జపాన్‌లో అకస్మాత్తుగా సంభవించిన విపత్తును ప్రజలెలా ఎదుర్కున్నారు
జపాన్‌లోని తేజరిల్లు! విలేఖరి
జపాన్‌లోని కోబ్ ఒకప్పుడు వర్ధిల్లుతున్న 15,00,000 మంది జనాబా ఉన్న నౌకాశ్రయము గల నగరం. కాని 20 సెకండ్లలో రిక్టర్ స్కేలుపై 7.2 పాయింట్ల పరిమాణం గల భూకంపం దానిని చాలా మట్టుకు నాశనం చేసింది. లక్షలాది ఇండ్లు, భవనాలు నాశనం చేయబడ్డాయి లేదా పాడు చేయబడ్డాయి, 3,00,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అమెరికానందలి, కాలిఫోర్నియాలోని నార్త్రిడ్జ్ను సర్వనాశనం చేసిన భూకంపం సంభవించి 61 మంది ప్రజలు చనిపోయిన రోజుకు సరిగ్గా ఒక సంవత్సరానికి అంటే జనవరి 17, 1995న విపత్తు సంభవించింది. కోబ్ భూకంపం ముందటి భూకంపం విడుదల చేసిన దానికన్నా రెండు రెట్ల భూప్రకంపన శక్తిని విడుదల చేసింది. టోక్యోను యోకోహామాను నిర్మూలం చేసి, 5,500 కన్నా ఎక్కువ మందిని అంటే దాదాపు 1,43,000 మందిని చంపిన భూకంపం 1923 నుండి సంభవించిన భూకంపాలన్నింటికంటే ప్రాణాంతకమైన భూకంపం.
భయానకమైన క్షణం
ఆ దుర్దిన ఉదయం 5:46 నిమిషాలకు ర్యూజీ కోబ్ నగర నడిబొడ్డున వార్తాపత్రికలను వేస్తున్నాడు. అప్పటికీ చీకటిగానే ఉంది. అకస్మాత్తుగా ఎత్తుగా ఉన్న రైల్వే మీదుగా రైలు వెళ్తునటువంటి చప్పుడైంది. రహదారి, భవనాలు సముద్ర తరంగాల్లా దొర్లాయి. తర్వాత లైట్లన్నీ ఆరిపోయాయి.
వాహనాలను క్రింద ఉన్న రోడ్డుమీదికి త్రోసివేస్తూ ఎత్తులో ఉన్న పెద్ద రహదారులు కూలిపడ్డాయి. రైల్వే ట్రాక్‌లు మట్టి కర్రలా అన్నట్లు వంగిపోయాయి, రైళ్ళు పట్టాలు తప్పాయి. పాత చెక్క భవనాలు కప్పకూలిపోయాయి, రెండస్తుల ఇండ్లు అకస్మాత్తుగా, ఒక్కంతస్తు భవనాల్లా కనిపించాయి. కోబ్‌లోని చాలా మంది నివాసులు నిద్ర మేల్కొన్నారు.
వెంటనే మంటలు రగులుకున్నాయి, బ్లాకులన్నీ (పురవిభాగాలన్నీ) దగ్ధమయ్యాయి. భూకంపం నీటి సరఫరాలను నిలిపివేసింది గనుక, అగ్నిమాపక దళాలు నిస్సహాయంగా చూస్తుండిపోయాయి. భూకంపాన్ని ఎదుర్కొని నిలవగల ఇండ్లన్న మిథ్యాభావన ఒక్క క్షణంలో సమసిపోయింది.
వెండ్రుకవాసిలో తప్పించుకోవడాలు విషాదమైన అనుభవాలు
భూకంపానికి నేరుగా గురైన ప్రాంతంలో, 76 సంఘాలతో సహవసించే 3,765 మంది యెహోవాసాక్షులు ఉండేవారు. ఆ ఉదయం భూకంపం జరిగిన తరువాత, 13 మంది సాక్షులు ఇద్దరు బాప్తిస్మం పొందని ప్రచారకులు చనిపోయారని తేలింది. (ప్రసంగి 9:11) ఆ సమయంలో పోలీసులు తెలిపిన మరణ సంఖ్య ఎంతంటే 1,812, కాని ఒక్క వారంలోనే అది 5,000కు పెరిగింది. సాక్షులు తమ సంఘాలతో సహవసించిన వారిని వెంటనే కనుగొనడం వల్ల, మరణించినవారి ఆ సంఖ్య అలాగే మిగిలిపోయింది.
మిసావో భర్త పెందలకడనే పనికి బయలుదేరాడు. “దాదాపు ఒక గంట తరువాత, ఇల్లు కదిలింది. పై కప్పు పెంకులు నా చుట్టూ పడ్డాయి. సరిగ్గా ఒక గంట క్రితం నా భర్త తన తల పెట్టుకున్న దిండుపై కప్పు మధ్యభాగంలోని పెద్ద పెంకు వచ్చిపడింది” అని మిసావో చెప్పింది. సొరుగుల బల్ల మరియు పుస్తకాల కేసు మీసావో మీదుగా ఒకదానికొకటి ఎదురెదురుగా పడ్డాయి. ఇది ఆమెను పైకప్పు పెంకుల క్రింద పూడుకుపోకుండా కాపాడింది.
మ్యావ్ మ్యావుమని అరుస్తున్న ఒక పిల్లి హిరోమాసా అనే పేరు గల 16 ఏండ్ల బడిపిల్లవానిని మేల్కొలిపింది. అతడు పిల్లిని బయటకు పంపుతుండగా భూకంపం సంభవించింది. అతడు తిరిగి వచ్చినప్పుడు, తన తల్లి దూరదర్శినికి, పుస్తకాల కేసుకి క్రింద ఉండడాన్ని చూశాడు. ఆమె ప్రాణాలతో ఉండడం చూసినప్పుడు అతడు ఊపిరి పీల్చుకున్నాడు! హిరోమాసా పొరుగువాని నుండి ఫ్లాష్‌లైట్ తీసుకువచ్చి తన తల్లిని బయటకు లాగాడు. వెంట్రుకవాసిలో తప్పించుకున్న అనుభవాలు వేలాదిమందికి ఉన్నాయి. అయితే మరితర సాక్షులు మరింత విషాదకరమైన విషయాలను అనుభవించారు.
హిరోషి మరియు కాజు కానెకో తమ ఇల్లు కూలి విరిగిపోయిన ముక్కల క్రింద కూరుకుపోయారు. క్రైస్తవ సంఘ సభ్యులు వారికి సహాయపడేందుకు ఆ స్థలానికి పరుగెత్తారు. ఉదయం 10.00 గంటల తరువాత హిరోషి బయటకు తీయబడి ఆసుపత్రికి తీసుకువెళ్ళబడ్డాడు. అయితే కాజు తరువాత వెలుపలికి తీయబడే సరికి చనిపోయింది.
బాప్తిస్మం పొంది రెండు సంవత్సరాలే గడిచిన 24 సంవత్సరాల మియోకో టెషెమాకు పూర్తికాల పరిచర్య లక్ష్యంగా ఉండేది. భూకంపం జరిగిన ఉదయాన ఆమె భవనం యొక్క రెండవ అంతస్తు కూలిపోయినప్పుడు తాను మొదటి అంతస్తులో నిద్రపోతుంది. మియోకో వాసాలకు దూలాల క్రింద కూరుకుపోయింది. ఆమె తలిదండ్రులు మరియు పొరుగువారు ఆ పెంకులను తొలగించడానికి ప్రయత్నం చేశారు కాని, తీయలేకపోయారు. బైబిలు విద్యార్థినియైన ఆమె తల్లి యెహోవాసాక్షులను సంప్రదించింది, వారు సహాయానికి వచ్చారు.
ఏడు గంటల తరువాత మియోకోను బయటికి లాగినప్పుడు కూడా ఆమె ప్రాణంతోనే ఉంది. ఆమెకు కార్డియోపల్మనరీ రెసిసుటేషన్ చేయడంలో డాక్టరు, నర్సులతోపాటు ముగ్గురు క్రైస్తవ పెద్దలు వంతులు తీసుకున్నారు, కాని మియోకో చనిపోయింది. ఆమె విశ్వాసాన్ని వ్యతిరేకించిన ఆమె తండ్రి, సాక్షులు తన కూతురును రక్షించడానికి చేసిన ప్రయత్నాలకు చలించినవాడై, అంత్యక్రియలను సాక్షుల పద్ధతిలోనే జరిపించాలని ఆమె క్రితం చేసిన వినతిని అంగీకరించాడు.
టకావో జెంగుజి అనే ఒక క్రైస్తవ పెద్ద తన భార్యా, కూతురుతో ఒక పాత అపార్ట్మెంట్ భవనం మొదటి అంతస్తులో నివసించేవాడు. “భూకంపం సంభవించినప్పుడు, మాపైనున్న అంతస్తు మామీద కూలిపడింది, నేను బుక్‌షెల్ఫ్ కింద ఇరుక్కుపోయాను. చివరికి, నా అంతట నేనే ప్రయత్నం చేసి భవనం నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయనారంభించాను. నేను అకస్మాత్తుగా ఒక స్వరం విన్నాను. అది మా కోసం వెతుక్కుంటూ వచ్చిన పొరుగువాడైన సాక్షిది” అని ఆయన చెబుతున్నాడు.
టకావో చివరికి బయటికి వస్తుండగా, మంటలు చుట్టుప్రక్కల ఉన్న భవనాల్లో నుండి తన అపార్ట్మెంట్కి వ్యాపించడం ఆయన చూశాడు. కనుక అతడు రాళ్ళ మధ్యలోకి తిరిగి వెళ్ళి, తన భార్యను బయటకు లాగడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. ఏకో అనే పేరుగల 26 ఏండ్ల తన భార్య, తన కూతురు నవోమీ చనిపోయారు. ఇలా జరిగినప్పటికీ, అతడు తన సంఘంలోని ఇతర సభ్యులకు సహాయపడడం మొదలెట్టాడు. “నేను నా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాను. కనుక నా శ్రద్ధను ఇతరులకు సహాయం చేయడానికి మళ్ళించాను. మా సంఘంలోని అందరూ క్షేమంగా ఉండడం చూసి హమ్మయ్య అనుకున్నాను” అని ఆయన తర్వాత చెప్పాడు.
నిరాశాజనకమైన పరిస్థితి
వేలాదిమంది పాఠశాలల్లోను, పబ్లిక్ భవనాల్లోను ఆశ్రయాన్ని పొందారు. తరువాత కూడా భూకంపాలు సంభవిస్తాయని భయపడుతూ అనేకులు బయటే ఉండిపోయారు లేదా తమ కార్లలోనే నిద్రపోయారు. రైల్వేలు మరియు హైవేలు ముక్కముక్కలయ్యాయి, సహాయ సరఫరాల రవాణా కొరకున్న రహదారులు వేలకొలది వాహనాలవల్ల ఆటంకపర్చబడ్డాయి. ఎన్నో రోజులు అనేకులకు తినడానికి ఏదో కొంత ఉండేది లేదా అసలు తినడానికే లేకుండా పోయింది. అయినప్పటికీ, దోపిడీల నివేదికలేవీ లేవు, అనేకులు తమ వద్ద ఉన్న కొంచెం ఆహార పదార్థాలను కూడా పంచుకున్నారు.
“ఇది రెండవ ప్రపంచ యుద్ధానంతరంలా ఉంది” అని కంబళిని చుట్టుకొనివున్న వృద్ధుడు కన్నీళ్ళు చెక్కిళ్ళ మీదుగా జారుతుండగా చెప్పాడు. జపానీయుల ప్రధానమంత్రి టోమిచి మురాయమ నష్టాన్ని సర్వే చేసి, ఈ విధంగా నివేదించాడు: “నేనిలాంటిదేదీ చూడనే లేదు. ఇది ఎవరికైనా ఊహాతీతమే.”
సాక్షులు వెంటనే ప్రతిస్పందించారు
క్రైస్తవ పెద్దయైన కేజీ కోషిరో ఉదయం భూకంపం సంభవించిన కోబ్ నగర క్రింది భాగాన్ని సందర్శించి, అక్కడ కలిగిన భయంకరమైన నాశనాన్ని చూసి, ఆయన తన ఇంటికి తిరిగివెళ్ళి, తీవ్రంగా బాధించబడిన తోటి క్రైస్తవుల కొరకు ఆహారాన్ని తయారు చేయడానికి స్థానిక సంఘాన్ని సంస్థీకరించాడు. సాయంకాలానికెల్లా, ఆహారాన్ని, పానీయాన్ని కోబ్ కేంద్రంలోనున్న సంఘాలకు కారుద్వారా ఆయన సరఫరా చేశాడు. మరుసటి రోజు ఉదయం, మరింత ఆహారం మరియు నీళ్ళు అందించబడ్డాయి. రహదారులు రద్దీగా ఉన్నందువల్ల అందించవలసిన సహాయ సరఫరాలను రవాణా చేసేందుకు 16 మోటారు సైకిళ్ళను సాక్షులు సంస్థీకరించారు.
ఇతరులు అనేకులు కూడా తమ క్రైస్తవ సహోదరులను వెదకడానికి, సహాయం చేయడానికి చొరవ తీసుకున్నారు. కోబ్ తరువాత ఉన్న ఆషియా అనే పేరుగల మరో పట్టణానికి టొమెయోకీ ట్సుబోయి మరియు మరో సంఘ పెద్ద మోటారు సైకిళ్ళపై ప్రయాణం మొదలు పెట్టారు. ఆషియా కూడా తీవ్రంగా దెబ్బతినింది. ఆషియాకు దిగువభాగాన ఉన్న నగరంలోని రాజ్యమందిరం వద్ద, ప్రయాణ కాపరియైన యోషినోబు కుమడ అప్పటికే సహాయ కేంద్రాన్ని స్థాపించాడని వారు కనుగొన్నారు.
అవసరాన్ని గూర్చి సహోదరులను అప్రమత్తులను చేయడానికి ఫోన్లు చేశారు, వెంటనే సరఫరాలు సమకూర్చబడ్డాయి. తొమ్మిది కార్లు కంబళ్ళను, ఆహారాన్ని, నీటిని ఆషియాకు రవాణా చేశాయి. ఈ సరఫరాలు 40 నుండి 50 మంది ఆశ్రయించిన ఆ నగరంలోని రెండు రాజ్యమందిరాలకు అందించబడ్డాయి. మరి కొందరు తోటి విశ్వాసుల ఇండ్లలో ఆశ్రయాన్ని పొందారు. మరుసటి రోజు, సమీప ప్రాంతంలో ఉన్న సాక్షులు 800 మందికి భోజనం సిద్ధం చేశారు. అవసరంలో ఉన్నవారికి భోజనం కావలసినంత అందజేయబడింది. కాబట్టి సాక్షులు వాటిని అవసరంలో ఉన్న పొరుగువారితో పంచుకున్నారు.
యెహోవాసాక్షులు తమ తోటి విశ్వాసులకు సహాయపడేందుకు భూకంపం వలన బాధించబడిన ప్రాంతానికి వెంటనే వచ్చారు. చూస్తున్న అనేకులను ఇది ముగ్ధులను చేసింది. భూకంపం సంభవించిన వారం తరువాత, ఒక హెలికాప్టర్ పైలెట్ యోకోహామాలోని ఒక సాక్షిని సమీపించి, “భూకంపం జరిగిన రోజున విపత్తు సంభవించిన స్థలానికి వెళ్ళి, ఒక వారం అక్కడ ఉన్నాను. యెహోవాసాక్షులు మాత్రమే ఆ స్థలానికి పరుగెత్తారు. నేను ఎంతో ముగ్ధుడనయ్యాను” అని చెప్పాడు.
సహాయ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది
జపాన్‌లోని ఎబెనాలో స్థాపించబడిన యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీసు సహాయ కార్యక్రమాన్ని సంస్థీకరించేందుకు కోబ్ ప్రాంతానికి వెంటనే నలుగురు ప్రతినిధులను పంపింది. “పాడు కాని రాజ్యమందిరాలను కనుగొని, వారికి సహాయ సరఫరాను పంపడానికి మేము వెంటనే అంగీకరించాము. ఆరు రాజ్యమందిరాలు కనుగొనబడ్డాయి, ఐదు గంటల్లోగా, పట్టగలిగినన్ని సరఫరాలు నింపబడ్డాయి. మిగిలిన సరఫరాలు దగ్గరలో ఉన్న యెహోవాసాక్షుల రెండు పెద్ద సమావేశ మందిరాలకు పంపించబడ్డాయి” అని ఒక ప్రతినిధి నివేదించాడు.
సహాయ నిధి కొరకు బ్యాంకు అకౌంట్ తెరువబడింది, జపాన్‌లోని యెహోవాసాక్షుల సంఘాలన్నింటికీ తెలియజేయబడింది. మొదటి మూడు వ్యాపార దినాల్లో పది లక్షల డాలర్ల డబ్బు విరాళంగా ఇవ్వబడింది. ఆ డబ్బు అవసరమున్నవారి ఉపయోగం కొరకు వెంటనే పంపకం చేయబడింది.
నియమించబడిన సహాయ కేంద్రాల నుండి అవసరమైన సరఫరాలను పొందవచ్చని సంఘాలతో చెప్పబడింది. ప్రతి సంఘంలోని పెద్దలు తమ సంఘాల్లో అవసరతలో ఉన్న సభ్యులకు సరఫరాలను అందించడానికి ఏర్పాటు చేశారు. కుటుంబంలోని అవిశ్వాసులైన సభ్యులను వదిలిపెట్టలేదు. భూకంపానికి గురైన ప్రాంతంలోని క్రైస్తవ పెద్ద యొక్క తండ్రి—క్రితం యెహోవాసాక్షులంటే ఇష్టపడని వ్యక్తి—“నా కొడుకు మతంలోని ప్రజలు వచ్చి మాకు సహాయమందించారు!” అని తన బంధువుతో ఫోనులో గొప్పగా చెప్పుకోవడం వినబడింది.
వస్తు సంబంధమైన సహాయం కంటే మించినది
వెంటనే క్రైస్తవ కూటాలు సంస్థీకరించబడ్డాయి. భూకంపం సంభవించిన రోజే ఒక సంఘం ఆ మంగళవారం కూటం కొరకు పార్కులో కూడుకుంది. ఆదివారంకెల్లా భూకంపానికి గురైన ప్రాంతంలోని దాదాపు అన్ని సంఘాలు తమ క్రమ కావలికోట పఠనాన్ని పార్కుల్లో లేదా ఎక్కువగా దెబ్బ తినని రాజ్యమందిరాల్లో జరుపుకున్నాయి. సరిగ్గానే, ఆ వారం పఠించబడిన డిశంబరు 1, 1994 కావలికోట పత్రిక “ప్రకృతి వైపరీత్యాల . . . . బాధితులకు సహాయపడేందుకు” వనరులను ఉపయోగించగల ఆధిక్యతను గురించి చర్చించింది. “మనం మొదటిసారిగా సహాయాన్ని అందుకున్నాం. నేను మాటల్లో చెప్పలేనంతగా నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మనం మళ్ళీ పాత స్థితికి చేరుకున్న తరువాత, విరాళాలివ్వడంలో నా వంతు నేను చేస్తాను” అని ఒక స్త్రీ వ్యాఖ్యానించింది.
బాగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించేందుకు బ్రాంచ్ ఆఫీసు ప్రతినిధులు మోటారు సైకిళ్ళను ఉపయోగించారు. “సహోదరుల కంట తడిని చూడడం హృదయాన్ని స్పర్శించేదిగా ఉంది. ‘మేము అన్నింటిని కోల్పోయినందుకు ఏడ్వడం లేదుగాని, ఎబినా నుండి మమ్మల్ని సందర్శించడానికి వచ్చిన మిమ్మల్ని చూసి మా హృదయాలు ఆనందించినందువల్లే మా కంట నీరు వచ్చింది’ అని వారు చెప్పేవారు” అని వారిలో ఒకరు నివేదించారు.
భూకంపం జరిగిన 24 గంటల్లోగా, అమెరికా, న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లోని యెహోవాసాక్షుల పరిపాలక సభ అలాగే ఇతర దేశాల్లోని బ్రాంచ్ ఆఫీసులు విచారాన్ని వ్యక్తం చేస్తూ సందేశాలను పంపారు. దాని తరువాతి రోజుల్లో అలాంటి మరెన్నో సందేశాలు అందాయి. గత సంవత్సరం ఫైర్ బాంబింగ్ వల్ల 15 మందిని నష్టపోయిన కొరియా రిపబ్లిక్ లోని పశ్చిమ వంజు సంఘం ఫాక్స్ ద్వారా పంపిన సందేశం నిజంగా కదిలించేదే.a “కోబ్‌లోని మన సహోదరుల బాధలు నిజంగా మా బాధలు మరియు వేదనలే. మాకులాగే మీరు కూడా మీ విపత్తులో ఉన్నప్పుడు ఒంటరివారు కారని దయచేసి గుర్తుచేసుకోండి. ప్రియమైన సహోదరులారా నిరాశచెందకండి!” అని అది ముగించింది.
బ్రాంచ్ ప్రతినిధులు క్రమమైన ఆత్మీయ మద్దతునిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు, కోబ్ ప్రాంతంలో ప్రోత్సాహాన్నిచ్చేందుకు తాత్కాలిక ప్రయాణ కాపరులను అదనంగా నియమించారు. జపాన్‌లోని ఇతర ప్రాంతాల్లోని క్రైస్తవ పెద్దలు కూడా వంతుల వారీగా వచ్చి ఒక వారమో లేదా అంతా కన్న ఎక్కువ రోజులుండి బాధపడుతున్న వారికి ఆత్మీయంగాను, భావోద్రేకంగాను మద్దతునిచ్చేందుకు ఆహ్వానించబడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి విశ్వాసుల నుండి అలాంటి శ్రద్ధ, ప్రోత్సాహం లభించడంతో, బాధించబడిన ప్రాంతంలోని సాక్షులు అనుకూలమైన మరియు ప్రశంసాపూర్వకమైన దృక్పథాన్ని కాపాడుకున్నారు. భూకంపం సంభవించిన తరువాతి మొదటి కూటంలో, “నిన్నటి వరకు మేము కొంత భయంతోనే ఉన్నాం ఎందుకంటే, మేము ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. కాని ఇక్కడికి వచ్చి, లాండ్రి సర్వీస్, స్నానం చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు, సమావేశ మందిరాలను తాత్కాలికంగా నివాస స్థలాలుగా ఉపయోగించుకునే ఏర్పాట్లు వంటి మా ప్రయోజనార్థమై చేసిన దయాపూర్వకమైన ఏర్పాట్లను గూర్చి వినడం నిజంగా మమ్మల్ని చింతల నుండి విడుదల చేసింది. ఇది నిజంగా దేవుని సంస్థ!” అని ఒక సాక్షి చెప్పాడు.
నిజానికి, ఆత్మీయ ధనానికి ప్రాధాన్యతనివ్వడం ఎదుర్కోవడానికి సాక్షులకు సహాయం చేసింది. “నాకు మూడేండ్లున్నప్పటి నుండి నేను యెహోవా యందు నమ్మకముంచేందుకు మా అమ్మ నేర్పింది. ఆమె తర్ఫీదు, క్రైస్తవ సంఘం ద్వారా నేను పొందిన తర్ఫీదు ఈ విపత్కరమైన అనుభవాన్ని సహించడానికి నాకు సహాయపడ్డాయి” అని 20వ పడి ఆరంభంలో ఉన్న ఒక అమ్మాయి చెప్పింది.
పునఃనిర్మించుటకు సంస్థీకరించబడింది
సాక్షుల దాదాపు 350 ఇండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి లేదా నాశనం చేయబడ్డాయి; వీటిలో వంద ఇండ్లు స్వంతమే. సాక్షుల 630 కన్నా ఎక్కువ ఇండ్లకు చిన్న మరమ్మత్తులు అవసరమయ్యాయి. అలాగే పది రాజ్య మందిరాలు ఇక ఉపయోగించలేని విధంగా పాడైపోయాయి.
వెంటనే, రాజ్యమందిరాలను కోల్పోయిన సంఘాలు తిరిగి కట్టుకోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. సాక్షుల పాడైన ఇండ్లను బాగు చేయడానికి జపాన్‌లోని 11 రీజనల్ బిల్డింగ్ కమిటీలు 21 మంది వ్యక్తుల చొప్పున ఒక్కో జట్టును సంస్థీకరించాయి.
కాలాల సూచన
భూకంపాలు మరీ తరచుగా సంభవిస్తున్నాయి. “గత సంవత్సరంలోనే కోబ్‌లో సంభవించిన భూకంపం కన్నా అనేక పెద్ద భూకంపాలు [జపాన్‌లో] సంభవించాయి” అని మాక్లీన్స్ పత్రిక పేర్కొన్నది. రిక్టరు స్కేలుపై 8.1 పాయింట్ల శక్తి గల ఒక భూకంపం అతి పెద్దది, కాని అది ఉత్తరాన ప్రజలు అక్కడక్కడ మాత్రమే ఉన్న చోట జరిగింది.
భూకంపాల ఇలాంటి పెరుగుదల యెహోవాసాక్షులను ఆశ్చర్యచకితులను చేయదు. అంతెందుకు, కోబ్‌లోని తన ఇంటిని భూకంపం కదిపిన వెంటనే ఐదు సంవత్సరాల అతుషి “అక్కడక్కడ భూకంపములు కలుగును”! అని అంటూ అటుయిటు తిరిగాడు. (మార్కు 13:8) వాడు తన తల్లి నుండి ఈ ప్రవచనాన్ని నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు “[తన] రాకడకును ఈ యుగసమాప్తికిని సూచన”ల భాగంగా భూకంపాలను కూడా చేర్చాడు. సూచనలోని ఇతర భాగాల్లో యుద్ధాలు, ఆహార కొరత, తెగుళ్ళు, ప్రేమ అతిగా చల్లారిపోవడం ఇమిడి ఉన్నాయి.—మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5.
కోబ్‌లో సంభవించిన భూకంపం ఈ లోకం యొక్క అంత్య దినాల్లో జీవిస్తున్నామన్న దానికి మరో సూచన మాత్రమే. సంతోషకరంగా, త్వరలో ఈ లోకం స్థానాన నీతియుక్తమైన క్రొత్త లోకం వస్తుందని యేసు సూచనలోని నెరవేరుతున్న భాగం నిరూపిస్తుంది.—1 యోహాను 2:17.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! (ఆంగ్లం) ఏప్రిల్ 22, 1993, 25-7 పేజీలు చూడండి.
[13వ పేజీలోని చిత్రాలు]
టకావో జిన్గుజి ఈ వినాశనాల్లో తన కుటుంబాన్ని కోల్పోయాడు
[14వ పేజీలోని చిత్రం]
నిర్మూలం చేయబడిన రైల్వేస్టేషన్
[14,15వ పేజీలోని చిత్రాలు]
కూలిపోయిన బ్రిడ్జ్
[16వ పేజీలోని చిత్రాలు]
సాక్షులు వెంటనే బాధితుల కొరకు సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు