కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీ 32
  • అవి ఆమె శ్రద్ధను ఆకర్షించాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవి ఆమె శ్రద్ధను ఆకర్షించాయి
  • తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీ 32

అవి ఆమె శ్రద్ధను ఆకర్షించాయి

1995 మే నెలలో న్యూయార్క్‌ నగరంలోని ఒక స్త్రీ న్యూయార్క్‌ నందలి బ్రూక్లిన్‌లో గల యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయానికి ఒక ఉత్తరం వ్రాసింది. ఆమె ఇలా వివరించింది:

“నేను ఈస్ట్‌ 124వ వీధిలో ఒకటీ రెండు అవెన్యూల నడుమ నడుస్తున్నాను. అప్పుడు నేను క్రిందికి చూడడం, కొన్ని కరపత్రాలు గాలికి ఎగరడమూ జరిగింది. నేను వంగి, కృంగిన వారికి ఓదార్పు, కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? అనే మీ మూడు కరపత్రాలను తీసుకున్నాను. నేను వాటిని చదివి చాలా సంతోషించాను.

“మీరు నాపై దయవుంచి, ఉచిత బైబిలు పఠనాన్ని గూర్చి మరింత సమాచారాన్ని నాకు పంపిస్తే నేను చాలా సంతోషిస్తాను. అలాగే, సాధ్యమైతే మీ సాహిత్యాల్లో కొన్నింటిని పొందడానికి ఇష్టపడతాను. మంచివాడైన ప్రభువు నేను వెళ్లే దారిలో నేను చూసేలా మూడు కరపత్రాలను వేయడం నా వరకైతే గొప్ప ఆశీర్వాదమే. ప్రభువు నిజంగా అద్భుతమైన విధాల్లో పని చేస్తాడు.”

శ్రద్ధనాకట్టుకునే ఈ కరపత్రాలను మీరు చదవాలని అనుకుంటున్నట్లయితే, లేదా ఉచిత బైబిలు పఠనం కావాలనుకుంటున్నట్లయితే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, లేదా ఐదవ పేజీలోని సరైన చిరునామాకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి