శీర్షికలు ఈ ప్రశ్నలను పరిశీలిస్తాయి.

[Picture Credit Lines on page 3]

Boy on left: UN PHOTO 159243/J. Isaac

U.S. Navy photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి