వృథా చేయకపోతే, కొరత ఉండదు
మన ఆధునిక వినియోగదారుల సమాజంలో, చెత్తను మరియు ప్రమాదకరమైన వ్యర్థపదార్థాలను నిరపాయకరంగా పడేయడం ఓ పీడకలగా మారింది. దానికి విరుద్ధంగా, దేవుని సృష్టి పొదుపు మరియు పునరుపయోగం విషయాల్లో ఎంతో అద్భుతంగా ఉంది. ఉదాహరణకు తేనెపట్టును పరిశీలించండి. తేనెపట్టును కట్టేందుకు అవసరమైన మైనం ఎంతో ఖరీదైన పదార్థం—ఓ తేనెటీగ కేవలం ఒక గ్రాము మైనాన్ని తయారు చేయాలంటే దానికి 16 గ్రాముల తేనె, లెక్కలేనంత పుప్పొడి అవసరమౌతాయి. తేనెటీగలు తమ మైనాన్ని ఎలా పొదుపు చేస్తాయి? “తేనెపట్టులోని గడులకున్న మూడు మైనపు గోడలు, 120 డిగ్రీల కోణంలో ఒకే చోట కలుస్తాయి, అలా షట్కోణాల వరుస ఏర్పడుతుంది. ఈ అమరిక తేనెను దాచేందుకు చిన్న గడులను ఏర్పాటు చేస్తూ, తేనెటీగలు తక్కువ మైనాన్ని ఉపయోగించేందుకు వీలు కలిగిస్తుందని” ప్రకృతి రూపకల్పన ద్వారా (ఆంగ్లం) అనే పుస్తకం వివరిస్తోంది. కాబట్టి ఓ వివేకవంతమైన ఆకృతి, అందమైన రూపాన్ని మరియు పనిలో పొదుపును అందిస్తుంది, దాన్ని మళ్లీ ఉపయోగించుకోవచ్చు కూడా!
మీరు విజ్ఞానం మరియు నైసర్గిక అద్భుతాలను గురించిన శీర్షికలను చదవాలని ఇష్టపడితే మరియు తేజరిల్లు!ను క్రమంగా తెప్పించుకోవాలనుకుంటే, మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా 5వ పేజీలోని చిరునామాల్లో మీకు దగ్గరగా ఉన్న దానికి వ్రాయండి.