కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 10/8 పేజీ 31
  • సరిపడేన్ని నీళ్లు ఉంటాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరిపడేన్ని నీళ్లు ఉంటాయా?
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచినీరు
    తేజరిల్లు!—2023
తేజరిల్లు!—1995
g95 10/8 పేజీ 31

సరిపడేన్ని నీళ్లు ఉంటాయా?

“భూమి యొక్క మొత్తం నీళ్లలో కేవలం 2% మాత్రమే మంచి నీరు, ఉపయోగించుకోగల ఆ నీటిలో 2/3 పోలార్‌ మరియు గ్లేసియర్‌ ప్రాంతాల్లో గడ్డకట్టి ఉంది, అలా 1% [కంటే తక్కువ] ద్రవ రూపంలో మంచి నీరు ఉంటుంది.”—పరిశోధన మరియు అన్వేషణ, నేషనల్‌ జియోగ్రఫీ యొక్క ప్రచురణ.

మీ ఇంట్లో మంచి నీటి సరఫరాకు ఏర్పాటు ఉందా? ఉన్నట్లయితే మీరు ధన్యుల్లో ఒకరు. కోట్లాదిమంది తరచూ కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవల్సి ఉంటుంది—అవి తరచూ త్రాగడానికి తగినవిగా ఉండవు. ఇతరులు ఈ అమూల్యమైన ద్రవం కొరకు కొంతైనా పట్టుకోడానికి ప్రజా కొళాయిల వద్ద లేక టాంకుల వద్ద గుమికూడాల్సి ఉంటుంది. పరిశోధన మరియు అన్వేషణ ఇలా పేర్కొన్నది: “మానవులు ఎక్కువవుతుండగా, నీటి సరఫరా మరియు ఉపయోగానికి సంబంధించి సమస్యలు అధికమౌతాయి. దాదాపు 100 కోట్లమంది సరైన మంచినీటిని పొందడం ఇప్పటికే కష్టమని లేక అసాధ్యమని కనుగొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి.” దాని అర్థం ప్రపంచంలోని దాదాపు ప్రతి 5 మందిలో ఒకరు ఉపయోగించగల నీటి కొరకు కటకటలాడుతున్నారు.

ఈ నీటి కొరతలో భవిష్యత్తు గొడవల విత్తనాలు ఇప్పటికే విత్తబడ్డాయి. ఒక నిపుణుడు ఇలా చెప్పాడు: “అత్యంత అధిక శాతంమంది ప్రజలు చరిత్రలో కుంటుబడిపోతారు, పేదరికాన్ని, సాంప్రదాయ వికలతను మరియు మతపర గొడవలను అధిగమించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగమైన ఇళ్లల్లో అంటే త్రాగడానికి నీరు, దున్నేందుకు భూమి, మరి ఉండేందుకు స్థలం లోపించిన గుడిసెలలో ఉంటారు.”

ఈ అమూల్యమైన సంపదను జ్ఞానయుక్తంగా ఉపయోగించడానికి మనం వ్యక్తిగతంగా ఏమి చేయగలము? అది విలువైన మరియు తగు మాత్రమే ఉన్న సంపద గనుక దాన్ని పొదుపుగా, జాగ్రత్తగా ఉపయోగించండి.

1) నీళ్లను వృథా చేయకండి. పళ్లు తోముకుంటున్నప్పుడు లేదా గెడ్డం చేసుకుంటున్నప్పుడు కొళాయిలను అనవసరంగా తెరిచి ఉంచకండి. మీరు షవర్‌ను ఉపయోగించగల ధన్యులమని భావిస్తూ షవర్‌ క్రింద ఎక్కువ సమయం గడపకండి!

2) నీళ్లను పాడుచేయకండి లేక కలుషితం చేయకండి. మీరు నివసించే ప్రాంతంలో కలుషితమైన నది ప్రవహిస్తుంటే, నది ఎగువభాగాన ఉన్నవారెవరో మీ సమాజానికి అత్యంత ప్రాముఖ్యమైన జీవనాధారాన్ని నాశనం చేస్తున్నారన్నమాట. ఈ కాలుష్యానికి ముఖ్య బాధ్యత నగర అధికారులు, పారిశ్రామికవేత్తలు, రైతులు మరియు చెత్తా చెదారాన్ని, రసాయన ఉత్పాదకాలను కాలువల్లోకి, నదుల్లోకి ప్రవహించడానికి లేక పారడానికి అనుమతించే ఇతరులపై ఉంటుంది.

భూమి యొక్క సృష్టికర్తగా, యజమానిగా దేవుడు మనం ఈ గ్రహాన్ని ఉపయోగించే విధానాన్ని గురించి మన నుండి జవాబు కోరుతున్నాడు. యెహోవా వాస్తవానికి ‘భూమిని నశింపజేయు వారిని నశింపజేస్తాడని’ బైబిలు ప్రవచిస్తుంది.—ప్రకటన 11:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి